మా శ్రేయస్సును కోరే దేశం చైనా: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రకటన

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రజల ప్రయోజనాలకు మొదటి స్థానం ఇస్తారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుందని ముయిజ్జు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. సంక్రాంతి తేదీ మారుతూ ఉంటుంది, ఎందుకు? శివాజీ కాలంలో ఈ పండుగ ఎప్పుడు జరుపుకొనేవారు?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. దిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు

    కవిత

    ఫొటో సోర్స్, FB/Kavita

    దిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    విచారణ కోసం మంగళవారం (జనవరి 16న) ఈడీ ఎదుట హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

    ఈకేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఇండిగో: ‘‘పైలట్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించాం’’

    ఇండిగో

    ఫొటో సోర్స్, Getty Images

    ఇండిగో పైలట్‌ను ఓ ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టిన ఘటనపై ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పందించింది.

    ఆ ప్రయాణికుడిని పోకిరిగా పేర్కొన్న విమానయాన సంస్థ అతన్ని స్థానిక భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

    ‘‘ 2024 జనవరి 14న ఒక ప్రయాణికుడు మా ఫస్ట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించిన ప్రకటన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం అతన్ని స్థానిక భద్రతా సిబ్బందికి అప్పగించాం. ఈ ఘటనపై సరైన చర్య తీసుకునేందుకు, నిబంధనల ప్రకారం ఆ ప్రయాణికుడిని ‘నో- ఫ్లై’ జాబితాలో చేర్చేందుకు ఈ కేసును స్వతంత్ర అంతర్గత కమిటీకి సిఫార్సు చేశాం. మా ప్రయాణికుల, సిబ్బంది భద్రత మాకు అత్యంత ముఖ్యం. ఆమోదయోగ్యం కాని ఏ ప్రవర్తనను మేం సహించం’’ అని ప్రకటనలో ఇండిగో సంస్థ పేర్కొంది.

    దీనికంటే ముందు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ప్రయాణీకుల మొరటు ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఇండిగో విమానంలో పైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన వీడియో ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విమానం ఆలస్యమైందని పైలట్‌ చెబుతుండగా ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చి చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.

    వార్తాసంస్థ పీటీఐ ప్రకారం, దాడికి పాల్పడిన వ్యక్తి పేరు సాహిల్ కటారియా. ఈ విమానం 10 గంటల ఆలస్యం తర్వాత సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది.

    ఆదివారం దిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. మా శ్రేయస్సును కోరే దేశం చైనా: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రకటన

    ముయిజ్జు

    ఫొటో సోర్స్, Getty Images

    మాల్దీవులు, చైనా పరస్పరం సహకారంతో పని చేస్తున్నాయని, మాల్దీవుల సార్వభౌమాధికారానికి చైనా పూర్తిగా మద్ధతిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అన్నారు. భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ముయిజ్జు ఈ ప్రకటన చేశారు.

    గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడయిన ముయిజ్జు, రెండు రోజుల కిందటే చైనాను సందర్శించి వచ్చారు. చైనాతో దౌత్య సంబంధాలు మొదలు పెట్టిన 1972వ సంవత్సరం నుంచి ఆ దేశం మాల్దీవుల అభివృద్ధికి ఎంతో సాయం చేసిందని ముయిజ్జు అన్నారు.

    చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ రెండు దేశాల మధ్య సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లిందని ముయిజ్జు చెప్పారు. చైనా అధికారిక సీజీటీఎన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశం కాదని, అందుకే ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు.

    భవిష్యత్తులో చైనా, మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత లోతుగా పెరుగుతాయని ముయిజ్జు విశ్వాసం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రజల ప్రయోజనాలకు మొదటి స్థానం ఇస్తారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుందని ముయిజ్జు చెప్పారు.

    మాల్దీవుల లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం సహకరిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు.

  6. చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?

  7. మాల్దీవుల నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తే ఏ దేశానికి నష్టం?

  8. విజయవాడ: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న విమర్శలేంటి?

  9. విలియం లై: చైనాను చిరాకు పెట్టే ఈ తైవాన్ నాయకుడిని ప్రజలు అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారు?

  10. ఉత్తర భారతదేశం: పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

    విమానాశ్రయం

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ, ఉత్తర భారతంలో విపరీతమైన పొగమంచు వల్ల విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

    వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి రావాల్సిన 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్- న్యూ దిల్లీ ఎక్స్‌ప్రెస్(12723) కూడా ఉంది.

    విమానాల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం చూపుతోంది. ప్రయాణానికి ముందు ప్యాసెంజర్లు విమానయాన సంస్థలను సంప్రదించాలని దిల్లీ విమానాశ్రయం అడ్వయిజరీ నోటు జారీ చేసింది.

    ‘‘పొగమంచు కారణంగా దిల్లీ విమానాశ్రయం నుంచి సాగే విమానాల రాకపోకలు ప్రభావితం కావొచ్చు. ప్రయాణికులు తమ అప్‌డేటెడ్ విమాన సమాచారం పొందేందుకు విమాన సంస్థలను సంప్రదించాలని కోరుతున్నాం’’ అని ఎయిర్‌పోర్టు అథారిటీ ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో ప్రకటన జారీ చేసింది.

    ఇండిగో కూడా విమాన ఆలస్యంపై ప్రకటన ఇచ్చింది. వాతావరణం బాగోలేకపోవడంతో దిల్లీ, కోల్‌కతాలో విమానాల రాకపోకలు ప్రభావితమవుతున్నట్లు తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆదివారం కూడా విమానాల రాకపోకలపై ఇలాంటి ప్రభావమే చూపడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దిల్లీ ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్ సమాచారం మేరకు ఆదివారం 200 విమానాలు దారి మళ్లించగా, 10 విమానాలు రద్దయ్యాయని తెలిసింది. జైపూర్ నుంచి వచ్చే 10 విమానాల మార్గాన్ని మార్చారు. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

    జనవరి 20 వరకు పొగమంచు కొనసాగే అవకాశం ఉందని, వచ్చే రెండు రోజుల పాటు పొగమంచు విపరీతంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

    ప్రయాణికులు

    ఫొటో సోర్స్, Getty Images

  11. కారు ప్రమాదంలో గాయపడిన పుతిన్ విమర్శకుడు లెవ్ రుబిన్‌స్టెయిన్ మృతి, మాలు కర్సినో, బీబీసీ ప్రతినిధి

    లెవ్ రుబిన్‌స్టెయిన్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    రష్యా కవి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు లెవ్ రుబిన్‌స్టెయిన్ కన్నుమూశారు. మాస్కోలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన ఆయన ఆరు రోజుల తర్వాత మృతి చెందినట్లు రుబిన్‌స్టెయిన్ కూతురు తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

    76 ఏళ్ల రుబిన్‌స్టెయిన్ జనవరి 8న కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు.

    ‘‘నాన్న లెవ్ రుబిన్‌స్టెయిన్ ఇవాళ కన్నుమూశారు’’ అని కూతురు మారియా తన బ్లాగ్‌లో ప్రకటించారు.

    రష్యా భావవాద ఉద్యమానికి(కాన్సెప్ట్‌లిస్ట్ మూవ్‌మెంట్) పునాది వేసిన వారిలో రుబిన్‌స్టెయిన్ ఒకరు. 1970, 80లలో ఈ ఉద్యమం కళను వివిధ రూపాలలో వాడుతూ.. సంప్రదాయ సోవియట్ విధానాలకు కాలం చెల్లేలా చేసింది.

    సామ్యవాద వాస్తవికవాదాన్ని(సోషలిస్ట్ రియలిజం) విమర్శించే వారు. సామ్యవాద వాస్తవికవాదం అనేది సోవియట్ యూనియన్ కాలంలో ఎక్కువగా ఆదరణ పొందింది. దీని కింద రాజకీయ అజెండాను కళల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే వారు.

    యుక్రెయిన్‌లో రష్యా సైన్యం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, ఎల్‌జీబీటీ హక్కుల విషయంలో రష్యా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రుబిన్‌స్టెయిన్ గట్టిగా పోరాడారు.