ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ముయిజ్జు తొలిసారిగా చైనాకు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లి, శనివారం పర్యటన ముగించుకుని వచ్చారు. అనంతరం ఆదివారం ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, presidency.gov.mv
మార్చి 15వ తేదీలోగా మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం దేశం విడిచి వెళ్లాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం కోరింది.
ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు ముయిజ్జు చీఫ్ సెక్రటరీ అబ్దుల్లా నజీం ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
మాల్దీవుల ఎన్నికల ప్రచార సమయంలో మొహమ్మద్ ముయిజ్జు ‘ఇండియా అవుట్’ అన్న నినాదంతోనే ప్రజల్లోకెళ్లారు.
అధ్యక్షుడిగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టాక, మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం ఈ మేరకు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మార్చి 15వ తేదీలోగా భారత బలగాలు దేశం విడిచి వెళ్లాలని కోరింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ముయిజ్జు తొలిసారిగా చైనాకు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లి, శనివారం పర్యటన ముగించుకుని వచ్చారు. అనంతరం ఆదివారం ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

ఫొటో సోర్స్, INC/X
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. మణిపుర్ లోని తౌబాల్ నుంచి ఈ యాత్ర లాంఛనంగా మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే భారత పతాకాన్ని రాహుల్ గాంధీ చేతికి ఇచ్చి, యాత్రను ప్రారంభించారు.
మణిపుర్‌లో తౌబాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 67 రోజులపాటు సాగి 6700 కిలోమీటర్లు, 110 జిల్లాల మీదుగా ప్రయాణించి ముంబయిలో ముగుస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ఏఎన్ఏ)కు చెందిన బోయింగ్ విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు వచ్చాయి.
ఈ బోయింగ్ 737 విమానం (ఎన్‌హెచ్1182) హక్కైడోలోని సపోరో నగరం నుంచి జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షులోని తోయామాకు వెళుతోంది. కాక్‌పిట్ చుట్టుపక్కల గల నాలుగు కిటికీల వెలుపలి భాగంలో పగుళ్లు కనిపించడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:40 గంటలకు (3:10 GMT) సపోరో న్యూ చిటోస్ విమానాశ్రయానికి విమానం తిరిగి చేరుకుంది. విమానంలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
విమానం హకోడేట్ నగరం మీదుగా వెళుతుండగా పగుళ్లు కనిపించాయని ఏఎన్ఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత, యువ నేత మిలింద్ దేవరా పార్టీని వీడారు.
కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగుస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా మిలింద్ దేవరా ప్రకటించారు.
‘‘ఇవాళ నా రాజకీయ చరిత్రలో ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేశాను. దీంతో, పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగిసినట్లయింది’’ అని మిలింద్ దేవరా ట్వీట్చేశారు.
‘‘ఇన్నేళ్ల పాటు తనకు మద్దతు ఇచ్చిన పార్టీ నేతలకు, సహచరులకు, కార్యకర్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని మిలింద్ దేవరా తన ట్వీట్‌లో రాశారు.
మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మురళీ దేవరా కొడుకు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మణిపుర్ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ చేపడుతున్న రెండో దశ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమవుతుంది.
కాంగ్రెస్ ముందుగా ఎంపిక చేసిన రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
గత ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రారంభమైన కుల హింసలో తౌబాల్ జిల్లా బాగా ప్రభావితమైంది.
రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా కార్యాలయం ఈ యాత్రపై పలు ఆంక్షలు విధించింది. మణిపుర్‌లో పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ రాష్ట్రంలో రాహుల్ యాత్ర జరగనుంది. ఈ సమయంలో నాలుగు జిల్లాల్లో 100కి.మీల మేర రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మరో నాలుగు రాష్ట్రాలలో కూడా రాహుల్ గాంధీ పర్యటిస్తారు.
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో యాత్ర ఈసారి మణిపుర్ నుంచి ముంబై వరకు జనవరి 14 నుంచి మార్చి 20 వరకు సాగనుంది.

ఫొటో సోర్స్, Twitter/Jairam Ramesh
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.