సెంట్రల్ గాజా: శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 70 మంది మృతి చెందారన్న హమాస్

ఈ దాడిలో గాయపడినవారిని మగాజీ సమీపంలోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించారు.బయటకు వచ్చిన ఫుటేజీలో చాలా మంది పిల్లలు రక్తమోడుతూ కనిపిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. పోర్క్ విందాలూ: పంది మాంసంతో క్రైస్తవులు ఎక్కువగా వండుకునే ఈ వంటకం ఎందుకంత ఫేమస్?

  3. చలికాలం ఉత్తరాదిన తప్పక చూడాల్సిన ప్రాంతాలు ఏవి? వీటిలో మీరు ఎన్ని చూశారు?

    వీడియో క్యాప్షన్, సిమ్లా, మనాలి.. ఉత్తర భారతదేశంలో చలికాలంలో తప్పక చూడాల్సినవి ఏవేవి?

    మంచులో నడవడం, మంచుతో కప్పబడిన పర్వతాలను చూడటం, ఎవరికి ఇష్టం ఉండదు? వేసవి పర్యటకం మాదిరే వింటర్ టూరిజాన్నీ చాలా మంది పర్యటకులు ఇష్టపడతారు.

    భారత్‌లో శీతాకాలపు పర్యటకానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అనువైన సమయం.

    ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. తాజాగా కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మంచు వర్షం కురుస్తోంది.

    పని ఒత్తిడుల నుంచి విరామం తీసుకొని కుటుంబం, స్నేహితులతో టూర్‌కు వెళ్లాలని చాలా మంది అనుకొంటుంటారు.

    మరి, ఈ చలికాలంలో ఉత్తర భారతదేశంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి? అక్కడికి ఎలా వెళ్లాలి? వివరాలను ఈ వీడియోలో చూడండి.

  4. ‘సన్‌బర్న్’ ఫెస్టివల్‌లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?

  5. ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?

  6. సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?

  7. 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?

  8. ఎర్ర సముద్రం: సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఈ రూట్‌లో నౌకలపై దాడులు జరిగితే ప్రపంచం అంతా టెన్షన్ ఎందుకు?

  9. డంకీ, సలార్.. కలెక్షన్లలో ఎవరెక్కడ?

    ప్రభాస్, షారుక్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    షారుక్ ఖాన్ నటించిన డంకీ, ప్రభాస్ నటించిన సలార్ ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం సలార్, డంకీని దాటేసి రికార్డులు సృష్టిస్తోంది.

    డంకీ ఈ నెల 22న, సలార్ 23న థియేటర్లలోకి వచ్చాయి. ఈ చిత్రాల నిర్మాతలు మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ల లెక్కల్ని విడుదల చేశారు.

    డంకీ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 157.22 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    సలార్ అధికారిక ఖాతా విడుదల చేసిన డేటా ప్రకారంఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 402 కోట్ల రూపాయల్ని ఆర్జించింది.

    భారత దేశంలో ఈ చిత్రం 209 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సక్నిక్ అనే వెబ్‌సైట్ తెలిపింది. డంకీ వసూళ్లు భారత దేశంలో 31 కోట్ల రూపాయలని ఈ సంస్థ పేర్కొంది.

    షారుక్‌ఖాన్ నటించిన పఠాన్, జవాన్‌తో పోలిస్తే డంకీ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    డంకీ లేదా సలార్ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి స్పందన రాలేదు.

  10. పార్లమెంట్ భద్రతా వైఫల్యం: ఎంట్రీ పాస్‌లు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ఏమన్నారంటే?

    ఎంపీ ప్రతాప్ సింహ

    ఫొటో సోర్స్, FB/PRATAPSIMHA

    పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ స్పందించారు.

    లోక్‌సభలోకి చొరబడి రంగు పొగలు వదులుతూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన వారికి ఎంపీ ప్రతాప్‌సింహ సంతకంతో ఎంట్రీ పాస్‌లు జారీ చేశారు.

    తాను దేశభక్తుడినో లేదా దేశద్రోహినో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని తాజాగా ఎంపీ ప్రతాప్ సింహ అన్నారు.

    ‘‘నాపై వచ్చిన ఆరోపణలను ఆ ఈశ్వరుడి మీద, నా మద్దతుదారుల మీద వదిలేస్తున్నా. వాళ్లే నిర్ణయిస్తారు. నా అభిమానులు గత 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. నా నియోజకవర్గ ప్రజలు గత తొమ్మిదిన్నరేళ్లుగా నా పనిని గమనిస్తున్నారు. నేను దేశభక్తుడినో కాదో వాళ్లు, దేవుడే నిర్ణయిస్తారు.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారే దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది తప్ప నేను చెప్పడానికి ఇంకేమీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    2023 డిసెంబర్ 13న నలుగురు వ్యక్తులు లోక్‌సభ ప్రాంగణంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు.

  11. చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?

  12. సెంట్రల్ గాజా: శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 70 మంది మృతి

    సెంట్రల్ గాజా

    ఫొటో సోర్స్, Getty Images

    సెంట్రల్ గాజాలోని అల్-మగాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 70 మందికి పైగా మరణించినట్లు గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ కుద్రా అన్నారు.

    ఇజ్రాయెల్, అరబ్ మీడియా ప్రకారం... ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ కొత్త ప్రతిపాదన చేసింది.

    దాడికి సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని బీబీసీకి ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

    ఈ దాడిలో గాయపడినవారిని మగాజీ సమీపంలోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించారు.బయటకు వచ్చిన ఫుటేజీలో చాలా మంది పిల్లలు రక్తమోడుతూ కనిపిస్తున్నారు.

  13. ఛత్రపతి శివాజీ: ‘‘నన్ను చంపాలనుకుంటే చంపండి, బంధించాలనుకుంటే బంధించండి’’ అని ఔరంగజేబు దర్బారులో ఎందుకు అన్నారు?

  14. 303 మంది భారతీయ ప్రయాణికులతో ఫ్రాన్స్‌లో దిగిన విమానం ఎగిరేందుకు మూడు రోజుల తర్వాత దొరికిన అనుమతి

    విమానం

    ఫొటో సోర్స్, Getty Images

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికారాగ్వాకు వెళ్తోన్న ఏ340 విమానం శుక్రవారం ఫ్రాన్స్‌లో దిగింది.

    మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానానికి మూడు రోజుల తర్వాత ఫ్రాన్స్ నుంచి బయలుదేరడానికి అనుమతి లభించింది. దీంతో, ఈ విమానం సోమవారం అక్కడి నుంచి బయలుదేరవచ్చు.

    అయితే, మానవ అక్రమ రవాణా లాంటిది ఏదీ జరగట్లేదని ఏ340 విమాన నిర్వాహక సంస్థ లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఖండించింది.మానవ అక్రమ రవాణాకు పాల్పడితే ఫ్రాన్స్‌లో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

    నలుగురు ఫ్రెంచ్ న్యాయమూర్తులు ఆదివారం విమానంలోని ప్రయాణికులను ఆదివారం విచారించినట్లు వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

    ఈ విమానం సోమవారం ఉదయం టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.