ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఈ జంట 2022లోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆర్డెర్న్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన కరోనా కఠిన నిబంధనల కారణంగా అప్పుడు ఈ వివాహాన్ని వాయిదా వేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
న్యూజీలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్, తన భాగస్వామి క్లార్క్ గైఫోర్డ్‌ను వివాహం చేసుకున్నారు.
నార్త్‌ఐలాండ్‌లో ఒక చిన్న ప్రైవేటు వేడుకగా వీరి పెళ్లి జరిగింది.
ఈ జంట 2022లోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆర్డెర్న్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన కరోనా కఠిన నిబంధనల కారణంగా అప్పుడు ఈ వివాహాన్ని వాయిదా వేశారు.
పదేళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంటకు అయిదేళ్ల కూతురు నీవ్ ఉంది.
ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న డజన్ల మంది అతిథులను ఉద్దేశించి పెళ్లి తర్వాత 5 నిమిషాల పాటు జసిండా మాట్లాడారు.
43 ఏళ్ల జసిండా అయిదేళ్ల పాటు న్యూజీలాండ్ ప్రధానిగా పని చేశారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, get
తైవాన్ సార్వత్రిక ఎన్నికల్లో డీపీపీ అభ్యర్థి, చైనా వ్యతిరేకిగా గుర్తింపు ఉన్న విలియం లై విజయం సాధించారు.
విలియం లై ప్రస్తుతం తైవాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ గెలుపుతో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు.
గెలిచిన వెంటనే లై మాట్లాడుతూ, చైనా బెదిరింపుల నుంచి తైవాన్‌ను రక్షించడానికి కట్టుబడి ఉన్నానని, యథాతథ స్థితిని కొనసాగిస్తానని అన్నారు.
విలియం లైకి ఓటు వేయవద్దని ఎన్నికల ముందు ఓటర్లను చైనా హెచ్చరించింది.
చైనా హెచ్చరికలు, బెదిరింపులను తైవాన్ ఓటర్లు పట్టించుకోలేదని భావిస్తున్నారు.
ఓట్ల లెక్కింపులో లై తిరుగులేని ఆధిక్యం సాధించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు.
రేవంత్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కూడా ఉన్నారు.
తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి కోసం పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కేంద్ర మంత్రులను కలుస్తూ.. తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఐదు అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన సిటీ బ్యాంకు వచ్చే రెండేళ్లలో 20 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుకు ఉన్న మొత్తం ఉద్యోగులలో 10 శాతం మందిని తీసేయనుంది.
14 ఏళ్లలో తొలిసారి బ్యాంకు ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి.
2023 ప్రారంభంలో సిటీ బ్యాంకులో 2.40 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ చెప్పారు. సంస్థను పునర్వ్యస్థీకరించడం ద్వారా 20 వేల ఉద్యోగులను తీసేయనున్నట్టు తెలిపారు.
అలాగే, తన మెక్సికన్ కన్జూమర్ యూనిట్ బెనామెక్స్‌ను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మార్కెట్లో లిస్ట్ చేసి, వేరు సంస్థగా ఏర్పాటు చేస్తుండటంతో మరో 40 వేల ఉద్యోగులను లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో మొత్తంగా తన ఉద్యోగుల సంఖ్యను 2025 లేదా 2026 నాటికి 1.8 లక్షలకు తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Bolisetti srinivas
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుపోతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.ఇప్పటికే జనసేన నేతలు కిర్లంపూడి వెళ్లి ముద్రగడతో రెండు సార్లు సమావేశం అయ్యారు.
సంక్రాంతి తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కిర్లంపూడి వస్తున్నట్టు తమకు సమాచారం అందిందని ముద్రగడ అనుచరులు చెబుతున్నారు.
జనసేనకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముద్రగడతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముద్రగడ రాసిన లేఖను తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అందించారు.
ముద్రగడ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్లేందుకు అంగీకరించినట్టు బొలిశెట్టి శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు. వచ్చే వారంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు.
జనసేనతో పాటు టిడిపికి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, UGC
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైఎస్ షర్మిల కలిశారు. శనివారం హైదరాబాలోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానించారు షర్మిల.
చంద్రబాబును కలిసిన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.
''నా కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి మాత్రమే వచ్చా. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు'' అని తెలిపారు.
పెళ్లికి వస్తానని చంద్రబాబు మాటిచ్చారని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం గురించి చంద్రబాబు గుర్తుచేసుకున్నట్లు షర్మిల చెప్పారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, ANI
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ 15 మందితో భారత జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు.
యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు జట్టులో స్థానం కల్పించారు.
సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు టీంలో చోటు దక్కలేదు.
ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు ఈనెల 25న హైదరాబాద్ వేదికగా జరగనుంది.
జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్‌లో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ), కౌమిన్ టాంగ్ పార్టీ(కేటీపీ), తైవాన్ పీపుల్స్ పార్టీ(టీపీపీ)లు బరిలో ఉన్నాయి.
తైవాన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 నుంచి ఓటింగ్ మొదలైంది. దాదాపు కోటి 95 లక్షల మంది ఈ ఓటింగ్‌కు హాజరుకానున్నారు.
ఈ ఎన్నికలు తైవాన్ భవిష్యత్‌తో పాటు చైనాతో సంబంధాలపై కూడా ప్రభావం చూపనున్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.