'ముస్లిం దేశాధినేతల్లారా మాకు ఆయుధాలివ్వండి' - హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే

హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే ఖతార్‌లో ఏర్పాటైన ముస్లిం మేధావుల సదస్సులో మాట్లాడుతూ, “గాజాలో చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏ లక్ష్యాలనూ సాధించలేకపోయింది. పూర్తిగా విఫలమైంది” అని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు

  3. 'ముస్లిం దేశాధినేతల్లారా మాకు ఆయుధాలివ్వండి' - హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే

    హమాస్ లీడర్ ఇస్మాయిల్ హానియే

    ఫొటో సోర్స్, AFP

    ఫొటో క్యాప్షన్, హమాస్ లీడర్ ఇస్మాయిల్ హానియే

    హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే ఖతార్‌లో ఏర్పాటైన ముస్లిం మేధావుల సదస్సులో మాట్లాడుతూ, “గాజాలో చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏ లక్ష్యాలనూ సాధించలేకపోయింది. పూర్తిగా విఫలమైంది” అని అన్నారు.

    “పాలస్తీనా సమస్యను అణచివేసేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగానే అక్టోబర్ 7 దాడులు జరిగాయి” అని హానియే చెప్పారు. గాజాలో బందీలుగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ, “మా ఖైదీలు అందరినీ విడుదల చేస్తే కానీ, ఇజ్రాయెల్ తమ బందీలను విడుదల చేయించుకోవడం సాధ్యం కాదు” అని అన్నారు.

    ఆ తరువాత హమాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో హానియే ముస్లిం దేశాలకు విజ్ఞప్తి చేశారు. “మా ప్రతిఘటనకు ఆయుధాలు ఇచ్చి సహకరించండి. ఎందుకంటే, ఇది పాలస్తీనా ప్రజల పోరాటం మాత్రమే కాదు” అని ఆన్నారు.

    ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో గాజాలో 126 మంది చనిపోయారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క సెంట్రల్ గాజా ఆస్పత్రిలోనే 57 మంది చనిపోయారని చెప్పింది.

    మరో వైపు ఇజ్రాయెల్ కూడా ఖాన్ యూనిస్ నగరంలో ’40 మంది తీవ్రవాదులను’ మట్టుపెట్టామని ప్రకటించింది. హమాస్ సొరంగాలను గుర్తించామని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.

  4. ఏఐ సైకాలజిస్ట్‌తో మానసిక సమస్యలు దూరమవుతాయా... నిజమైన థెరపిస్ట్ కంటే ఈ చాట్‌బాట్ క్యారెక్టరే బెటరా?

  5. బిల్కిస్ బానో కేసు: సుప్రీంకోర్టు తీర్పులోని తీవ్రమైన వ్యాఖ్యలేంటి?

  6. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం

  7. ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేస్తే ఎన్నికల్లో ఓడిపోయారు

  8. ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా?

  9. ఫార్ములా ఈ-రేసింగ్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటీసులు

    నోటీసులు

    ఫొటో సోర్స్, TS govt

    ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణకు చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలంటూ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

    సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ తోపాటు ప్రైవేటు ఆర్గనైజర్‌తో త్రైపాక్షిక ఒప్పందం ఎలా చేసున్నారో చెప్పాలని అడిగింది.

    ఆర్థిక శాఖ, హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా టాక్సులతో కలిపి రూ.55 కోట్ల హెచ్ఎండీఏ నిధులు ఎలా చెల్లించారో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

    మొత్తం 9 రకాల ఉల్లంఘనలు జరిగాయని, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అర్వింద్ కుమార్ కు సీఎస్ శాంతికుమారి నోటీసులు జారీ

    నోటీసులు

    ఫొటో సోర్స్, TS govt

  10. సల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లో చొరబడటానికి యత్నించిన ఇద్దరి అరెస్ట్

    సల్మాన్ ఖాన్

    ఫొటో సోర్స్, YEARS

    బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరిని నవీ ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఈ ఇద్దరు నిందితులను పంజాబ్‌కు చెందిన అజేష్ కుమార్ గిలా, గురుసేవక్ సింగ్ సిఖ్ గా గుర్తించారు.

    వీరిద్దరూ ఫామ్‌హౌస్ గోడదూకేందుకు ప్రయత్నించగా.. ఫామ్ హౌస్ మేనేజర్ వీరిని పట్టుకుని ముంబయి పోలీసులకు అప్పగించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

  11. బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    షేక్ హసీనా, నరేంద్ర మోదీ (ఫైల్)

    ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

    ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్)

    బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలలో వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకున్న అవామీ లీగ్ అధ్యక్షురాలు, ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

    ‘‘ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడాను. వరుసగా నాలుగోసారి విజయం సాధించినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపాను. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో భాగమైన బంగ్లాదేశ్ ప్రజలనూ అభినందించాను’’ అని ఎక్స్‌లో ప్రధాని మోదీ రాశారు.

    ప్రజలు కేంద్రంగా బంగ్లాదేశ్‌తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్టు మోదీ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మరోపక్క చైనా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనా విజయాన్ని అభినందించాయి.

    అయితే అమెరికా మాత్రం ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనకపోవడంతో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగలేదని ఆరోపించింది.

    ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకపోవడంపై అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విచారం వ్యక్తం చేశారు.

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.