ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
మాయెస్క్ర్ హాంగ్‌ఝావూ నౌకను హైజాక్ చేసేందుకు హౌతీ తిరుగుబాటుదారులు ప్రయత్నించారని యూఎస్ మిలటరీ తెలిపింది.
హూతీ తిరుగుబాటుదారులు నాలుగు బోట్లలో ఆ నౌకను చుట్టుముట్టిన క్రమంలో, నౌక నుంచి వచ్చిన అలెర్ట్‌కు స్పందించి, దగ్గరలో ఉన్న హెలికాఫ్టర్లను సాయం కోసం పంపినట్లు తెలిపింది.
హైజాజ్‌కు ప్రయత్నించిన నాలుగు బోట్లలో మూడింటిని ధ్వంసం చేశామని, ఆ బోట్లు మునిగిపోయి, అందులోని వారు మరణించినట్లు తెలిపింది. నాలుగో బోట్ తప్పించుకుపోయిందని యూఎస్ మిలటరీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర మార్గంలో 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ సంస్థ అయిన మాయెస్క్ర్ ప్రకటనలో తెలిపింది.
ఎందుకు దాడులు చేస్తున్నారు?
ఎర్రసముద్రం మార్గంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు.
వీరు హమాస్‌కు మద్దతుగా, ప్రధానంగా ఇజ్రాయెల్‌కు సంబంధించిన, ఇజ్రాయెల్‌కు వెళ్తున్న రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు. నవంబర్ 19వ తేదీ నుంచి మొదలైన దాడుల్లో ఇది 18వ దాడి.