యతి ఎయిర్‌లైన్స్: పైలట్లు పొరపాటున పవర్ ఆపేయడం వల్లే విమానం కూలిందంటూ నివేదిక

ఫొటో సోర్స్, Reuters
నేపాల్ విమాన ప్రమాదానికి పైలట్లు పొరపాటున పవర్ నిలిపేయడమే కారణం అయ్యుండొచ్చని ప్రభుత్వం నియమించిన పరిశోధకుల నివేదిక వెల్లడించింది.
దీనివల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు.
జనవరి 15న నేపాల్ రాజధాని ఖట్మాండు నుంచి పోఖ్రాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో ఇద్దరు పసిపిల్లలతో సహా 72 మంది చనిపోయారు.
గత 30 ఏళ్లలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే.
‘‘రెండు ఇంజిన్ ప్రొపెల్లర్ల నుంచి వచ్చిన సంకేతాల తర్వాత అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించడంలో, తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విమాన సిబ్బంది విఫలమయ్యారు’’ అని నివేదికలో రాశారు.





