అఫ్గానిస్తాన్‌లో కూలింది భారత విమానం కాదు: వెల్లడించిన డీజీసీఏ

ఈ విమానం భారత్‌కు చెందినదని మొదట వార్తలు వెలువడగా, ఇది మొరాకోకు చెందిన విమానమని డీజీసీఏ స్పష్టం చేసింది.

లైవ్ కవరేజీ

  1. అయోధ్య రూపురేఖలు ఎలా మారిపోయాయి?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 25 వేల మంది మృతి: హమాస్

    హమాస్

    ఫొటో సోర్స్, Reuters

    ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని హమాస్‌కు చెందిన ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    గత 24 గంటల్లోనే 178 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.

    ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యుద్ధం 2023 అక్టోబర్ 7న మొదలైంది.

  4. రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారిక అహ్వానం అందిందన్న నిత్యానంద

    నిత్యానంద

    ఫొటో సోర్స్, @SRINITHYANANDA

    అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనను ఆహ్వానించినట్లు స్వామి నిత్యానంద సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    తనకు అధికారిక ఆహ్వానం అందిందని ట్వీట్‌లో వెల్లడించారు.

    లైంగిక హింస, అత్యాచారం కేసుల్లో ఆయన పరారీలో ఉన్నారు.

    "అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి నిత్యానంద హాజరవుతారు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    నిత్యానంద 2019లో భారత్ నుంచి పారిపోయారు. అదే ఏడాది యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస అనే కాల్పనిక దేశాన్ని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు.

    2010లో నిత్యానంద తనపై అత్యాచారం చేశాడని ఆయన మహిళా భక్తురాలు ఒకరు ఆరోపించారు.

    ఆ తర్వాత నిత్యానందను అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2018లో అతనిపై చార్జిషీటు దాఖలైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ‘నా ఇద్దరు కొడుకులకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను.. వారి కళ్లలోకి చూడడం కంటే చనిపోవడం మేలనిపిస్తోంది’

  6. ‘‘నన్ను చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోంది’’- వైయస్ షర్మిల; ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరణ, వడిశెట్టి శంకర్ బీబీసీ కోసం

    వైఎస్ జగన్

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పలువురు నేతలు ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

    తొలుత హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ చేరుకున్న ఆమె వైయస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆదివారం ఉదయం మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారు.మార్గం మధ్యలో ఎనీకేపాడు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వాగ్వాదం జరిగింది. రోడ్డుపై ఆ పార్టీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపాయి.

    అనంతరం నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా దక్కుతుందని హామీ ఇచ్చారు.గడిచిన పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ కి పట్టం కడితే ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలుపుతామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనను చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతుందంటూ వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాన్వాయ్ కి ఎలాంటి ఆటకం కలగలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా చెప్పారు.

    ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ముందు వాహనాలు పంపామని, ఉద్దేశపూర్వకంగా కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు అనడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

  7. అఫ్గానిస్తాన్‌లో కూలింది భారత విమానం కాదు: వెల్లడించిన డీజీసీఏ

    విమాన ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    అఫ్గానిస్తాన్‌లో బదాక్షన్ ప్రావిన్స్‌లో కూలిన విమానం మొరాకో రిజిస్టర్డ్ విమానమని భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.

    ఈ విమానం భారత్‌కు చెందినదని మొదట వార్తలు వెలువడగా, ఇది మొరాకోకు చెందిన విమానమని డీజీసీఏ స్పష్టం చేసింది.

    బదక్షన్ ప్రావిన్స్‌లోని తోప్‌ఖానా పర్వతాలలో ఈ విమానం కూలిపోయిందని, అయితే పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ సీనియర్ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. అయోధ్యకు, థాయ్‌‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?

  9. బలూచిస్తాన్: పాకిస్తాన్, ఇరాన్‌లకు టార్గెట్‌గా మారిన ఈ ప్రాంతం ఎక్కడుంది? దీని చరిత్ర ఏమిటి

  10. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, YS SHARMILA OFFICE

    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల (ఫైల్)

    వైఎస్ షర్మిల నేడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ఈనెల 16న ప్రకటన విడుదల చేసింది. అనంతరం అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా సమర్పించారు.

    ఈ నేపథ్యంలో షర్మిల ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కానూరు వెళ్లి, బాధ్యతలు చేపట్టే సభలో పాల్గొంటారు. అనంతరం షర్మిల బెజవాడలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్తారు.

  11. గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.