You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒక్కరోజులోనే 110 మంది పాలస్తీనియన్లు మృతి
ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 110 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ అధికారులు తెలిపారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్‌పేజ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ఒక్కరోజులోనే 151 మంది మృతి
ఒక్క రోజు వ్యవధిలో గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 151 మంది చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ చెప్పింది.
జబాలియా శరణార్థి శిబిరంపై వైమానిక దాడి మృతులు కూడా వీరిలో ఉన్నారని తెలిపింది.
ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 110 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం ఈ ఘటనను నేరుగా ప్రస్తావించలేదు, అయితే అది ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు ధ్రువీకరించింది.
మరోవైపు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులను కలవడానికి ఇజ్రాయెల్ చేరుకున్నారు.
ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
మనోజ్ ఝా: ‘విపక్ష ఎంపీల సస్పెన్షన్ ప్రధాని మోదీ బలహీనతను సూచిస్తోంది’
విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోదీ బలహీనతను సూచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఆయన చాలా బలహీనపడ్డారని విమర్శించారు.
సోమవారం ఒక్క రోజే రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. వీరిలో మనోజ్ ఝా ఒకరు.
ఇప్పుడు చీకటి రోజులు నడుస్తున్నాయని, ఇలాంటి సమయాల్లో నియంతలు ప్రశ్నించే పార్లమెంటు ఉండాలని కోరుకోరని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకే రోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్.. విమర్శల వెల్లువ
పార్లమెంట్: లోక్‌సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్‌లో ఒకేరోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
లోక్‌సభలో డిసెంబర్ 13న చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సోమవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు చేశారు.
భద్రతా వైఫల్యంపై హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో వ్యవహార శైలి సరిగా లేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఎంపీలపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. కాగా, ఇంతకుముందు 13 మంది ఎంపీలను కూడా లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.
రాజ్యసభలో..
భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలపడంతో చైర్మన్ 45 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.
వీరిలో 34 మంది ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా, మిగిలిన 11 మంది ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ మూడు నెలల్లోగా రిపోర్టు ఇవ్వాల్సిందిగా కోరారు. అప్పటివరకు ఈ 11 మందిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.
అయితే సస్పెన్షన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 'ప్రాథమిక హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోంది' అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
సభలో గందరగోళం కారణంగా సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.
లోక్‌సభలో 31 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 31 మందికి పైగా లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
లోక్‌సభలో డిసెంబర్ 13న చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సోమవారం ఉదయం నుంచి లోక్‌సభలో నిరసనలు చేశారు.
భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
ఇంతకుముందు 13 మంది ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ‘‘ప్రాథమిక హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోంది’’ అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
సభలో గందరగోళం కారణంగా సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.
విమానాశ్రయంలో పడవల్లా విమానాలు.. వీధుల్లో మొసలి
ఆంధ్రప్రదేశ్: రాజధానిపై అసెంబ్లీలో విపక్ష నేతగా జగన్ ఏమన్నారు, తర్వాత ఏం జరిగింది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అకౌంట్‌లోని డబ్బును ఎలా కొల్లగొడుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి....
జో బైడెన్ కాన్వాయ్‌ని ఢీకొన్న కారు
అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి తన కారుతో ఢీకొట్టాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో అధ్యక్షుడు బైడెన్,ఆయన భార్య జిల్ బైడెన్ ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొని తిరిగి తమ కాన్వాయ్‌ని సమీపిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
అయితే ఈ సంఘటనలో బైడెన్ దంపతులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని, వారిని సురక్షితంగా తరలించినట్టు అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
కాన్వాయ్ ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్ కు రక్షణగా ఉన్న ఎస్వీయూ వాహనాన్ని సిల్వర్ కలర్ సెడాన్ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో పెద్ద శబ్దం రాగా, బైడెన్ అటువైపు చూశారు.
వెంటనే అమెరికా సీక్రెట్ సర్వీసు బృందాలు కారును చుట్టుముట్టగా డ్రైవర్ లొంగిపోతున్నట్టుగా రెండు చేతులు పైకెత్తినట్టు బైడెన్‌తో ప్రయాణిస్తున్న రిపోర్టర్ల బృందం తెలిపిందని సీఎన్ఎన్ పేర్కొంది.
ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందేనని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ నిర్థరించినట్టు ‘సీఎన్ఎన్’ తెలిపింది.
విల్మింగ్టన్‌లో భారీ వర్షం పడుతున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకుందని, ఇది ఉద్దేశపూర్వంగా చేసింది కాదని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి స్టీవ్ కోపెక్ ‘సీఎన్ఎన్’కు తెలిపారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు: జింద్‌లోని నీలమ్ ఇంట్లో పోలీసుల సోదాలు
పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించిన కేసులో నిందితుల్లో ఒకరైన నీలమ్ ఆజాద్ నివాసంలో దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
‘‘హరియాణా రాష్ట్రం జింద్‌లో ఉన్న ఆమె నివాసానికి వెళ్లిన పోలీసులు కుటుంబీకులను విచారించారు.
నీలమ్ మీద ఐపీసీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మహిళా పోలీసు, ఎస్‌హెచ్‌వో బల్వాన్ సింగ్ సమక్షంలో నీలమ్ తల్లిని విచారించడంతో పాటు నీలమ్ గదిలో సోదాలు నిర్వహించినట్లు’’ ఏఎన్‌ఐ పేర్కొంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.