ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ దేశ కార్మిక చట్టాలను ఉల్లంఘించారని చెబుతూ బంగ్లాదేశ్‌లోని కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు మళ్లీ కలుద్దాం.
నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ దేశ కార్మిక చట్టాలను ఉల్లంఘించారని చెబుతూ బంగ్లాదేశ్‌లోని కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను ప్రొఫెసర్ యూనస్ బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తుంటారు. దాంతో, ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని యూనస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆర్థికవేత్త మరో ముగ్గురు సహచరులతో కలసి గ్రామీణ్ టెలికామ్ అనే సంస్థను స్థాపించారు. ఆయన ఇలాంటివి మొత్తం మూడు సంస్థలు స్థాపించారు. అయితే, గ్రామీణ్ టెలికామ్ సంస్థ తన కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేరం కిందే యూనస్, ఆయన సహచరులు ముగ్గురి మీద కేసు పెట్టి శిక్ష విధించారు.
అయితే, తాము ఏ తప్పూ చేయలేదని వారన్నారు. పైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వారికి బెయిల్ మంజూరైంది.
“మా లాయర్లు ఎంతో న్యాయబద్ధంగా ఈ కేసు వాదించారు. కానీ, ఎలాంటి హేతుబద్ధత లేకుండా, చట్టపరమైన విధానాలను పాటించకుండా కోర్టు వ్యవహరించింది” అని ప్రొఫెసర్ యూనస్ అన్నారు.
టొయామా సిటీలో భూకంపం వచ్చినప్పుడు కార్లు ఊగిపోవడాన్ని కింది వీడియోలో మీరు చూడొచ్చు.
భూకంపానికి సంబంధించిన వివరాలకు ఈ లింకును క్లిక్ చేయండి.
జపాన్‌లో సోమవారం సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఒక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
అత్యవసర సేవల కోసం ఈమెయిల్ ఐడీతో పాటు అయిదు ఫోన్ నంబర్లను జారీ చేసింది.
ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
సహాయం పొందడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
1.+81-80-3930-1715(యాకూబ్ టోప్నో)
2.+81-70-1492-0049 (అజయ్ సేథీ)
3.+81-80-3214-4734 (డీఎన్ బర్న్‌వాలా)
4.+81-806229-5382 (ఎస్. భట్టాచార్య)
5.+81-80-3214-4722 (వివేక్ రాఠి)
ఇవే కాకుండా [email protected], [email protected] అనే రెండు ఈమెయిల్ ఐడీలు జారీ చేసింది.
జపాన్ ప్రభుత్వం భూకంపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా తాజా హెచ్చరికలు జారీ చేసింది.
ఇషికావా, నిగాటా, నగానో, టొమాయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
సెంట్రల్ జపాన్‌లో గత మూడు గంటల్లో 3.6 నుంచి 7.6 స్థాయితో 30కి పైగా భూప్రకంపనలు వచ్చాయి.
జపాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సంబంధించి బయటకు వచ్చిన ఫొటోల్లో భూకంప తీవ్రత కనిపిస్తోంది.
రోడ్లపై భారీ చీలికలు, ధ్వంసమైన భవనాల శిథిలాలు ఫొటోల్లో కనిపిస్తున్నాయి.
మరోవైపు, ఇషికావా రాష్ట్రంలోని దాదాపు 32,500 ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయిందని స్థానిక ప్రభుత్వాలను ఉటంకిస్తూ క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపినట్లు క్యోడో పేర్కొంది.
జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్ తీరం నోటో ప్రాంతంలోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి అధికారిక టీవీ ఎన్‌హెచ్‌కేలో హెచ్చరికలు వెలువడ్డాయి.
నోటోలో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే ప్రమాదం ఉందన్నారు.
నోటోకు పొరుగున ఉన్న నిగాటా, తొయామాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలంటూ పెద్దపెద్ద అక్షరాలతో టీవీల్లో హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మరోవైపు దక్షిణ కొరియా వాతావరణ శాఖ ఆ దేశంలోనూ సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. దేశ తూర్పు తీరంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.29 గంటల ప్రాంతంలో 0.3 మీటర్ల ఎత్తున అలలతో సునామీ రావొచ్చని హెచ్చరించింది.
టెస్ట్ క్రికెట్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.
జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో మొదలుకానున్న టెస్ట్ మ్యాచ్ ఆయనకు చివరి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ కానుంది.
తన రిటైర్మెంట్‌తో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయని, ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు తనకు కూడా స్వేచ్ఛ లభిస్తుందని వార్నర్ చెప్పాడు.
ఐపీఎల్‌లో ఆడే డేవిడ్ వార్నర్‌కు భారత్‌లో భారీగా అభిమానులున్నారు. ఆటలో దూకుడుతో పాటు నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసే వీడియోలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు సహా భారతీయ సినిమాల పాటలు, ఇతర సన్నివేశాలను అనుకరిస్తూ ఆయన సరదా వీడియోలు చేస్తుంటారు.
ఇప్పటివరకు 161 వన్డే మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 6,932 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన వారిలో వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
2024 సంవత్సరం తొలి రోజున ఇస్రో ‘ఎక్స్ రే పొలారిమీటర్’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహన నౌక సోమవారం ఉదయం ఈ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు.
ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం రాకెట్ నుంచి వేరుపడి భూమికి 650 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా చేరినట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌక ఎక్స్‌పోశాట్‌తో పాటు ‘తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్’ కళాశాల విద్యార్థులు రూపొందించిన మరో ఉపగ్రహం, కొన్ని ఇతర ఉపగ్రహాలను మోసుకెళ్లింది.
ఎక్స్‌పోశాట్ అంతరిక్షంలో అయిదేళ్ల పాటు పనిచేస్తుంది. ఇది కాస్మిక్ ఎక్స్ కిరణాల డేటాను సేకరిస్తుంది.
ఇస్రో తయారుచేసిన ఈ ఉపగ్రహం అంతరిక్షంలో అబ్జర్వేటరీలా పనిచేస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.