రేవంత్ Vs కేటీఆర్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలే, తప్పులేనని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున లెక్కలు చెబుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీరుతో పాటు కరెంట్‌కు అసలు దిక్కేలేదన్నారు.

లైవ్ కవరేజీ

  1. ముంబయి ఇండియన్స్: ఒక్క నిర్ణయంతో లక్షల ఫాలోవర్లను కోల్పోయిన జట్టు

  2. మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ.. ప్రియురాలి ఇన్‌స్టాగ్రాం పోస్టు వైరల్

  3. శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను

  4. నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?

  5. దిల్లీ: ఒమన్ సుల్తాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. పలు అంశాలపై చర్చ

    ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్

    ఫొటో సోర్స్, ANI

    భారత పర్యటనలో ఉన్న ఒమన్‌ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్‌తో ప్రధాని మోదీ భేటి అయ్యారు.

    శనివారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, వాణిజ్యం, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.

    ఈ మేరకు భేటీ అనంతరం ఆయన ట్విటర్ వేదికగా భేటీలో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాల గురించి తెలియజేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగా పరస్పర సహకారం, వాణిజ్యం,పెట్టుబడులు వంటి అంశాలపై ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్‌లు చర్చించారు. ఈ చర్చలు దైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించే దిశగా జరిగాయి. గత 26 ఏళ్లలో ఒమన్ నుంచి సుల్తాన్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి" అని తెలిపారు.

  6. అరేబియా సముద్రంలో మాల్టా నౌక హైజాక్.. రక్షించడానికి వెళ్లిన ఇండియన్ నేవీ

    అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన వాణిజ్య నౌక

    ఫొటో సోర్స్, Indian Navy

    అరేబియా సముద్రంలో మాల్టాకు చెందిన వాణిజ్య నౌక హైజాక్ గురైంది.

    నౌకను కాపాడేందుకు భారత నౌకాదళం సాయం చేస్తున్నట్లు భారతనౌకదళం ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపింది.

    "మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ వాణిజ్యనౌకలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారన్న మే డే సందేశాలు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌కు చేరాయి. భారతనౌకాదళం వెంటనే స్పందించి, ఇండియన్ నేవల్ మారిటైం పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, యాంటి పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకలను అటువైపు డైవర్ట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    డిసెంబర్ 15వ తేదీ ఉదయం ఎంవీ రుయెన్ నౌకను సమీక్షిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఆ నౌక సోమాలియా తీరం వైపు వెళ్తున్నట్లుగా గుర్తించింది.

    16వ తేదీ ఉదయం నాటికి ఎంవీ రుయెన్ నౌకను యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌక అడ్డగించింది. ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది" అని ట్వీట్ చేసింది.

  7. రేవంత్ Vs కేటీఆర్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

    కేటీఆర్

    ఫొటో సోర్స్, Twitter/BRS Party

    తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వాడివేడిగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ల మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి.

    పదేళ్లు విధ్వంసమంటే.. మరి 50 ఏళ్ల గురించి చెప్పాలా వద్దా?: కేటీఆర్

    గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలే, తప్పులేనని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున లెక్కలు చెబుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీరుతో పాటు కరెంట్‌కు అసలు దిక్కేలేదన్నారు.

    పదేళ్లు విధ్వంసం జరిగిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, మరి 50 ఏళ్ల గురించి చెప్పాలా వద్దా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ముందు పాలనలో దురాగతాలను బయటపెడతామని అన్నారు.

    అప్పుల రాష్ట్రంగా మార్చారు..: భట్టి విక్రమార్క

    నిర్మాణాత్మకంగా సూచనలు దేనినైనా తాము తీసుకుంటామని, అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మొదలుపెట్టడమే దాడి చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు.

    మిగులు రాష్ట్రంగా ఇస్తే.. పదేళ్లు పాలనలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు.

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, Telangana CMO

    విజన్ డాక్యుమెంట్ మీ ముందు పెడతాం.. సలహాలు ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

    యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అవకాశమిచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

    గత పాలనలో ఎంపీగా కేసీఆర్‌ను గెలిపించిందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తుకుచేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి పోరాటం చేసింది కాంగ్రెస్ నేతలేనని అన్నారు. సభ్యుల సంఖ్య అంత ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని చెప్పారు.

    పాలక పక్షంగా తమ విజన్ డాక్యుమెంట్‌ను మీ ముందు పెడుతున్నామని, ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

    ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉందని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

  8. మాస్టర్‌మైండ్ లలిత్ ఝా: పిల్లలకు పాఠాలు చెప్పే ఈయన పార్లమెంట్‌‌లో అలజడికి ఎందుకు ప్రయత్నించారు?

  9. సుడిగాలికి ఎగిరిపోయి, చెట్టు మీద సజీవంగా దొరికిన నాలుగు నెలల చిన్నారి

  10. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ఇంట్లో దొరికిన రూ.300 కోట్లు ఎవరివి? ఆయన ఏం చెప్పారు?

    ధీరజ్ సాహూ

    ఫొటో సోర్స్, DHIRAJSAHU.IN

    ఆదాయపు పన్ను దాడులలో బయటపడ్డ రూ.300 కోట్లకు పైగా నగదుపై జార్ఖండ్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ కుమార్ సాహూ తొలిసారి స్పందించారు.

    30 నుంచి 35 ఏళ్లుగా తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాని, తన రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని అనుకున్నానని చెప్పారు. కానీ, తొలిసారి తన మీద ఆరోపణలు వచ్చాయని, బలవంతంగా తన కుటుంబానికి చెందిన సమాచారాన్ని పంచుకోవాల్సి వస్తుందన్నారు.

    ‘‘ఆదాయపు పన్ను స్వాధీనం చేసుకున్న నగదు మా కుటుంబ కంపెనీలకు చెందినదేనని అంగీకరిస్తున్నాను. ఈ నగదు మద్యం కంపెనీలకు చెందినది. మద్యం అమ్మడం ద్వారా సంపాదించిన ఆదాయమిది. మద్యం వ్యాపారాలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతాయి. కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు ఈ డబ్బుతో సంబంధం లేదు. అయితే, ఈ నగదంతా నాది కాదు. ఇది నా కుటుంబానిది, ఇతర సంస్థలది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ప్రతి సమాచారం వారికి అందిస్తాను’’ అని ధీరజ్ సాహూ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ధీరజ్ సాహూ ఎఫ్‌బీ

    ఫొటో సోర్స్, DHIRAJ PRASAD SAHU @FB

    ధీరజ్ సాహూ ఎవరు?

    రాజ్యసభ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. ధీరజ్ సాహూ రాంచిలో 1955లో నవంబర్ 23న పుట్టారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. మూడోసారి 2018 మే నెలలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. తనది వ్యాపార కుటుంబమని ధీరజ్ సాహూ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తన కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. 1977లో ధీరజ్ సాహూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

    రాజ్యసభకు ఎంపీగా ఎన్నికలయ్యేటప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో ధీరజ్ సాహూ తన ఆస్తులను రూ.34.83 కోట్లుగా ప్రకటించారు. అలాగే రూ.2.04 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అఫిడవిట్ ప్రకారం ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్క్లిక్ చేయండి..