గుజరాత్: పడవ బోల్తా పడి 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి

గుజరాత్‌లోని వడోదరలో ఉన్న హరణి సరస్సులో షికారుకు వెళ్లిన పడవ బోల్తా పడి, 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతిచెందారు. ప్రమాదం సమయంలో 27 మంది ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. క్యాన్సర్: కీమోథెరపీ బాధలకు బ్లీనా చికిత్స చెక్ పెడుతుందా?

  3. చోళులు: ఆ రాజు చనిపోయినప్పుడు అతనితో పాటు ముగ్గురు మహిళలను సజీవ సమాధి చేశారు...

  4. గుజరాత్: హరణి సరస్సులో పడవ బోల్తా.. 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి

    గుజరాత్‌లో పడవ ప్రమాదం

    గుజరాత్‌లోని వడోదరలో హరణి సరస్సులో షికారుకు వెళ్లిన పడవ బోల్తా పడి , అందులో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.

    వడోదర సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ ఈ వార్తను ధ్రువీకరించారు. బీబీసీ ప్రతినిధి రాక్సీ గగేద్కర్‌తో ఆయన మాట్లాడుతూ, పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రక్షించిన విద్యార్థులను దగ్గరిలోని సాయాజి ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

    స్థానిక అధికార యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం పడవ బోల్తా పడిన సమయంలో అందులో 27 మంది ఉండగా, వారిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానిక అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజఈతగాళ్ల బృందాలు నిమగ్నమై ఉన్నాయి.

  5. అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

  6. Direct To Mobile: సిమ్ కార్డ్, ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్లలో నేరుగా లైవ్ టీవీ ప్రసారాలు, భారత్‌లోనే తొలిసారిగా...

  7. అయోధ్య 'హిందూ వాటికన్ సిటీ'గా అవతరిస్తోందా?

  8. సింగపూర్: అవినీతి ఆరోపణలు.. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్

    సుబ్రమణియం ఈశ్వరన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గురువారం మంత్రి పదవికి రాజీనామా చేశారు సుబ్రమణియం ఈశ్వరన్

    సింగపూర్ మంత్రి సుబ్రమణియం ఈశ్వరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.

    పారదర్శక పాలన అందిస్తున్నామని గర్వపడే సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఆరోపణలు దిగ్భ్రాంతి కలిగించాయి.

    ప్రజాప్రతినిధిగా తన అధికారాలను దుర్వినియోగం సహా, ఈశ్వరన్‌పై 27 అభియోగాలు వచ్చాయి.

    సింగపూర్‌లో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభమైనప్పుడు ఆయన పర్యాటక పారిశ్రామిక మంత్రిగా ఉన్నారు.

    సింగపూర్ మీడియాలో ఈ అవినీతి ఆరోపణల వార్తలు పతాక శీర్షికలుగా వచ్చాయి.

    స్థిరాస్థి దిగ్గజ వ్యాపారి ఓంగ్ బెంగ్ సెంగ్ ప్రయోజనాలకు బదులుగా ఈశ్వరన్‌కు 160,000 సింగపూర్ డాలర్ల విలువైన విమాన టికెట్లు, హోటళ్ళలో బస చేయడానికి ఏర్పాట్లు, గ్రాండ్ ప్రిక్స్ టికెట్లు బహుమతులుగా ఇచ్చారని ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన అభియోగపత్రాలలో ఉంది.

    వెస్ట్‌ఎండ్ మ్యూజికల్స్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల టికెట్లు కూడా పొందారని ఈశ్వరన్‌పై అభియోగాలు మోపారు.

    ఓంగ్‌ సహా ఈశ్వరన్ కిందటేడాది అరెస్టయ్యారు. ఈశ్వరన్‌పై మోపిన అభియోగాలన్నింటిలోనూ ఓంగ్ పేర్ కూడా ఉంది.

    రాజీనామా చేసిన ఈశ్వరన్..

    గురువారం సింగపూర్ ప్రధానికి రాసిన లేఖలో ‘‘నాపై మోపిన అభియోగాలన్నింటినీ తిరస్కరిస్తున్నాను. నేను నిర్దోషిని’’ అని రాశారు.

    ఈశ్వరన్ రాజీనామా ప్రకటించడంతోపాటు కిందటేడాది విచారణ మొదలైనప్పటి నుంచి తనకు అందుతున్న జీతభత్యాలన్నింటినీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు.

    ఈశ్వరన్ అరెస్టయినప్పటి నుంచి ఆయనను సెలవుపై ఉంచారు. అయినప్పటికీ ఆయనకు ఎంపీగా నెలకు 8,500 సింగపూర్ డాలర్ల జీతం, నెలకు 15వేల సింగపూర్ డాలర్లకు పైగా భత్యం అందుతోంది.

    సింగపూర్ ప్రజాప్రతినిధులకు ప్రపంచంలోనే అత్యధిక జీతభత్యాలు చెల్లిస్తుంటారు. ఎంపీలకు ప్రారంభ వేతనమే నెలకు 45వేల సింగపూర్ డాలర్లు ఉంటుంది.

    ఇంత పెద్ద మొత్తంలో జీతాలు తీసుకోవడం వల్ల అవినీతిని అడ్డుకోవచ్చని సింగపూర్ ప్రజాప్రతినిధులు సమర్థించుకుంటూ ఉంటారు.

  9. బ్రేక్ ఫాస్ట్ బిర్యానీ: ఈ రెస్టారెంట్‌లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ

    వీడియో క్యాప్షన్, తిరుపతి హైవే మీద ఉన్న ఈ రెస్టారెంట్లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ

    సాధారణంగా బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్‌కో, రాత్రి డిన్నర్‌కో తినడం చూస్తుంటాం.

    అయితే తిరుపతి హైవే మీద ఉన్న ఈ హోటల్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బిర్యానీ సర్వ్ చేస్తారు. దీని కోసం రాత్రి నుంచే వెయిట్ చేస్తారు కూడా.

    వివరాలను ఈ వీడియో స్టోరీలో చూడండి:

    ఆహారం
  10. బ్రేక్‌ఫాస్ట్ బిర్యానీ: ఈ రెస్టారెంట్‌లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ

  11. హర్దిత్‌ సింగ్ మాలిక్: తన విమానానికి 400 బుల్లెట్లు తగిలినా బతికి బయటపడ్డ భారతీయ పైలట్ కథ

  12. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పిన బాలకృష్ణ, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    బాలకృష్ణ

    ఫొటో సోర్స్, UGC

    ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

    ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పించగా, ఆ తరువాత బాలకృష్ణ, భువనేశ్వరి వేర్వేరుగా వచ్చారు.

    అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వస్తూనే, ‘‘ఇప్పుడే.. తీయించేయ్’’ అని చాలా గట్టిగా అన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వెంటనే ఆయన అనుచరులు అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి పక్కన పెట్టారు.

    ఫ్లెక్సీ తొలగింపు

    ఫొటో సోర్స్, UGC

    ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించి వెళ్లిపోయారు. బాలకృష్ణ వచ్చిన సమయంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ లేకపోవడంతో పెద్దగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడలేదు.

    ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మధ్యేమార్గమైన ప్రకటన చేసిన జూనియర్ ఎన్టీఆర్.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు సమయంలో మౌనంగా ఉన్నారు. దీనిపై అప్పట్లో కొందరు విలేఖరులు బాలకృష్ణను ప్రశ్నించగా, ‘‘ఐ డోంట్ కేర్, బ్రదర్’’ అని సమాధానం ఇచ్చారు బాలకృష్ణ.

    తాజా ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు, వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు.

    ‘‘అల్లుడు నారా లోకేశ్ కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి ఉంటారు. ఫ్లెక్సీలను తొలగించినా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎన్టీఆర్‌ పేరు చెప్పి భజన చేసే కుటుంబ సభ్యులు, పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోసం బలి చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేశ్ కోసం సర్వనాశనం చేస్తున్నారు. బాలకృష్ణ, చంద్రబాబులాంటి వారు వెయ్యి మంది వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరు’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.

  13. సిబ్బందిని కొరికిన ప్రయాణికుడు.. విమానాన్ని వెనక్కి తెచ్చిన పైలట్

    విమానం

    ఫొటో సోర్స్, ANA flight

    గాల్లో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందిలో ఒకరిని కొరకడంతో విమానం బయలుదేరిన చోటికే తిరిగి వచ్చింది.

    జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్ఏ) విమానం టోక్యో నుంచి బయలుదేరిన తరువాత 55 ఏళ్ల అమెరికన్ ఒకరు ‘బాగా మద్యం తాగిన మత్తు’లో ఫ్లైట్ అటెండెంట్ చేతిని కొరికారని విమానయాన సంస్థ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.

    తాను నిద్ర మాత్ర వేసుకోవడం వల్ల ఏం జరిగిందో తనకు ఏమీ గుర్తు లేదని ఆయన చెప్పారంటూ జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.

    జపాన్ విమానయాన రంగంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనల్లో ఇది కూడా ఒకటి.

    159 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆ 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లు ఏఎన్ఏ తెలిపింది.

    గత శనివారం ఏఎన్ఏకే చెందిన ఓ విమానం గాల్లో ఉన్న సమయంలో కాక్ పిట్ విండోకు పగుళ్లు కనిపించడంతో వెనక్కు తీసుకొచ్చారు.

    జపాన్‌లో కొన్ని వారాలుగా విమానాలకు సంబంధించి ఏదో ఒక ఘటన జరుగుతోంది.

    జనవరి 2న హనెడా విమానాశ్రయంలో జపనీస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం రన్‌వేపై ఉన్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొని మంటల్లో కాలిపోయింది.

    ఆ విమానంలో ఉన్న 379 మందిని రక్షించినప్పటికీ కోస్ట్ గార్డ్ విమానంలో ఉన్న ఆరుగురిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.