You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అనకాపల్లి: అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని అయిదుగురి ఆత్మహత్యాయత్నం, నలుగురి మృతి

కుసుమ అనే తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. యతి ఎయిర్‌లైన్స్: పైలట్లు పొరపాటున పవర్ ఆపేయడం వల్లే విమానం కూలిందంటూ నివేదిక

    నేపాల్‌ విమాన ప్రమాదానికి పైలట్లు పొరపాటున పవర్ నిలిపేయడమే కారణం అయ్యుండొచ్చని ప్రభుత్వం నియమించిన పరిశోధకుల నివేదిక వెల్లడించింది.

    దీనివల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు.

    జనవరి 15న నేపాల్ రాజధాని ఖట్మాండు నుంచి పోఖ్రాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో ఇద్దరు పసిపిల్లలతో సహా 72 మంది చనిపోయారు.

    గత 30 ఏళ్లలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే.

    ‘‘రెండు ఇంజిన్ ప్రొపెల్లర్ల నుంచి వచ్చిన సంకేతాల తర్వాత అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించడంలో, తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విమాన సిబ్బంది విఫలమయ్యారు’’ అని నివేదికలో రాశారు.

  2. అమెరికా: మళ్లీ అధ్యక్షుడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు షాకిచ్చిన మేన్ రాష్ట్రం

    అమెరికాలోని ఈశాన్య రాష్ట్రమైన మేన్ ఎన్నికల అధికారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చారు.

    2021 క్యాపిటల్ హిల్ అల్లర్లలో ట్రంప్ పాత్ర కారణంగా ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని మేన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ షేనా లీ బెలోస్ తేల్చి చెప్పారు.

    ఈ నిర్ణయం కారణంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మైన్ రాష్ట్రంలో జరగనున్న ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పాల్గొనలేరు.

    కొలరాడో తర్వాత ఇప్పుడు మేన్ ఈ నిర్ణయం తీసుకొని ట్రంప్‌ను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించిన రెండో రాష్ట్రంగా నిలిచింది.

    ఈ రెండు రాష్ట్రాల నిర్ణయాలను ట్రంప్ ఇప్పుడు కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.

  3. అనకాపల్లి: అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని అయిదుగురి ఆత్మహత్యాయత్నం, నలుగురి మృతి

    అనకాపల్లిలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

    వీరిలో కొడవలి రామకృష్ణ, ఆయన భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వీ లక్ష్మి మృతి చెందారు.

    కుసుమ అనే తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు తెలిపారు.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేయండి.