గాజా ఘర్షణలు ముగిశాక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోం: నెతన్యాహు

గాజాలో ఘర్షణలు ముగిసిన తర్వాత పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని తాను అమెరికాకు తెలియజేసినట్లు చెప్పారు. గాజాలో పూర్తి విజయం సాధించేంత వరకు ఈ ఘర్షణలు కొనసాగుతాయన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. కశ్మీర్‌లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?

  3. అయోధ్య: రామమందిరం ప్రాణప్రతిష్ఠపై అక్కడి ముస్లింలు ఏమంటున్నారు?

  4. జలాంతర అణ్వస్త్ర వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా... ఇది ఎంత ప్రమాదకరం?

  5. మహిళా రెజ్లర్ల నిరసనలకు ఏడాది... ఇప్పటివరకూ ఏం జరిగింది, భారత రెజ్లింగ్ భవిష్యత్తు ఏంటి?

  6. మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ నది ప్లాన్.. లండన్‌లో ‘పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ’తో రేవంత్ రెడ్డి భేటీ

    పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ

    ఫొటో సోర్స్, CMO Telagnana

    ఫొటో క్యాప్షన్, పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ

    లండన్‌లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ థేమ్స్ నది నిర్వహణ వ్యవహారాలు చూసే అత్యున్నత పాలక మండలి అయిన ‘పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ’తో భేటీ అయ్యారు.

    థేమ్స్ నది నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలు, అక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.

    పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటికి చెందిన అధికారులు, నిపుణులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు.

    తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ విషయంలో ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను పరిశీలించడంలో భాగంగా ఆయన ఈ భేటీలో పాల్గొన్నారు.

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, CMO Telagnana

    దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంబడి చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ రేవంత్ రెడ్డికి వివరించారు.

    ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు.

    ‘చరిత్ర చూస్తే నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టుతో మూసీకి పునర్వైభవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్మరింత శక్తిమంతంగా తయారవుతుంది‘ అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

    లండన్‌లో రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, CMO Telagnana

    నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు అత్యున్నతప్రాధాన్యమిచ్చినట్లు అక్కడి అధికారులు వివరించారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే రెవెన్యూ మోడల్ ను ఎంచుకోవాలని చెప్పారు. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు.

    హైదరాబాద్ లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకుచేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్టమైన సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిపేందుకు రెండు పక్షాలు అంగీకరించాయి.

  7. ఆంధ్రప్రదేశ్: అనకాపల్లిలో తవ్వకాల్లో బయటపడిన బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ప్రత్యేకత ఏంటి?

  8. అయోధ్యలో ప్రతిష్టించనున్న రాముడి విగ్రహం ఇదేనా

    అయోధ్యలో రాముడి విగ్రహం

    ఫొటో సోర్స్, twitter/ANI/ShobaKarandlaje

    అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ అవుతున్నాయి.

    కేంద్ర మంత్రి, కర్ణాటకకు చెందిన బీజేపీ నేత శోభ కరంద్లాజె ట్విటర్‌లో ఒక ఫొటోను షేర్ చేశారు.

    అలాగే విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంచార్జ్ శరద్ శర్మ నుంచి అందిన ఫొటోలు అంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ కూడా నాలుగు ఫొటోలను షేర్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    వీటిలో కొన్ని ఫొటోలపై ఆకుపచ్చ రంగు వస్త్రం కప్పి ఉండగా కళ్లకు పసుపు వస్త్రం కప్పి ఉంది.

    అయితే, సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించి ఏమీ కప్పని విగ్రహం ఫొటోలు కూడా షేర్ అవుతున్నాయి.

    అందులో కొన్నిట్లో చేతిలో విల్లు, బాణం ఉండగా మరికొన్ని క్లోజప్ షాట్స్ ఉన్నాయి.

    బాలరాముడిలా ఉన్న విగ్రహం ఫొటోలు కూడా షేర్ అవుతున్నాయి.

  9. ఎస్సీలలో అన్ని కులాల ప్రయోజనాలకు తీసుకోవాల్సిన చర్యల పరిశీలనకు కేంద్ర కమిటీ, 23న తొలి సమావేశం

    Narendra Modi

    ఫొటో సోర్స్, Getty Images

    షెడ్యూల్ కులాల(ఎస్సీ)లోని అన్ని వర్గాలకు పూర్తి ప్రయోజనాలు దక్కే దిశగా ఎలాంటి పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవచ్చో పరిశీలించడానికి ప్రధాని సూచన మేరకు ఓ కమిటీ ఏర్పాటైందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    తమకు దక్కాల్సినంత ఫలాలు దక్కడం లేదంటూ మాదిగలు వంటి ఎస్సీ కులాలు కొన్ని చెప్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన సెక్రటరీల కమిటీ ఏర్పాటు చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    ఇందులో హోం, సిబ్బంది-శిక్షణ, గిరిజన, న్యాయ, సామాజిక న్యాయం-సాధికారత శాఖలకు చెందిన కార్యదర్శులు ఉంటారు.

    ఈ సెక్రటరీల కమిటీ మొదటి సమావేశం జనవరి 23న జరగనుందని ఏఎన్ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. సముద్ర గర్భంలో అణ్వాయుధాల వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా

    సముద్ర గర్భంలో అణు వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా

    ఫొటో సోర్స్, RODONG SHINMUN

    ఫొటో క్యాప్షన్, సముద్ర గర్భంలో అణు వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా

    అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా ఈ వారంలో చేపట్టిన మిలటరీ డ్రిల్స్‌కు ప్రతిచర్యగా సముద్ర గర్భంలో అణ్వాయుధాల వ్యవస్థను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.

    ఉత్తర కొరియా తూర్పు తీరంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ అండర్ వాటర్ డ్రోన్ పరీక్షలను నిర్వహించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా నివేదించింది.

    ఉత్తర కొరియా గతంలో ‘‘హెయిల్-5-23’’ పేరుతో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. ప్యోంగ్యాంగ్ చర్యలపై దక్షిణకొరియా, దాని మిత్ర దేశాలు ఇంకా స్పందించలేదు.

    ఇటీవల వారాల్లో ఉత్తర కొరియా తన సైనిక చర్యలను తీవ్రతరం చేసింది. దీనిలో ఉత్తర కొరియా మోహరించినట్లు చెబుతున్న సరికొత్త సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంటర్‌మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి(ఐఆర్బీఎం) కూడా ఉంది.

    వాషింగ్టన్, షియోల్, టోక్యోలు కలిసి చేపట్టిన మిలటరీ డ్రిల్స్ సముద్ర గర్భంలో ఆయుధాలను పరీక్షించేలా తమల్ని రెచ్చగొట్టినట్లు ఉత్తర కొరియా చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ రిపోర్టు చేసింది.

    ఆ దేశాలు సంయుక్తంగా చేపట్టిన మిలటరీ డ్రిల్స్ ప్రాంతీయ పరిస్థితులను మరింత అస్థిర పరుస్తున్నాయని, ఉత్తర కొరియా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.

  11. పాకిస్తాన్ టార్గెట్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చరిత్ర ఏంటి... ఈ మిలిటెంట్ సంస్థ ఇరాన్ నుంచి పని చేస్తోందా?

  12. ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ప్రారంభం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    జగన్

    ఫొటో సోర్స్, Facebook

    ఆంధ్రప్రదేశ్‌లో కులగణన నేడు మొదలైంది. ఇంటింటా సర్వే చేపడుతూ.. కులాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

    సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

    పది రోజుల పాటు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఈ సర్వేలో మిగిలిపోయిన వారి వివరాలు సేకరించేందుకు మరో ఐదు రోజుల పాటు అవకాశం కల్పిస్తారు.

    రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు చెందిన 4.89 కోట్ల జనాభా వివరాలు సేకరించబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సామాజిక సాధికారికతకు ఇది ఉపయోగపడుతుందని చెబుతోంది.

    ఏపీలోని గ్రామ సచివాలయాల పరిధిలో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు.

    పట్టణాల్లో 44,44,887 కుటుంబాలకు చెందిన 1,33,16,091 మంది నివసిస్తున్నారు.

    ఈనెల 28వ తేదీ వరకూ సచివాలయాల సిబ్బంది కులాల వారీగా వివరాలు సేకరిస్తారు. ఫిబ్రవరి 2 వరకూ ఎవరైనా వెళ్లి తమ పరిధిలోని సచివాలయంలో వివరాలు అందించే అవకాశం ఉంటుంది.

    726 కులాల జాబితా ఆధారంగా యాప్‌ని రూపొందించారు. మరో మూడు కులాలు బేడజంగం, పరిమలై కల్లర్ యలవ కులాల వివరాలను ఇతరుల కేటగిరీలో ఉంచారు. నో క్యాస్ట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచారు.

  13. చంద్రుడిపై జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’ ల్యాండింగ్ నేడు.. ఇస్రో సరసన జాక్సా చేరుతుందా?

  14. విజయవాడ: స్వరాజ్య మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ నేడు

    అంబేడ్కర్ విగ్రహం

    విజయవాడ స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రారంభాన్ని ఈ రోజు ఆవిష్కరించనున్నారు.

    రూ.404 కోట్ల ఖర్చుతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, లైబ్రరీ ఏర్పాటు చేశారు.

    తొలిదశలో విగ్రహంతో పాటు అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ ఏర్పాటుచేసిన మ్యూజియం, స్మృతివనం ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

    సాయంత్రం 6 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుంది. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ నిర్వహిస్తున్నారు.

    ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొంటారు.

    అంబేడ్కర్ స్మృతి వనం ప్రారంభం సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

    జాతీయ రహదారి 16 మీద కూడా వాహనాలు మళ్లిస్తున్నారు. బందర్ రోడ్‌లో వాహనాల రాకపోకలపై గురువారం సాయంత్రం నుంచే ఆంక్షలున్నాయి.

    సుమారు లక్షన్నర మంది వరకు సభకు హాజరవుతారని దానికి అనుగుణంగా పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.

  15. గాజా ఘర్షణలు ముగిశాక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోం: నెతన్యాహు

    బెంజమిన్ నెతన్యాహు

    ఫొటో సోర్స్, REUTERS

    గాజాలో ఘర్షణలు ముగిశాక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.

    గాజాలో పూర్తి విజయం సాధించేంత వరకు ఈ ఘర్షణలు కొనసాగుతాయని న్యూస్ కాన్ఫరెన్స్‌లో నెతన్యాహు స్పష్టం చేశారు.

    హమాస్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, మిగతా ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనికి మరిన్ని నెలలు పడతాయన్నారు.

    గాజాలో 25 వేల మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రి చెప్పారు. గాజా స్ట్రిప్‌లో 85 శాతం మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

    దాడులను ఆపి, యుద్ధం ముగిసేలా అర్థవంతమైన చర్చలు చేపట్టాలని ఇజ్రాయెల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

  16. గుడ్‌మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.