బీబీసీ తెలుగు లైవ్‌పేజ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గన్ మెన్ నరేశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో మొదట భార్య చైతన్య, పిల్లలు రేవంత్, హిమశ్రీలను కాల్చి ఆ తర్వాత తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
బీబీసీ తెలుగు లైవ్‌పేజ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, UGC
గన్‌మన్ నరేశ్ కుటుంబం బలవన్మరణం వివరాలను సిద్ధిపేట సీపీ శ్వేత వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 11:15 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె చెప్పారు.
2013 బ్యాచ్‌కు చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తోకుటుంబ సభ్యులను కాల్చితాను కాల్చుకొని మరణించారని ఆమె తెలిపారు.
నరేశ్‌కు కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసిందని, ఆన్ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఆమె వెల్లడించారు.
నరేశ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్లు ఆమె చెప్పారు.

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై అన్నారు.
అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
‘‘తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుత గాలిని పీల్చుకుంటున్నారు.
తాము ఎలాంటి నిర్బంధ పాలనను సహించబోమని ఈ తీర్పుతో ప్రజలు చాటి చెప్పారు.
పౌర హక్కులకు ప్రజాస్వామ్య పాలనకు ఇది నాంది.
పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగిపోయాయి.
అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయి.
ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, UGC
సిద్దిపేట కలెక్టర్ గన్‌మన్ నరేశ్ కుటుంబం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
గన్ మెన్ నరేశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో మొదట భార్య చైతన్య, పిల్లలు రేవంత్, హిమశ్రీలను కాల్చి ఆ తర్వాత తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఉదయం 11:20 గంటల సమయంలో సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రాముని పట్లలో జరిగింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కలెక్టర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న నరేశ్, తన విధులు ముగించుకుని 9 ఎంఎం పిస్టల్‌తో ఇంటికి చేరుకున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో భారీ మొత్తంలో నష్టపోయిఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫొటో సోర్స్, UGC

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
తర్వాత నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు.
కేసీఆర్‌కు వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
యశోద ఆసుపత్రిలో ఆయనకు ఎడమ తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది.
డిసెంబర్ 7వ తేదీన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌లో జారిపడటంతో ఆయన ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది.
వెంటనే ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్చారు. 8వ తేదీని తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.