ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
జనవరి 22న రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు వారాల ముందు ప్రధానమంత్రి అయోధ్యలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Reuters
ఉక్రెయిన్ గడిచిన 24 గంటల్లో రష్యా సరిహద్దు నగరమైన బెల్గోరోడ్ సహా పలు పశ్చిమ రష్యాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిందని రష్యా అధికారులు తెలిపారు.
రష్యన్ ఎమర్జెన్సీ మినిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్గోరోడ్ నగరంపై జరిగిన దాడుల్లో ఇద్దరు చిన్నపిల్లలు సహా 14 మంది మరణించారు. పదులకొద్దీ గాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు గడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ దాడుల వెనుక ఉన్నది తామేనని ఉక్రెయిన్ ధ్రువీకరించింది. ఉక్రెయిన్ భద్రతా బలగాల నుంచి బీబీసీకి అందిన సమాచారం ప్రకారం, "మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసిన దాడులు అవి. అయితే, రష్యన్ వైమానిక రక్షణ వ్యవస్థ అసమర్థత వలన ఆ ప్రాణనష్టం సంభవించింది. అందుకు రష్యాదే బాధ్యత"

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, ANI
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్, వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటికే వందేభారత్ రైళ్ల గురించి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా పలు స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లపై అందరి దృష్టి ఉంది.
ప్రత్యేకతలేంటి?
గంటకు గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ పుష్-పుల్ రైలు అతితక్కువ సమయంలోనే వేగాన్ని అందుకుంటుంది.
ముందూవెనుక ఇంజిన్లు ఉండే, ఈ రైలులో 22 కోచ్‌లు ఉండగా, వీటిలో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డ్ కంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ రెండు కోచ్‌లలోనే కొంత భాగాన్ని మహిళలు, దివ్యాంగులకు కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, ani
అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు.
ఈ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు నూతనంగా నిర్మించిన విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి రోడ్‌షో నిర్వహించారు.
జనవరి 22న రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు వారాల ముందు ప్రధానమంత్రి అయోధ్యలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పాత విమానాన్ని లారీలో తీసుకెళుతుండగా అది ఓ వంతెన కింద చిక్కుకు పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ స్క్రాప్ విమానాన్ని అస్సాం నుంచి ముంబయికి లారీ మీద తరలిస్తున్నారు. అయితే, బిహార్‌లోని మోతిహారీ నగరంలో అది ఒక వంతెన కిందుగా వెళ్లుతుండగా అక్కడ ఇరుక్కుపోయిందని స్థానిక మీడియా తెలిపింది.
మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఆ విమానాన్ని బ్రిడ్జి కింద నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్థానిక డ్రైవర్ల సాయంతో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
రష్యా చేసిన వరస బాంబు దాడుల్లో తమ దేశ ప్రజలు కనీసం 30మంది మరణించారని యుక్రెయిన్ వెల్లడించింది.
ఈ యుద్ధంలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద బాంబు దాడి కూడా ఇదేనని యుక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్నారు. ఈ దాడిలో 160 మంది గాయపడ్డారు.
శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని, కీయేవ్, ఒడెసా, డ్నిప్రోపెట్రోవ్స్క్, ఖార్కియెవ్, ఎల్వివ్ పట్టణాలపై వరసగా బాంబుల దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
రష్యా తన దగ్గరున్న అన్ని రకాల బాంబులను ఈ దాడులలో ఉపయోగించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలెదిమీర్ జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఇన్ని బాంబులను ఒకేసారి ప్రయోగించడం తామెప్పుడూ చూడలేదని యుక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్నారు.
ఈ దాడుల కారణంగా అనేక ఇళ్లు, ఆసుపత్రులు దెబ్బ తిన్నాయని కూడా యుక్రెయిన్ ప్రకటించింది.
పేలుళ్లు జరిగిన ప్రాంతాలలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది.

అయోధ్యంలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు ప్రారంభిస్తారు. ఎయిర్ పోర్టుతోపాటు అయోధ్యలో ఆధునికీకరించిన అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
రామమందిర నిర్మాణంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట జరగునున్న నేపథ్యంలో అయోధ్యలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరిగాయి.
రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంతోపాటు కొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు, అలాగే ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్‌లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
ప్రధాని రాక సందర్బంగా అయోధ్యలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాటు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.