రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అరుణాచల్ ప్రదేశ్‌కు చేరిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’, దిలీప్ కుమార్ శర్మ, గౌహతి నుంచి బీబీసీ కోసం

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, AICC

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తోన్న 'భారత్ జోడో న్యాయ యాత్ర' అరుణాచల్ ప్రదేశ్‌కు చేరుకుంది.

    అస్సాం నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను మొదలుపెట్టారు.

    అరుణాచల్ ప్రదేశ్‌లో అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిందని రాహుల్ గాంధీ అన్నారు.

    ‘‘మీరు పన్నులు చెల్లిస్తారు. కానీ ప్రయోజనం ఉండదు. రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. మీ కష్టాలు విని వాటిని పార్లమెంట్‌లో లేవనెత్తడం, దేశానికి తెలియచెప్పడమే మా లక్ష్యం’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    అంతకుముందు అస్సాంలోని హిమంత బిస్వా శర్మ ప్రభుత్వాన్ని 'అత్యంత అవినీతి ప్రభుత్వం' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంతో వివాదం చెలరేగింది.

  3. పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఈ గొడవ దేనికి సంకేతం?

  4. కొలోసస్: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల రహస్య సందేశాలను డీకోడ్ చేసిన తొలితరం కంప్యూటర్ వేల ప్రాణాలను ఎలా కాపాడింది.. 80 ఏళ్ల పాటు దాన్ని సీక్రెట్‌గా ఎందుకు ఉంచారు

  5. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోవద్దు.. కేంద్రం కొత్త నిబంధనలు

  6. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత గర్భం దాల్చిన మహిళ, వైద్యుల క్షమాపణ

  7. సిరియా రాజధాని డమాస్కస్‌లో వైమానిక దాడులు, ఇరాన్ అడ్వయిజర్లు మృతి చెందినట్లు కథనాలు

    డమాస్కస్‌లో పేలుడు

    ఫొటో సోర్స్, Getty Images

    సిరియా రాజధాని డమాస్కస్‌పై వైమానిక దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

    ఈ వైమానిక దాడుల్లో పలువురు మృతి చెందినట్లు కూడా చెబుతున్నాయి.

    దాడులు జరిగిన ప్రాంతంలో దౌత్య కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ దాడులపై సిరియా ప్రభుత్వ మీడియా సమాచారం అందించింది.

    ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఈ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అడ్వయిజర్లు చనిపోయినట్లు తెలిసింది.

    ఇద్దరు ఇరాన్ అడ్వయిజర్లు కూడా మృతి చెందినట్లు భద్రతా బలగాలను ఉటంకిస్తూ మెహర్ రిపోర్టు చేసింది.

    ఈ దాడులు శనివారం ఉదయం జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

    ఇజ్రాయెల్ ఈ క్షిపణి దాడి చేసినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

    ఈ దాడి వెనుకాల ఇజ్రాయెల్ ఉందని సిరియన్ ప్రభుత్వ మీడియా కూడా పేర్కొంటోంది.

    డమాస్కస్‌లో పేలుడు

    ఫొటో సోర్స్, AFP

    సిరియాలో స్థానిక మీడియా కథనాల ప్రకారం, మజ్జే ప్రాంతంలోని భవంతిని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగింది. రాజధానిలో చాలా ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు తెలిసింది.

    మజ్జే ప్రాంతంలోనే సైనిక విమానశ్రయం, డమాస్కస్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం, రాయబారి కార్యాలయాలు, రెస్టారెంట్లు ఉంటాయి.

    పశ్చిమ మజ్జే ప్రాంతంలో పేలుళ్లను తాము చూసినట్లు ఒక స్థానికుడు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ఈ దాడి తర్వాత దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పారు.

    క్షిపణి దాడి మాదిరిగానే ఆ శబ్దం ఉందని, ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో అంబులెన్స్‌ల శబ్దాలు వినిపించాయని తెలిపారు.

    దక్షిణ ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుంచి మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ దాడి జరిగినప్పుడు సుమారు 1,300 మంది మరణించారు.

    ఆ తర్వాత హమాస్ దాడులకు ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్స్‌లో 24,900 మందికి పైగా మరణించారు.

    హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజాలో తాము గ్రౌండ్, ఎయిర్ ఆపరేషన్‌ను చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

  8. లగ్జరీ వాటర్: ప్రపంచంలో దీన్ని మించిన నీరే లేదా?

  9. భారత్ జోడో న్యాయ్ యాత్ర వాహనాలపై బీజేపీ దాడి చేశాదంటూ కాంగ్రెస్ ఆరోపణలు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    అసోం మీదుగా సాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ వాహనాలపై దాడి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది.

    భారతీయ జనతా యువ మోర్చకు చెందిన వారు యూత్ కాంగ్రెస్‌ వాహనాలను ధ్వంసం చేశారని కాంగ్రెస్ గత రాత్రి చేసిన పోస్టులో పేర్కొంది.

    దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది.

    ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర వాహనాలపై దాడి జరిగింది. అసోం లఖింపూర్‌లోని బీజేపీ గూండాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన పోస్టర్లను, బ్యానర్లను చింపేయడం సిగ్గుచేటు. మేం దీన్ని ఖండిస్తున్నాం’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ సోషల్ మీడియా వేదికపై రాశారు.

    ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఈ దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేసిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి.. ‘‘ ఇవాళ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగుతున్న అసోం లఖింపూర్‌కు చెందినవి ఈ ఫోటోలు. పోలీసుల రక్షణలో లఖింపూర్‌లో బీజేపీ గూండాలు ఆందోళనలు సృష్టించారు. మా వాహనాలపై దాడులు చేశారు’’ అని ఆరోపించారు.

    పోలీసులు ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర జరిగే ప్రాంతమంతా పోస్టర్లను, బ్యానర్లను చించేసినట్లు ఆయన రాశారు. కానీ, పోలీసులు మాత్రం కేవలం చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో గుంటూరు యువకుడు అరెస్ట్

    రష్మిక మందన్న

    ఫొటో సోర్స్, ANI

    రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడిని ఈమని నవీన్‌గా గుర్తించినట్లు తెలిపారు.

    ఈ మేరకు ఐఎఫ్ఎస్ఓ యూనిట్ డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు.

    ఈ కేసులో నలుగురు నిందితుల్ని గుర్తించామని, ప్రధాన నిందితుడి కోసం వెతుకుతున్నామని గత నెలలోనే దిల్లీ పోలీసులు చెప్పారు.

    ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్న గత ఏడాది నవంబర్ 6న సోషల్ మీడియా వేదికగా కోరారు.

    ‘‘నిజంగా చెప్పాలంటే, ఇలాంటిది ఏదైనా చాలా భయానకంగా ఉంటుంది. కేవలం నాకు మాత్రమే కాదు, అందరికీ అలానే ఉంటుంది’’ అని రష్మిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

    దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రష్మిక, వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. తనలాగా ఎవరూ బాధపడకూడదని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కాగా నవీన్ సోషల్ మీడియాలో రష్మిక మందన్న ఫ్యాన్ పేజ్ నడుపుతున్నారని.. దానికి ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నంలో ఇలాంటి డీప్ ఫేక్ వీడియో సృష్టించారని పోలీసులు చెప్తున్నారు.

    ఆయన ల్యాప్ టాప్, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  11. చైనా: స్కూల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం, 13 మంది మృతి

    ప్రతీకాత్మక చిత్రం

    ఫొటో సోర్స్, Getty Images

    చైనాలోని స్కూల్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.

    హెనాన్ ప్రావిన్స్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలో ఉన్న చిన్న పిల్లల పాఠశాలలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

    నర్సరీ, ప్రైమరీ విద్యార్థులు ఈ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారని చైనా డైలీ తెలిపింది. పోలీసులు పాఠశాల మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

    మృతుల గుర్తింపు, అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.

  12. ‘సానియా మీర్జాయే షోయబ్ మలిక్ నుంచి విడాకులు తీసుకుంది’.. స్పష్టం చేసిన తండ్రి ఇమ్రాన్ మీర్జా

  13. పాకిస్తాన్-ఇరాన్: రెండు దేశాలు యుద్ధం వరకు వెళతాయా...పరస్పర దాడుల వెనక ఉద్దేశాలు ఏంటి?

  14. రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం టీటీడీ నుంచి లక్ష లడ్డూలు

    అయోధ్యలో రామ మందిరానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

    ఫొటో సోర్స్, TTD

    అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లక్ష లడ్డూలను తయారు చేసి పంపించింది.

    అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున కానుకలు, ప్రసాదాలు వస్తున్నాయి.

    మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసీ) వీరబ్రహ్మం తెలిపారు.

    అయోధ్యలో రామ మందిరానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

    ఫొటో సోర్స్, TTD

    తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1 నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కూడిన బాక్సులను శుక్రవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు.

    గురువారం శ్రీ‌వారి సేవ‌కులతో మొత్తం 350 బాక్సుల్లో ఒక లక్ష లడ్డూలను ప్యాకింగ్ చేశామని చెప్పారు. ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు పంపుతున్నట్లు తెలిపారు.

    అయోధ్యలో రామ మందిరానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

    ఫొటో సోర్స్, TTD

    శనివారం ఈ లడ్డూప్రసాదాన్ని అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

    మరోవైపు హైదరాబాద్ నుంచి కూడా 1265 కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఓ కేటరింగ్ సర్వీసెస్ సంస్థ అయోధ్యకు పంపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. గుడ్‌మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.