You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

SA vs IND: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో భారత్ విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టుపై అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చూపించింది

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు,

    బీబీసీ తెలుగు లైవ్‌పేజ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

  2. తెలంగాణ: 11 మంది ఐఏఎస్‌లు, తొమ్మిది మంది ఐపీఎస్‌లు బదిలీ

    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పదకొండు మంది ఐఏఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది.

    ఆదివారం ఈ బదిలీలకు సంబంధించిన జీవోలను విడుదల చేసింది.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

    గతంలో 54 కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    ఎవరెవరు ఏయే శాఖలకు బదిలీ అయ్యారు?

    • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అర్వింద్‌ కుమార్‌‌ను విపత్తు నిర్వహణశాఖకు బదిలీ చేశారు.
    • విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బి.వెంకటేశంను నియమించారు. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
    • ఎ.వాణి ప్రసాద్‌ అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
    • ఎం.దాన కిశోర్‌ను పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడంతోపాటు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
    • కేఎస్ శ్రీనివాసరాజు ఆర్‌&బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
    • రాహుల్ బొజ్జాను జీఏడీ కార్యదర్శి నియమించారు. దీనితోపాటు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
    • వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న క్రిస్టినా జెడ్. చోంగ్తూను వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమించారు.
    • సి.సుదర్శన్ రెడ్డిని జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డిగా నియమించారు.
    • వాకాటి అరుణను మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు.
    • వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి నియమితులయ్యారు.
    • ఆర్‌.వి.కర్ణన్‌‌ బదిలీపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించారు.

    బదిలీ అయిన ఐపీఎస్‌లు

    • హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విశ్వప్రసాద్‌‌ను నియమించారు.
    • ఎ.వి.రంగనాథ్‌ను సిట్‌, క్రైమ్‌ జాయింట్‌ సీపీగా నియమించారు.
    • హైదరాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌‌ నియమితులయ్యారు.
    • జోయల్ డేవిస్‌ను స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా నియమించారు.
    • హైదరాబాద్‌ సిటీ నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమితులయ్యారు.
    • హైదరాబాద్ సిటీ డీసీపీగా ఎన్‌.శ్వేతను నియమించారు.
    • ఎల్. సుబ్బారాయుడు హైదరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా నియమితులయ్యారు.
    • నితికా పంత్‌‌, గజరావ్‌ భూపాల్‌, చందనా దీప్తిలను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.
  3. 'డెవిల్ ట్రీస్': విశాఖలో ఈ 'ఏడాకుల చెట్ల'ను చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?

  4. ఈ పుట్టగొడుగులు ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయా? పరిశోధకులు ఏమంటున్నారు

  5. ఐవీఎఫ్‌కు వయో పరిమితి ఉందా? 50 ఏళ్లు దాటాక ఈ విధానంలో పిల్లలను కంటే ఏమవుతుంది?

  6. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై అత్యాచార కేసు

    పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై అత్యాచార కేసు నమోదు చేశారు ముంబయి పోలీసులు.

    ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది.

    30 ఏళ్ల యువతిపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎండీ, ఛైర్మన్ సజ్జన్ జిందాల్ అత్యాచారానికి పాల్పడారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

    డిసెంబర్‌ 13న ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 354, 506 ల కింద కేసు నమోదు చేశారు బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్) పోలీసులు.

    ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

    ఫిర్యాదు చేసిన బాధితురాలు జిందాల్‌ను తొలిసారిగా అక్టోబర్ 2021లో దుబయిలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కలిసింది.

    యువతి సోదరుడిది స్థిరాస్థి వ్యాపారం కావడంతో, జిందాల్ ఓ ప్రాపర్టీ కొనేందుకు ఆసక్తి చూపాడని, అలా ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నామని తెలిపింది.

    అదే ఏడాది డిసెంబర్‌లో ముంబయి, జైపూర్‌లలో కూడా కలుసుకున్నట్లుగా యువతి ఫిర్యాదులో రాసింది.

    జనవరిలో జిందాల్‌తో మాట్లాడేందుకు సంస్థ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్తే, జిందాల్ ఆమెను పెంట్‌హౌస్‌కు తీసుకువెళ్లారని, అక్కడ బలవంతం చేశారని ఫిర్యాదులో రాసింది.

    ఆ ఘటన తర్వాత తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా, జిందాల్ మాత్రం దూరం పెడుతూ వచ్చారని, తన నంబర్ బ్లాక్ చేశారని పేర్కొంది.

    పోలీసుల దగ్గరకు వెళ్తే, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, ఆయన బెదిరించినట్లు కూడా యువతి ఫిర్యాదులో రాసింది.

  7. గయానా: ఈ దేశంలో 40 శాతం మంది భారతీయ మూలాలున్నవారే

  8. గవదబిళ్లలు: పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలేంటి? చికిత్స ఎలా?

  9. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం.. హాఫ్ సెంచరీలు చేసిన సాయి సుదర్శన్, శ్రేయస్‌

    దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టుపై అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చూపించింది.

    దక్షిణాఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే చేధించింది. రెండు వికెట్లు కోల్పోయిన భారత్, చివరి ఐదు ఓవరల్లో 50 పరుగులు రాబట్టింది.

    తొలి మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 43 బంతుల్లో 55 పరుగులు చేశాడు సాయు సుదర్శన్. శ్రేయస్ 45 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

    ఓపెనర్‌గా బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు.

  10. భారత బౌలర్ల ధాటికి 27.3 ఓవర్లకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా

    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం మొదలైన దక్షిణాఫ్రికా, భారత్‌ల తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 27.3 పరుగులకే ఆలౌట్ అయింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు. ఒపెనర్‌గా బరిలోకి దిగిన రీజా హెండ్రిక్స్ డకౌట్ అయ్యాడు.

    తరువాత క్రీజులోకి వచ్చినవారెవరూ భారత బౌలర్లు అర్ష్‌దీప్, అవేశ్‌ఖాన్‌ల ధాటికి నిలదొక్కుకోలేకపోయారు.

    ఓ దశలో 13 ఓవర్లకే ఏడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా జట్టు.

    మొత్తంగా ఆలౌట్ అయ్యే సమయానికి 116 పరుగులు చేసింది. బ్యాటర్లలో ఫెలుక్వాయో 33 పరుగులు, టోనీ డి జోర్జి 28 పరుగులు మినహా, మిగిలిన వారు అంతగా రాణించలేకపోయారు.

    బౌలింగ్‌తో విజృంభించిన అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

  11. వన్డే సిరీస్: భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. 19.2 ఓవర్లకు 77/8

    దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య మొదలైన వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే సౌత్ ఆఫ్రికా జట్టు బోల్తాపడింది.

    ఆదివారం మధ్యాహ్నం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టును తొలి నుంచే కట్టడిచేసింది భారత్.

    భారత బౌలర్లు అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్‌లు తమదైన బౌలింగ్‌తో చెరోనాలుగు వికెట్లు తీశారు.

    ప్రస్తుతం 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా జట్టు.

    బ్యాటర్లలో టోనీ జోర్జి మాత్రమే అత్యధిక పరుగులు(28) సాధించాడు.

  12. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై తొలిసారి స్పందించిన ప్రధాని

    పార్లమెంట్‌లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ స్పందించినట్లు దైనిక్ జాగరణ్ పత్రిక తెలిపింది.

    ఈ మేరకు ఆయనతో నిర్వహించిన ముఖాముఖిలో, మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతోపాటుగా, పలు అంశాలపై ఆయన స్పందనతో కూడిన కథనం ప్రచురించింది.

    ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై ప్రధానిని అడగగా, ఆయన స్పందిస్తూ,

    “పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. ఇలాంటివ జరిగిన ఘటనలను తక్కువగా చూడకూడదు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు స్పీకర్.

    దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేయడం ఆపాలి” అన్నారు.

  13. లిబియా సమీపంలో మునిగిన బోటు , 61 మంది వలసదారుల గల్లంతు

    లిబియా తీర ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో పడవలోని 60 మందికి పైగా వలసదారులు నీటిలో మునిగిపోయారని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) తెలిపింది.

    లిబియా తీర ప్రాంతం జువారా నుంచి 86 మందితో ఈ బోటు బయలుదేరిందని యూఎన్ ఏజెన్సీ తెలిపింది. నీటిలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో అది ప్రమాదానికి గురయిందని, పిల్లలతో పాటు 61 మంది వలసదారులు కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. గల్లంతయిన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

    మధ్యధరా సముద్రాన్ని దాటుకుంటూ ఆఫ్రికా నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు వలసదారులు వెళ్లే ప్రధాన నౌకాశ్రయంలో లిబియా ఒకటి.

    ఈ ఏడాదే 2,200 మందికి పైగా వలసదారులు నీటిలో గల్లంతైనట్లు ఐఓఎం అంచనావేస్తోంది.

    ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఇది ఒకటిగా ఉంది. ఈ ప్రమాదంలో చాలా మంది బాధితులు నైజీరియా, గాంబియా, ఇతర ఆఫ్రికా దేశాలకు చెందిన వారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.

    ఈ ప్రమాదం నుంచి బయటపడిన 25 మందిని లిబియా డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. వారికి వైద్య సేవలను అందిస్తున్నారు.

  14. మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?

  15. జాతులను కుదిపిన ప్రేమకథ: ‘మా అమ్మానాన్నల జాత్యంతర వివాహాన్ని అంతర్జాతీయ స్కాండల్ అన్నారు’

  16. వన్డే సిరీస్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జొహెన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌతాఫ్రికా తొలి మ్యాచ్

    మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు జొహెన్నెస్‌బర్గ్ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్‌ను ఆడనున్నాయి.

    మ్యాచ్‌కు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని, వికెట్ కీపింగ్ కూడా చేస్తానని చెప్పారు.

    ప్రస్తుతం తన దృష్టంతా వన్డే సిరీస్‌లపైనే ఉందని, మిగిలిన ఫార్మాట్ల గురించి తెలియదని అన్నారు. కానీ, దీని తర్వాత టెస్ట్ మ్యాచ్‌లలో కూడా ఈ బాధ్యతను చేపట్టాల్సి వస్తే సంతోషంగా చేస్తానని అన్నారు.

    టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్, కెప్టెన్ ఏం చెప్పినా దాన్ని సంతోషంగా చేస్తానని అన్నారు.

    గాయం వల్ల కేఎల్ రాహుల్ ఈ ఏడాది చాలా వరకు మ్యాచ్‌లలో పాల్గొనలేకపోయారు.

    ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జొహెన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో భారత్ తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది.

    ఆ తర్వాత డిసెంబర్ 19న రెండో వన్డే మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్‌లో, చివరి వన్డేను డిసెంబర్ 21న పార్ల్‌లో ఆడనుంది.

    దీని తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పైక్లిక్ చేయండి.