వినేశ్ ఫోగాట్: ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కు ఇచ్చేస్తా

ఖేల్‌రత్న, అర్జున అవార్డులను తాను వెనక్కు ఇచ్చేయబోతున్నట్టు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఎక్స్(ట్విటర్)‌లో ప్రకటించారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె ఒక లేఖ రాశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఫ్లయింగ్ డాక్టర్: ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగమా?

  3. ‘రూ.33 లక్షలు ఖర్చు పెట్టి డంకీ రూట్‌లో అమెరికా చేరుకున్నా.. అడుగు మోపగానే అరెస్టు చేసి, 22 నెలలు జైల్లో పెట్టారు’

  4. దిల్లీ: ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు

    న్యూదిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది.

    దీనిపై దిల్లీ పోలీసులు, భద్రతా బృందాలు విచారణ జరుపుతున్నాయని ఇజ్రాయెల్ రాయబార కార్యలయాధికారులు తెలిపారు.

    రాయబార కార్యాలయ సమీపంలో పేలుడుకు సంబంధించిన విచారణకు తమ అధికారులు, భారత అధికారులకు పూర్తిగా సహకరిస్తారని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

    అయితే, ఈ పేలుడులో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పీటీఐ వార్తాసంస్థ ఈ పేలుడుకు సంబంధించి ఎంబసీ సమీపంలోని సెంట్రల్ హిందీ ట్రైనింగ్ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడింది.

    సాయంత్రం ఐదు గంటల సమయంలో పేలుడు శబ్దం విన్నట్టు, బయటకు వచ్చి చూస్తే ఓ చెట్టు వద్ద పొగలు కనిపించాయని సెక్యూరిటీ గార్డు తెలిపారు.

  5. రెజ్లింగ్‌: వినేశ్ ఫోగాట్ సాధించిన విజయాలు ఏమిటి?

  6. వినేశ్ ఫోగాట్: ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కు ఇచ్చేస్తా

    వినేశ్ ఫోగాట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫోగాట్

    మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను తాను వెనక్కు ఇచ్చేయబోతున్నట్టు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఎక్స్(ట్విటర్)‌ వేదికగా ప్రకటించారు.

    తన నిర్ణయంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను కూడా షేర్ చేశారు.

    ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో సంజయ్ సింగ్ విజయంతో ‘‘మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఆధిపత్యం సమాఖ్యలో అలానే కొనసాగుతుందనేది స్పష్టమైంది’’ అంటూ ఆమె విచారం వ్యక్తంచేశారు.

    అయితే, ఎన్నికైన కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ప్రధానికి రాసిన లేఖలో, “మీ విలువైన సమయంలో ఐదు నిముషాలు కేటాయించి, ఆ వ్యక్తి మీడియా ముఖంగా అన్న వ్యాఖ్యలను గమనించండి. ఆయన ఏం చేశారో మీకు అర్థమవుతుంది. ఆయన మహిళా రెజర్లను కించపరిచే ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. పైగా మహిళా రెజర్లను అవమానపరిచేలా మాట్లాడారు. మహిళా రెజర్లను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు మీడియా ముందే ఒప్పుకున్నారు” అని వినేశ్ ఫోగాట్ చెప్పారు.

    తన జీవితంలో ఇక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులు ఉండటంలో అర్థం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

    భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో సాక్షి మలిక్ ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించారు.

  7. విభజన హామీలు అమలు చేయండి: ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.

    ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన ‘విభజన’ హామీలు అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు.

    మంగళవారం దిల్లీలో ప్రధానమంత్రిని రేవంత్ కలిశారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.

    రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.

    దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతూ ప్రధానికి రేవంత్ వినతిపత్రం అందించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.

    ప్రధానితో భేటీలో రేవంత్, మల్లు భట్టి విక్రమార్క

    ‘‘ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. హైదరాబాద్‌కు ఐఐఎంను మంజూరు చేయాలి. రాష్ట్రానికి సైనిక్ స్కూల్ కేటాయించాలి. కొన్ని రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి. 2019-20, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పెండింగులో ఉన్న రూ.1,800 కోట్లు ఇవ్వాలని కోరాం’’ అని భట్టి విక్రమార్క మీడియాతో చెప్పారు.

    తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామని, అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు.

    తమ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, కేంద్రం తరపున రాష్ట్రానికి అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

  8. నటరాజ స్వామి ఆలయం: వాన నీటిని చోళులు ఎగువకు ఎలా ప్రవహింపజేశారు? చిదంబర రహస్యం ఇదేనా?

  9. ఇరాన్: 'ఇజ్రాయెల్ దాడిలో మా ఆర్మీ సీనియర్ కమాండర్ మృతి’

    ఇరాన్ మిలటరీ సీనియర్ కమాండర్ రజీ మొసావి

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సిరియాలో ఇజ్రాయెల్ దాడిలో తమ ఆర్మీ సీనియర్ కమాండర్ రజీ మొసావి చనిపోయారని ఇరాన్ చెప్పింది.

    సిరియాలో ఇరాన్‌ ఆర్మీ సీనియర్ కమాండర్ రజీ మొసావి మృతిచెందారని, ఈ దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ అని ఇరాన్ అనుమానిస్తోందని ఇరానీ వార్తాసంస్థ తస్‌నీమ్ తెలిపింది.

    ఆయన ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్’కు సలహాదారుగా ఉన్నారని తెలిపింది.

    ఆయన మృతి పట్ల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విచారం వ్యక్తం చేశారు.

    "ఇజ్రాయెల్ పాల్పడిన ఈ దాడి వారి బలహీనతకు నిదర్శనం. ఇజ్రాయెల్ దీనికి కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది" అని ఆయన హెచ్చరించారు.

    ఇరానీ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం మొసావి సిరియాలోని ఈశాన్య డమాస్కస్‌లోని సయిదా జైనాబ్ ప్రాంతంలో జరిగిన దాడిలో మృతి చెందారు.

    అయితే, ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.

    మొసావి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌కు పతనం మొదలైనట్లే అని రాశారు.

  10. దాడులు చేసిన వారు సముద్రం అడుగున దాగినా వదిలిపెట్టం: రాజ్‌నాథ్ సింగ్

    రాజ్‌నాథ్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

    భారత్‌కు వస్తున్న నౌకలపై దాడులు జరగడం పట్ల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

    మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో, సముద్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించారు.

    “ఇటీవలి కాలంలో సముద్రంలో నౌకలపై దాడులు పెరిగాయి. భారత్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలపడటాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

    అరేబియా సముద్రంలో వాణిజ్యనౌక ఎంవీ కెమ్ ప్లూటో నౌకపై జరిగిన దాడి, ఎర్ర సముద్రంలో ఎంవీ సాయిబాబా నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.

    భారతనౌకాదళం సముద్రంపై గస్తీని ముమ్మరం చేసింది” అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దాడులకు పాల్పడిన వారిని ఉద్దేశించి, “ఆ దాడులకు బాధ్యులెవరో మేం కనిపెడతాం. వారు సముద్రపు అడుగున ఉన్నా సరే, పట్టుకుని, కఠిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

    కొద్ది రోజుల క్రితం అరేబియా సముద్రంలో, భారత్‌కు వస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ ఈ దాడికి పాల్పడినట్లు అమెరికా ఆరోపించగా, ఇరాన్ మాత్రం ఖండించింది.

    నౌక ముంబయి తీరానికి చేరుకున్న తర్వాత భారత నౌకాదళం తనిఖీలు చేసింది.

  11. బ్రేకింగ్ న్యూస్, సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్: అరగంట ఆలస్యం, టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు షెడ్యూల్ సమయాని కంటే 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.

    పిచ్ తడిగా ఉండటం వల్ల మ్యాచ్‌ను కాస్త ఆలస్యంగా అంటే 2 గంటలకు ప్రారంభిస్తున్నారు.

    ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది.

    దీంతో భారత్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.

    భారత్ నుంచి ప్రసిధ్ కృష్ణ, దక్షిణాఫ్రికా జట్టులో బర్గర్, బెడింగ్‌హమ్ టెస్టు అరంగేట్రం చేయనున్నారు.

    గత 28 ఏళ్లలో సెంచూరియన్ వేదికగా జరిగిన 28 టెస్టుల్లో దక్షిణాఫ్రికా కేవలం మూడింటిలోనే ఓడిపోయింది. 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. అలెగ్జీ నవాల్నీ: అదృశ్యమైన ఈ పుతిన్ బద్ధశత్రువు మళ్లీ ఎక్కడ కనిపించారు ? ఇన్నాళ్లు ఏమయ్యారు....

  13. ఆంధ్రప్రదేశ్: విశాఖలో కరోనా పాజిటివ్ రోగి మృతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా పాజిటివ్ వచ్చిన శశికళ అనే మహిళ విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

    51 ఏళ్ల బాధితురాలు రెండు రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు.26వ తేదీ తెల్లవారుజామున ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ధ్రువీకరించారు.

    కోవిడ్ 19 ప్రభావంతో అనారోగ్యం పాలైన ఆమెకు వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు.

    అయితే, ఆమె మరణానికి కరోనా ఒక్కటే కారణమని చెప్పలేమని, మృతురాలికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

    ఆమె నుంచి తీసుకున్న కరోనా జినోమ్ శాంపిల్స్‌ను పరీక్షలు పంపామని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వైద్యులు తెలిపారు.

    ఇటీవల కోవిడ్ కొత్త వేరియంట్ ప్రభావం పెరుగుతున్నట్టు దేశవ్యాప్తంగా ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో విశాఖ మహిళా మృతి ఆందోళన కలిగిస్తోంది.

  14. డిజిటల్ పేమెంట్స్: జేబులో డబ్బులుంటేనే భారతీయులు భద్రంగా ఉన్నామని భావిస్తారా?

  15. మెర్తిర్ టిడ్‌ఫిల్: ‘వయగ్రా’ కు జన్మనిచ్చిన ఊరు ఇదే, ఆ మగవాళ్లే లేకుంటే ఏం జరిగేది?

  16. సెంచూరియన్ టెస్టు: మధ్యాహ్నం గం 1:30 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్

    సెంచూరియన్ టెస్టు

    ఫొటో సోర్స్, @BCCI/X

    భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేడు ప్రారంభం కానుంది.

    ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నం గం 1:30 గంటల నుంచి జరుగుతుంది.

    ఈ సిరీస్‌ను గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.

    దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఆడిన 8 టెస్టు సిరీస్‌లలో భారత్ ఏడు ఓడి, ఒక సిరీస్‌ను డ్రా చేసుకుంది.

    జట్లు (అంచనా)

    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్.

    దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, ఎయిడెన్ మార్క్‌రమ్, టోనీ డీ జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగమ్/కీగన్ పీటర్సన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో జెన్సన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయిట్జీ, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌నుక్లిక్ చేయండి.