ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అఫ్గాన్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శివమ్ దూబె 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
అఫ్గానిస్తాన్, భారత్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు అఫ్గానిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లకే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబె 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ గురువారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌ల నియామకానికి సంబంధించి మూడో జాబితా విడుదల చేసింది.
ఇందులో 21 స్థానాలకు సంబంధించిన ఇంచార్జ్‌ల పేర్లను తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయం పేరిట ప్రకటన విడుదల చేసింది. ఆరుగురు ఎంపీలు, మరో 15 మంది అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జ్‌ల బాధ్యతలు అప్పగించారు.
కేశినాని నానికి బాధ్యతలు..
జాబితాలో ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినానికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని పార్టీలో చేరనప్పటికీ ఆయనకు పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.
కేశినాని నాని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రెండోసారి విజయం సాధించారు.
ఇటీవల ఆ పార్టీ నేతలతో విభేదించి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత వైసీపీ కండువా కప్పుకుంటానని ఆయన ప్రకటించారు.
అయితే ఈ లోగానే ఆయన్ని విజయవాడ ఎంపీ స్థానానికి ఇంచార్జ్‌గా ప్రకటించడం ఆసక్తిగా మారింది.
విజయవాడతోపాటు శ్రీకాకుళం విశాఖ ఏలూరు, కర్నూల్, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు కొత్త ఇంచార్జిలను ప్రకటించారు. ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు సీట్లు నిరాకరించారు.
అఫ్గానిస్తాన్‌లోని గురువారం హిందూఖుష్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది.
ఉత్తరభారత దేశంలోని దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల కూడా భూమి కంపించింది.
పాకిస్తాన్‌లో పలుచోట్ల భూమి కంపించిందని పాకిస్తాన్ మెటరాజికల్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అకౌంట్ నుంచి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో భూకంపం ఏర్పడినట్లు ఈ ట్వీట్‌లో తెలిపారు..
అఫ్గానిస్తాన్‌లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేల్‌పై 6కు పైగా తీవ్రతతో రెండుసార్లు భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు.
భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు స్థిరంగానే ఉన్నప్పటికీ, సున్నితంగా ఉన్నాయని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.
దీనిపై భారత ప్రభుత్వం చైనాతో దౌత్య, మిలటరీ పరంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారత సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, మరింత మెరుగుపర్చేందుకు మేం విధివిధానాలను అనుసరించి, మిలటరీ, దౌత్య పరంగా చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సున్నితమైన వివాదాలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. సరిహద్దుల్లో బలగాల మోహరింపుతో అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. అని చెప్పారు.
ఎర్ర సముద్రంలో నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన అతిపెద్ద దాడిని తిప్పికొట్టిన అమెరికా, బ్రిటన్‌లు.. ఆ తిరుగుబాటుదారులపై సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూప్ మంగళవారం రాత్రి 21 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించగా, వాటిని యుద్ధనౌకలు, జెట్స్ తిప్పికొట్టాయి.
దాడులకు హౌతీ తక్షణమే ఒక ముగింపు పలకాలనే తీర్మానాన్ని బుధవారం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది.
ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటేయగా.. రష్యా, చైనా, అల్గేరియా, మొజాంబిక్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
తమ నౌకలను కాపాడుకునే హక్కు ఐరాస సభ్య దేశాలకు ఉందని తీర్మానంలో ఉంది. ఈ తీర్మానంపై హౌతీ తిరుగుబాటుదారులు తీవ్రంగా స్పందించారు.
ఈ తీర్మానాన్ని ఒక పొలిటికల్ గేమ్‌గా హౌతీ నేత మొహమ్మద్ అలీ అల్-హౌతీ అభివర్ణించారు.
మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు చేస్తున్న దాడులపై అమెరికా, మిత్ర దేశాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడులకు తగిన పరిణామాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా, మిత్రదేశాలు హెచ్చరించాయి.
ప్రపంచంలోని 20 శాతం కంటైనర్ షిప్‌లు ఎర్ర సముద్రం గుండా వెళ్లడం లేదని, దానికి బదులుగా ఆఫ్రికాలో దక్షిణ వైపు నుంచి సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తున్నాయని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ షిప్పింగ్ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు మద్దుతు ఇస్తున్న అమెరికా దేశ నౌకను లక్ష్యంగా చేసుకుని మంగళవారం దాడి జరిపినట్లు హౌతీ తిరుగుబాటు దారులు ప్రకటించారు. నవంబర్ 19 నుంచి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఇది 26వది.
మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది.
ఈ విషయాన్ని అధికారిక వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపడుతున్న ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీచేసింది.
ఈడీకి చెందిన శ్రీనగర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీటులో ఆయన పేరును చేర్చింది.
ఈడీ విచారణ ప్రకారం.. జేకేసీఏ అధికారులకు చెందిన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు బదిలీ అయ్యాయి. జేకేసీఏతో సంబంధం లేని చాలా మంది వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లోకి కూడా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలిసింది.
కచ్చితంగా ఎలాంటి కారణాలను తెలుపకుండా జేకేసీఏ బ్యాంకు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను విత్ డ్రా చేసినట్లు ఈడీ విచారణలో తేలింది.
ఈడీ ఈ కేసును 2018 నుంచి విచారణ చేపడుతోంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.