చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో స్వల్ప ప్రమాదం

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో, ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. దిల్లీ అల్లర్ల కుట్ర కేసు: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌‌లకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. అయోధ్య: రామ మందిర ప్రాణప్రతిష్టకు అడ్వాణీ వస్తారని చెప్పిన వీహెచ్‌పీ

    అడ్వాణీ

    ఫొటో సోర్స్, ANI

    అయోధ్యలోజనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీ కూడా హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ధ్రువీకరించింది.

    వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    గతంలో ఈ కార్యక్రమానికి అడ్వాణీ హజరు కాబోరని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.

    కానీ, విశ్వహిందూ పరిషత్ నేత అలోక్ కుమార్ స్వయంగా అడ్వాణీ వద్దకు వెళ్లి ఆహ్వానించడంతో ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఖాయమైంది.

    ఇంతకంటే ముందు వయస్సును దృష్టిలో ఉంచుకొని అడ్వాణీతో పాటు మురళీ మనోహర్ జోషి రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావొద్దని కోరినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.

    లాల్ కృష్ణ అడ్వాణీకి ఇప్పుడు 96 ఏళ్లు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. రొమాంటిక్ రిలేషన్‌షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?

  5. విమానం డోర్ ఆకాశంలో ఉండగానే ఊడిపోయి గాలికి కొట్టుకుపోయింది... ఆ తప్పెవరిది?

  6. రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?

  7. ఒక్క తప్పుడు ట్వీట్‌తో రికార్డు స్థాయిలకు పెరిగిన బిట్‌కాయిన్ ధర

    బిట్ కాయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ)కు చెందిన ఎక్స్(ట్విటర్) అకౌంట్లో మంగళవారం పోస్టు అయిన ఒక ట్వీట్‌తో బిట్‌కాయిన్ ధర రికార్డు స్థాయిలను నమోదు చేసింది.

    క్రిప్టోకరెన్సీలో సరికొత్త స్పాట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లకు(ఈటీఎఫ్‌లకు) ఎస్‌ఈసీ ఆమోదం తెలిపిందని ఆ ట్వీట్‌లో ఉంది.

    కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఎస్ఈసీ డిలీట్ చేసింది. తమ అకౌంట్ హ్యాక్‌కు గురైందని ఎస్‌ఈసీ చెప్పింది.

    ఎలాంటి స్పాట్ బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ప్రొడక్టుల లిస్టింగ్‌కు, ట్రేడింగ్‌కు తాము అనుమతి ఇవ్వలేదని తెలిపింది.

    ఈ తప్పుడు పోస్టు వల్ల, బిట్‌కాయిన్ ధర 46 వేల డాలర్ల నుంచి 48 వేల డాలర్లకు పెరిగింది. ఎస్ఈసీ స్పష్టత తర్వాత బిట్‌కాయిన్ ధర మళ్లీ తగ్గింది.

    అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీ ఈ వారంలో కొత్త ఈటీఎఫ్‌లపై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. చంద్రబాబుకు ఊరట, మూడు కేసుల్లో బెయిల్ మంజూరు

    చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, Getty Images

    ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది.

    ఇప్పటికే ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కుంభకోణం కేసుల్లో కూడా ప్రస్తుతం బెయిల్ వచ్చింది.

    వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసులు నమోదు చేసిందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై గతంలోనే వాదనలు ముగియగా.. తీర్పులు రిజర్వు చేశారు.

    బుధవారం మధ్యాహ్నం ఈ కేసుల తీర్పును వెలువరించిన ఏపీ హైకోర్టు, చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది.

    ఈ కేసుల విచారణకు సహకరించాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది.

    బహిరంగ సమావేశాల్లో, మీడియా సంస్థల వద్ద ఈ కేసులకు సంబంధించిన విషయాలను ప్రస్తావించవద్దని కోర్టు చంద్రబాబు నాయుడిని ఆదేశించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లడం లేదన్న కాంగ్రెస్

    సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    అయోధ్యలో శ్రీరామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు హాజరు కావడం లేదు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు.

    ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలు హాజరు కావడం లేదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ పేరుతో ప్రకటన విడుదలైంది.

    ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవెంట్‌గా అభివర్ణించింది.

    మతమనేది వ్యక్తిగత విషయం. కానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అయోధ్య ఆలయ మహోత్సవాన్ని రాజకీయ అంశంగా మార్చారని కాంగ్రెస్ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. సుచనా సేథ్: 'నాలుగేళ్ళ కొడుకును చంపి, బ్యాగులో కుక్కి, రహస్యంగా కారులో తీసుకెళుతున్న ఈ తల్లి’ ఎలా దొరికిపోయారంటే....

  11. ఎక్సర్‌సైజ్‌: ఉదయం చేస్తే మంచిదా, సాయంత్రం బెటరా, ఏమిటి తేడా?

  12. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో స్వల్ప ప్రమాదం

    రైలు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో, ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

    ఇవాళ ఉదయం 9.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ రైళ్లు ఆగే టర్మినల్ స్టేషన్. చివరికి రాగానే అక్కడ రైలు ఆగాల్సి ఉంది. కానీ, రైలు ఆగకుండా మరింత ముందుకు కదిలింది.

    ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు తలుపులకు దగ్గరగా నిల్చున్న ఐదుగురికి ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ చెప్పారు. రైల్వే ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. యూపీ: కుంపటి కారణంగా నిద్రలోనే కన్నుమూసిన ఐదుగురు కుటుంబ సభ్యులు

    ఇంట్లో కుంపటి

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

    చలికాలం కావడంతో వెచ్చదనం కోసం వీరంతా నిద్రపోయే గదిలో వేసుకున్న కుంపటి వల్ల పొగతో ఊపిరాడక వీరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    అలిపూర్ బుద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

    మరో ఇద్దరు కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    ‘‘ఆక్సీజన్ అందకపోవడం వల్ల మీరు మరణించినట్లు మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరు పడుకున్న గదిలో కుంపటి వేసి ఉంది’’ అని పోలీసులు తెలిపినట్లు ఎన్‌డీటీవీ రిపోర్టుచేసింది.

    ఈ మరణాలకు గల కచ్చితమైన కారణాలను తాము విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.