ఒలింపిక్స్‌కు అడుగు దూరంలో భారత మహిళల హాకీ జట్టు

పారిస్‌లో ఈ ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్న ఎఫ్ఐహెచ్ హాకీ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది.

లైవ్ కవరేజీ

  1. గర్భాశయ క్యాన్సర్ నుంచి హెచ్‌పీవీ వ్యాక్సీన్ కాపాడుతుందా? ఈ టీకా ఎవరు తీసుకోవచ్చు?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి 230 ఏళ్ళు పడుతుందా?

  4. చైనా: వరుసగా రెండో ఏడాదిలోనూ జనాభాలో క్షీణత

    చైనాలో శిశు జననాల రేటు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, చైనాలో పడిపోయిన శిశు జననాల రేటు

    ఫ్రాన్సిస్ మావో,బీబీసీ న్యూస్

    చైనాలో వరుసగా రెండో ఏడాది కూడా జనాభాలో క్షీణత నమోదైంది. బుధవారం విడుదల చేసిన నివేదికలో ఆ దేశ జనాభా 2023 చివరి నాటికి 1.409 బిలియన్లుగా పేర్కొంది ప్రభుత్వం.

    2022 జనాభాతో పోలిస్తే 2.08 లక్షల మేర తగ్గినట్లు నివేదిక పేర్కొంది. గత 60 ఏళ్లలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి.

    శిశుజననాాల రేటు కూడా వేయి మంది జనాభాకు 6.39 గా నమోదైంది. ఇది తూర్పు ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాల కన్నా తక్కువ.

    దేశంలో పట్టణకీకరణ, తక్కువ జననాల రేటు వల్ల ఈ క్షీణత నమోదైందని నిపుణులు చెప్తున్నారు.

    బుధవారం విడుదల చేసిన వార్షిక గణాంకాల్లో ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల నెమ్మదించడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి.

    2023లో 126 ట్రిలియన్ యువాన్లతో 5.2% జీడీపీ నమోదైంది. నిరుద్యోగ రేటు కూడా పెరగడంతో ఆ గణాంకాలను ప్రచురించడం నిలిపివేసింది చైనా ప్రభుత్వం.

  5. పాకిస్తాన్, సిరియా, ఇరాక్‌ దేశాల మీద ఇరాన్ ఎందుకు క్షిపణులతో దాడి చేసింది?

  6. ఇండియన్ రైల్వేస్: చాలా రైళ్ళు రోజుల తరబడి ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి?

  7. మణిపుర్: 'అనుమానిత తీవ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు.. ఐఆర్‌బీ కమాండో మృతి'

    మణిపుర్ హింస

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్‌లోని టెంగ్నౌపాల్ జిల్లా సరిహద్దున ఉన్న మోరే పట్టణంలో భద్రతా దళాలు, అనుమానిత కుకీ తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐఆర్‌బీ కమాండో మృతి చెందారు.

    ఈ ఘటనను ధ్రువీకరించారు టెంగ్నౌపాల్ డీఎస్పీ రాహుల్ గుప్తా.

    ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "కాల్పుల్లో ఒక జవాన్ మరణించారు. తీవ్రవాదులను పట్టుకోవడంలో మా బృందం నిమగ్నమై ఉంది" అని చెప్పారు.

    మృతిచెందిన జవాన్ ఐఆర్‌బీకి చెందిన వాంగ్‌ఖెమ్ సోమర్జిత్‌గా గుర్తించారు. ఆయన్ను స్టేట్ పోలీస్ కమాండో విభాగానికి అటాచ్ చేశారు. పశ్చిమ ఇంఫాన్ జిల్లాలోని మాలోమ్‌కు చెందినవారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం మోరేలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి.

    అనుమానిత మిలిటెంట్లు మోరే సమీపంలో ఉన్న సెక్యూరిటీ పోస్ట్‌పై బాంబులు విసిరారు. ఈ ఘటనలో కమాండో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.

    ప్రస్తుతం మోరేలో కర్ఫ్యూ విధించారు. గత మూడు రోజులుగా మోరేలోని పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయని స్థానికుడొకరు చెప్పారు. తరచూ తమ పరిసరాల్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపారు.

    బుధవారం ఉదయం రోజున చాలాసేపు కాల్పులు శబ్దాలు వినిపించినట్లు ఆయన చెప్పారు.

    ఈ కాల్పుల అనంతరం మణిపుర్ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ కమాండో బృందం ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసింది.

    గతేడాది అక్టోబర్‌లో మోరేలో హత్యకు గురైన ఎస్పీడీవో ఆనంద్ కుమార్‌ కేసుతో వారికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరూ కుకీ-జో తెగకు చెందినవారు.

  8. దావోస్‌లో రేవంత్ రెడ్డి: సీఎంకు ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చి తీరాలా... తెలంగాణ ముఖ్యమంత్రిపై ట్రోలింగ్ ఎందుకు?

  9. జగన్ ఎంపీలను కలవరా? సంజీవ్ కుమార్ అలా ఎందుకన్నారు? గతంలో ఎలా ఉండేది?

  10. ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ చిన్నారులు చనిపోయారన్న పాకిస్తాన్, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక

  11. పొగమంచు ఉంటే విమానాలు ఎందుకు ఆలస్యమవుతాయి, నిపుణులైన పైలట్లు లేరా?

  12. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్ సెమీస్‌కు చేరిన భారత మహిళల హాకీ జట్టు, ఇటలీపై 5-1 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు

    Indian Women's hockey team

    ఫొటో సోర్స్, hockey india

    పారిస్‌లో ఈ ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్నఎఫ్ఐహెచ్ హాకీ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది.

    ఫైనల్‌లో స్థానం కోసం గురువారం జర్మనీతో భారత జట్టు సెమీస్ ఆడనుంది. మరో సెమీస్ జపాన్, అమెరికా జట్ల మధ్య జరగనుంది.

    టోర్నీలో టాప్ 3 స్థానాలు సాధించిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.

    మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 5-1 తేడాతో ఇటలీని ఓడించింది.

    భారత క్రీడాకారిణుల్లో ఉదిత దుహాన్ రెండు గోల్స్, దీపిక, సలీమ, నవ్‌నీత్ ఒక్కో గోల్ కొట్టారు.

    ఒక దశలో భారత జట్టు 5-0 ఆధిక్యంలో ఉండగా చివరి నిమిషంలో ఇటలీ క్రీడాకారిణి కామిలా గోల్ కొట్టడంతో భారత్ 5-1తో విజయం సాధించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఈ.కోలి: ప్రాణాలు తీసే ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా ఎలా వ్యాపిస్తుంది? ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎవరికి ఎక్కువ?