ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో అతిపెద్ద వంతెన అటల్ సేతు-ది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
భారత్‌లో అతిపెద్ద వంతెన అటల్ సేతు-ది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ వంతెనను సముద్రంపై నిర్మించారు.
ప్రతి రోజూ 70 వేలకు పైగా వాహనాల రాకపోకలు ఈ వంతెనపై జరుగుతాయని అంచనావేస్తున్నారు.
అటల్ సేతు వంతెన ప్రారంభానికి ముందు మహారాష్ట్రలోని నాసిక్‌లో గల రామ్‌కుంద్‌లో మోదీ పూజలు చేశారు.
ఈ వంతెన ద్వారా ముంబై నుంచి నేవి ముంబైకి మధ్య 20 నుంచి 22 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు.
మొత్తం 22 కి.మీల దూరంలో నిర్మించిన ఈ వంతెనలో, 16.5 కి.మీల రోడ్డు సముద్రంపైనే ఉంటుంది. ఆరు వరుసల రోడ్డుగా ఈ వంతెనను ముంబై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ఎంఎంఆర్‌డీఏ నిర్మించింది.
నేవి ముంబై రాయ్‌ఘడ్ జిల్లాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన సహకరించనుంది. ప్రజలు ఇంధనాన్ని, రవాణా ఖర్చులను, తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతేకాక, ముంబై నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఈ వంతెన ప్రారంభానికి ముందు దీని డ్రోన్ విజువల్స్‌ను విడుదల చేశారు.
కొత్త తరం ఆకాశ్ క్షిపణి(ఆకాశ్-ఎన్‌జీ)ని శుక్రవారం డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి ఉదయం 10 గంటలకు ఈ క్షిపణిని లాంచ్ చేసింది.
ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టేందుకు కలిసి పనిచేసిన డీఆర్‌డీఓకు, భారత వైమానిక దళానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
కొత్త తరం ఆకాశ్ క్షిపణిని విజయవంతంగా అభివృద్ధి చేయడం వల్ల దేశ రక్షణ సామర్థ్యాలు మరింత బలపడతాయని ఆయన చెప్పారు.
దేశీయ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టిఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఎలా పనిచేస్తున్నాయో ఈ ప్రయోగంలో పరీక్షించారు.
ఇరాక్ నుంచి టర్కీకి వెళుతున్న చమురు నౌకను ఒమన్ తీరంలో ఇరాన్ స్వాధీనం చేసుకుంది.
ఈ ఘటన కారణంగా ముడి చమురు ధరలు రెండు శాతం పెరిగాయి.
బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.1 శాతానికి పైగా పెరిగి, బ్యారల్ 79 డాలర్లకు చేరుకుంది.
హుతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వేళ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా బ్రిటన్ అనేక సమస్యలు ఎదుర్కొటోంది.
తాజాగా ఇరాన్ చర్యల కారణంగా బ్రిటన్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సమస్యల వల్ల ముడి చమురు బ్యారల్‌కు పది డాలర్ల చొప్పున, సహజ వాయువు 25 శాతం చొప్పున పెరిగే అవకాశముందని బ్రిటన్ ఆర్థిక శాఖ అంచనా వేసింది.
గ్యాస్ కోసం యూరప్ దేశాలు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తాజా సంఘటనతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై యూఎస్, యూకే దళాలు శుక్రవారం ఉదయం దాడులు ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధ్రువీకరించారు.
నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలోని నౌకలపై ఇరాన్‌కు చెందిన హూతీలు చేస్తోన్న దాడులకు ప్రతీకారంగా ఈ అటాక్స్ ప్రారంభించినట్లు జో బిడెన్ చెప్పారు.
తమ ప్రజల్ని కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడనని బిడెన్ చెప్పారు.
హూతీ రెబల్స్‌పై దాడులు చేస్తున్న విషయాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కూడా ధ్రువీకరించారు. రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడుల్లో పాల్గొంటోందని తెలిపారు.
యెమెన్ రాజధాని సనా, సాద, ధామన్ నగరాలలో అమెరికా, బ్రిటన్ సైన్యాలు దాడులు చేస్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
యుద్ధ విమానాలు, నౌకలు, సబ్‌మెరైన్లతో దాడులు చేస్తున్నట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని హూతీ అధికారిక వర్గాలు కూడా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో తెలిపాయి.
అమెరికా, బ్రిటన్‌లు దీనికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హూతీ డిప్యూటీ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఈ దాడులను ‘అమెరికా-యూదులు-బ్రిటీష్ అటాక్’గా అభివర్ణించారు.
గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హమాస్‌కు మద్దతుగా హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకలపై గతకొంత కాలంగా దాడులు చేస్తున్నారు.
ఎర్ర సముద్రంలో నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన ఇటీవల అతిపెద్ద దాడిని తిప్పికొట్టిన అమెరికా, బ్రిటన్‌లు.. ఆ తిరుగుబాటుదారులపై సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
దాడులకు హౌతీ తక్షణమే ఒక ముగింపు పలకాలనే తీర్మానాన్ని బుధవారం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది.
ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటేయగా.. రష్యా, చైనా, అల్గేరియా, మొజాంబిక్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చేరిన అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అక్కడి నుంచే ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ ఆపరేషన్‌కు ముందు గత మూడు రోజుల్లో రెండుసార్లు అమెరికా అధ్యక్షుడితో రక్షణ శాఖ మంత్రి మాట్లాడినట్లు ఒక అధికారి తెలిపారు.
ఈ దాడులు ప్రారంభమైన తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు కాస్త సంయమనం పాటించాలని, ఈ ఘర్షణలను నిరోధించాలని సౌదీ అరేబియా కోరింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడక్లిక్ చేయండి.