SAvsIND: రెండో టెస్టులో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ డ్రా

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌ను గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది భారత్.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.

  2. డ్రైవర్ హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబు సీఎం సభల్లో ఎందుకు కనిపిస్తున్నారు... ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారా?

  3. బంగ్లాదేశ్ ఎన్నికలు భారత్‌‌కు ఎందుకంత ముఖ్యం?

  4. రాహుల్ గాంధీ: జనవరి 14 నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర'

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    జనవరి 14వ తేదీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు.

    ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్) వేదికగా పాదయాత్రకు రూట్ మ్యాప్ షేర్ చేశారు.

    జనవరి 14న నుంచి మణిపూర్‌లో ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ యాత్ర ముంబై వరకు కొనసాగుతుందని ట్వీట్ చేశారు.

    66 రోజులపాటు 6700 కిలోమీటర్ల మేర 110 జిల్లాలను కలుపుతూ ఈ పాదయాత్ర సాగనుందని ట్వీట్‌లో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. బ్రేకింగ్ న్యూస్, SAvsIND: రెండో టెస్టులో భారత్ విజయం.. శ్రేయస్ ఫినిషింగ్ షాట్

    దక్షిణాఫ్రికా, భారత్ టెస్ట్ క్రికెట్

    ఫొటో సోర్స్, ANI

    భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది.

    రెండో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి, భారత్‌కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దక్షిణాఫ్రికా.

    రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో ముగిసింది. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

    యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 17 పరుగులు చేశాడు.

  6. అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?

  7. కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

    కేసీఆర్‌ను పరామర్శించిన జగన్

    ఫొటో సోర్స్, @BRSparty

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు

    జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన జగన్‌, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జగన్‌కు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.

    ఇటీవల ఫామ్ హౌస్‌లో జారి కింద పడటం వల్ల కేసీఆర్‌కు యశోద ఆస్పత్రిలో తుంటి ఆపరేషన్ జరిగింది.

    ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయిన కేసీఆర్, నందినగర్‌లోని తన నివాసంలో వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారు.

  8. షర్మిల రాకతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకుంటుందా?

  9. దిల్లీ: కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, వైఎస్సార్‌టీపీని విలీనం చేస్తున్నట్లు ప్రకటన

    షర్మిల

    ఫొటో సోర్స్, ANI

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ, మరికొందరు నాయకుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

    ‘‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో నేటి నుంచి విలీనమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితాన్నంత కాంగ్రెస్‌ పార్టీ కోసం వెచ్చించారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయే రోజు వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు. నేను చేసింది రాజశేఖర్ రెడ్డి గారికి గర్వం కలిగించే అంశమని నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద లౌకిక పార్టీ(సెక్యూలర్ పార్టీ). ప్రతి వర్గానికి నమ్మకం కలిగిస్తూ. కలుపుకుపోతూ ముందుకెళ్లిన పార్టీ కాంగ్రెస్. క్రిస్టీయన్లపై మణిపూర్‌లో దాడులు జరగడం దారుణం. చాలా మంది రోడ్డున పడ్డారు. నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో ఇలాంటి సెక్యులర్ పార్టీకి అధికారం లేకపోవడం నన్ను బాధించింది.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

    షర్మిల

    ఫొటో సోర్స్, @Congress4TS

    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

    ‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల మెజార్టీ భారత ప్రజలకు నమ్మకం కలిగించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం నాన్న కల. అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి కూతురు పనిచేస్తుంది.’’ అని ఆమె అన్నారు.

  10. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయబోతోందని ‘ఆప్’ నేతల ట్వీట్స్

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర భద్రతను పెంచారు.

    సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇవాళ (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేయబోతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, దిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు ట్వీట్స్ చేయడంతో భద్రతా చర్యలు చేపట్టారు.

    పార్టీ కార్యకర్తలు, అభిమానులు రావచ్చన్న అనుమానంతో కేజ్రీవాల్ నివాసం బయట బారికేడ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులను మోహరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు బుధవారం రాత్రి చేసిన ట్వీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై గురువారం ఈడీ దాడులు చేస్తుందని, అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు.

    దిల్లీ మద్యం పాలసీ కేసులో ఇటీవల ఈడీ జారీ చేసిన సమన్లకు మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు.

    ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తప్పుబడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు భయపడుతున్నారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.