స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి?

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. షాపులో దొంగతనం చేసి పట్టుబడిన న్యూజీలాండ్ పార్లమెంటు సభ్యురాలు

  3. పాకిస్తాన్‌లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?

  4. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు

    తమ్మినేని వీరభద్రం

    ఫొటో సోర్స్, FB/Tammineni veerabhadram

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.

    ఖమ్మం నుంచి వెంటిలేటర్ సహాయంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

    గుండె సమస్యతో పాటు కిడ్నీలు కూడా సరిగా పనిచేయకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు ఏఐజీ విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

    కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, పల్మనాలజిస్టులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

    ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

  5. చక్కెరతో వచ్చే చిక్కులేంటి... డయాబెటిస్‌కు, స్వీట్స్‌కు ఏంటి సంబంధం?

  6. సచిన్ తెందూల్కర్‌కు ఆ వైరల్ వీడియో మీద ఎందుకు కోపం వచ్చింది?

  7. అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  8. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, YS SHARMILA OFFICE

    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల (ఫైల్)

    వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ (ఏపీపీసీసీ) అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

    ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

    అదేవిధంగా ఇంతకుముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ముస్సోరీ హోటల్‌లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?

  10. అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నపుడు తెర వెనుక ఏం జరిగింది?

    వీడియో క్యాప్షన్, అభినందన్ వర్ధమాన్: ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నప్పుడు తెర వెనుక ఏం జరిగింది?

    2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత ఫైటర్ జెట్‌ను కూల్చివేసి పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను కస్టడీలోకి తీసుకోవడంతో రెండు దేశాల సరిహద్దుల్లోనే కాదు దౌత్యపరంగానూ ఉద్రిక్తతలు తలెత్తాయి.

    ఆ సమయంలో పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా అప్పటి పరిణామాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ద ట్రబుల్డ్ డిప్లొమేటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ పేరిట వెలువడిన ఈ పుస్తకంతో నాటి సంఘటనలు మరోసారి చర్చనీయంగా మారాయి.

    ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై కొత్త వాదనలు ప్రజల ముందుకు వచ్చాయి. వివరాలకు ఈ వీడియో స్టోరీ చూడండి.

  11. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి?

    చంద్రబాబు

    ఫొటో సోర్స్, Facebook

    స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

    అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏను ఈ కేసులో చంద్రబాబుకు అన్వయించే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రకటించారు. తగిన నిర్ణయం కోసం కేసును ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నామని వారు చెప్పారు.

    తనపై ఎఫ్‌ఆర్‌ను కొట్టివేయాలన్న దరఖాస్తును సెప్టెంబరు 22న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)పై ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వేర్వేరు తీర్పులు ఇచ్చారు.

    చంద్రబాబు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

    అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, కానీ ప్రభుత్వం తీసుకోలేదని, అందువల్ల ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చలేరని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.

    సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడగా, జస్టిస్ బేలా త్రివేది విభేదించారు.

    ‘‘అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17ఏ పిటిషనర్‌కు అన్వయిస్తుందా లేదా అనే విషయంలోవిషయంలో మాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నందున, ఈ విషయంలో తగు ఆదేశాల కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నాం’’ అని జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పారు.

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    సెప్టెంబరు 9న నంద్యాలలో అరెస్టు

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలతో నిరుడు సెప్టెంబర్ 9న నంద్యాలలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె.అజయ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై చంద్రబాబును అరెస్ట్ చేశారు.

    సెప్టెంబర్ 10న చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ 37గా పేర్కొన్నారు.

    అనంతరం జ్యుడిషియల్ కస్టడీ కింద చంద్రబాబును కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది.

    ఆరోగ్య కారణాల రీత్యా అక్టోబరు 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నవంబర్ 20న ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది.

    సాక్షులను ప్రభావితం చేస్తారనే ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంతో పాత్ర ఉందని చెప్పలేమని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.

    అసలేమిటీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు?

    ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీ‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశం.

    ఇందుకోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థలున్నాయి.

    ఇందుకు అయ్యే ఖర్చులో 10 శాతం ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90 శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందని నాడు ప్రభుత్వం తెలిపింది.

    సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో రూ.3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90 శాతం మేర వాటాను భరించాలన్నది ఒప్పందం. కానీ అది ముందుకు సాగలేదు.

    మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు రూ.560 కోట్ల రూపాయల వెచ్చించాల్సి ఉంది. అందుకుగానూ ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10 శాతం అంటే సుమారు రూ. 371 కోట్లని చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు.

    దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటాను అధికారులు చెల్లించారు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10న సీఐడీ కేసు నమోదు చేసింది.

    సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3,300 కోట్లకు పెంచారంటూ సీమెన్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సీఐడీ ఆరోపణలు చేసింది.

    ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 371 కోట్లను చెల్లించినప్పటికీ సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్‌వేర్ విలువ కేవలం రూ.58 కోట్లుగా సీఐడీ పేర్కొంది.

  12. మథుర: షాహీ ఈద్గా మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు స్టే

    షాహీ ఈద్గా మసీదు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, షాహీ ఈద్గా మసీదులో సర్వే జరపడానికి హైకోర్టు ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

    ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

    సర్వే జరపడానికి హైకోర్టు ఇచ్చిన అనుమతిపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

    శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా కేసులో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించాలనే అభ్యర్థనపై నిరుడు డిసెంబరులో హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

    షాహీ ఈద్గా శ్రీకృష్ణుడి జన్మస్థలంలో నిర్మితమైందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మసీదులో అనేక హిందూ మత చిహ్నాలు ఉండటమే ఇందుకు తార్కాణమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు కమిషన్ నియమించి ఆధారాలు సేకరిస్తే కోర్టు కేసును విచారించవచ్చని పిటిషన్‌లో కోరారు.

    ఈ అభ్యర్థనను డిసెంబర్ 12న హైకోర్టు ఆమోదించి, షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి కోర్టు కమిషనర్‌ను నియమించింది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి

    వివేక్ రామస్వామి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామి

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. రిపబ్లిక్ పార్టీ తరఫున తాను చేపడుతున్న అభ్యర్థిత్వ ప్రచారం నుంచి వైదొలుగుతున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటించారు.

    38 ఏళ్ల వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తన ప్రచారంతో ఇటీవల బాగా వార్తల్లో నిలిచారు. కానీ, సోమవారం అయోవా కాకస్‌లో ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో తాను ప్రచారం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

    అయోవా కాకస్‌లో 50.9 శాతం ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా, రాన్‌ డిశాంటిస్ రెండో స్థానంలో, నిక్కీ హేలీ మూడో స్థానంలో, వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు.

    కాకస్‌ ఎలా నిర్వహిస్తారు?

    స్కూల్ జిమ్‌లు, పట్టణ హాళ్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కాకస్‌లు నిర్వహిస్తారు. కాకస్ అనేది స్థానిక సమావేశం మాదిరిది. అమెరికాలో ప్రధాన పార్టీలు రిపబ్లికన్, డెమొక్రాటిక్ రెండూ కాకస్‌ను నిర్వహిస్తాయి. ఈవెంట్ ఖర్చులను ఇవే భరిస్తాయి. నమోదిత పార్టీ సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంపై వీరు ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

    కాకస్‌లో పాల్గొనే సభ్యులు టెక్నికల్‌గా అధ్యక్ష అభ్యర్థులను ఎన్నుకోరు. డెలిగేట్స్‌ను మాత్రమే వారు ఎంపిక చేస్తారు. కన్వెక్షన్ లెవల్‌లో డెలిగేట్స్ ఏ అభ్యర్థికి సానుకూలమో వారికి ఓటేస్తారు.

    అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

  14. భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు

  15. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకపై క్షిపణి దాడి చేసిన హూతీలు

    అమెరికా నౌకపై హూతీల దాడి

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన కార్గో నౌకపై హూతీ రెబల్స్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

    జిబ్రాల్టర్ ఈగల్‌ నౌకపై జరిగిన దాడిలో ఎవరూ గాయపడలేదని మధ్య ప్రాచ్యానికి చెందిన యూఎస్ మిలటరీ కమాండ్ చెప్పింది.

    ఈ కార్గో నౌక స్టీల్ ఉత్పత్తులను తీసుకెళ్తుందని ఈగల్ బల్క్ షిప్పింగ్ కంపెనీ తెలిపింది. ఈ దాడి జరిగినప్పుడు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తీర ప్రాంతానికి 160 కి.మీల దూరంలో ఉంది.

    ఈ దాడి వల్ల కార్గోకు కొంత నష్టం చేకూరిందని, ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని చెప్పింది.

    హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.

    ఈ దాడులకు ప్రతిగా అమెరికా, బ్రిటన్‌ దేశాలు యెమెన్‌లో హూతీలున్న స్థావరాలపై ఎదురుదాడికి దిగాయి.