ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్
ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయ సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్

ఫొటో సోర్స్, Sansad TV
పార్లమెంట్‌లో ఎంపీల వ్యవహారశైలిని తప్పుబడుతూ 15 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
డిసెంబర్ 13న పార్లమెంటు గ్యాలరీలో నుంచి ఆగంతకులు సభలోకి దూకిన ఘటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించాలని ఈ ఎంపీలు పట్టుబట్టారు.
వీరిలో 14 మంది లోక్‌సభ ఎంపీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రతిపక్ష ఎంపీలైన బెన్నీ బెహనాన్ (కాంగ్రెస్), వీకే శ్రీకందన్ (కాంగ్రెస్), మహమ్మద్ జావేద్ (కాంగ్రెస్), పీఆర్ నటజరాజన్ (సీపీఎం), కనిమొళి కరుణానిధి (డీఎంకే), కె.సుబ్రమణియం (సీపీఐ), ఎస్.ఆర్.పార్థీబన్ (డీఎంకే), ఎస్. వెంకటేశన్ (సీపీఎం), మాణిక్కం ఠాగూర్ (కాంగ్రెస్)ను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.
అంతకుముందే ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
భద్రతా వైఫల్యం అనంతరం తీసుకున్న చర్యలను మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం సభకు వివరిస్తుండగా, దీనిపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
దీంతో కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్యహరిదాస్, డీన్ కురియాకోస్‌ను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, Getty Images
పది వేల క్రీమీ డోనట్స్‌తో ఉన్న డెలివరీ వ్యాన్‌ను దొంగిలించారంటూ ఓ మహిళపై ఆస్ట్రేలియాలో కేసు నమోదైంది.
నవంబరు 29వ తేదీ తెల్లవారుఝామున సిడ్నీశివార్లలోని పెట్రోల్ బంకు నుంచి ఈ వ్యాన్ కనిపించకుండా పోయింది.
వారం రోజుల తరువాత పోలీసులు ఈ వ్యాన్‌ను ఓ కారు పార్కింగ్ ప్రదేశంలో కనుగొన్నారు. అప్పటికే ఆ వ్యాన్‌లో ఉన్న డోనట్స్ అన్నీ చెడిపోయాయి.
ఈ కేసులో డిసెంబరు 14న పోలీసులు 28 ఏళ్ళ మహిళను అరెస్ట్ చేశారు.
ఈమెపై వ్యాన్‌ను దొంగిలించిన అభియోగంతోపాటు డ్రైవింగ్‌కు అర్హత లేదనే కేసును కూడా నమోదు చేశారు.
ఈ మహిళ వ్యాన్‌ను దొంగిలించడానికి ముందు పెట్రోల్ బంకు వద్ద తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో తచ్చాడటం, ఆ తరువాత వ్యాన్‌లోకి ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం సీసీటీవీల్లో రికార్డయింది.
ఈ వ్యాన్‌లో 10 వేల డోనట్స్ ఉన్నాయనే సంగతి ఆమెకు తెలుసా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, YouTube/TDP official
జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యాక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తొలిసారిగా గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
మిగ్‌జాం తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంట నష్టమెంతో ప్రభుత్వం ప్రకటించాలని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిందని, అందువల్లే పంటపొలాలకు, సముద్రానికి తేడాలేని పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. మిగ్‌జాం తుపాను కారణంగా 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీట మునిగిందన్నారు.
మురుగుకాల్వలను సక్రమంగా నిర్వహించని కారణంగా పొల్లాల్లోకి చేరిన వర్షపునీరు బయటకు పోయే దారిలేక చేతికి వచ్చిన పంట నీటమునిగిందని ఆయన చెప్పారు.
‘‘పంటనష్టం ఎంత జరిగింది? ప్రభుత్వం ఎంత సాయం ప్రకటించనుంది? ఏయే పంటలకు ఎంతెంత పరిహారం ఇవ్వనున్నారు? అనే విషయాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. సీఎం జగన్ తుపాను నష్టపరిహారం విషయంలో మాకు సమాధానం చెప్పకపోయినా ప్రజలకైనా చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదాస్పద స్థలాన్ని కోర్టు నియమించిన కమిషన్ ఆధ్వర్యంలో సర్వే చేయాలని కోరుతూ హిందూ పక్షం దాఖలు చేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్ట్ అనుమతించింది.
‘అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలో సర్వేకు అనుమతించారు’ అని ఈ కేసు వ్యవహారాలు చూస్తున్న న్యాయవాదులలో ఒకరైన విష్ణు శంకర్ జైన్ ‘బీబీసీ’తో చెప్పారు.
‘తదుపరి విచారణ డిసెంబర్ 18న ఉంటుంది. సర్వే ఎలా చేయాలి? ఎవరు చేయాలి? సర్వే అనంతరం నివేదిక ఎప్పటికి ఇవ్వాల్సి ఉంటుంది వంటివన్నీ కోర్టు ఆ రోజు నిర్ణయిస్తుంది’ అని విష్ణు శంకర్ జైన్ చెప్పారు.
షాహీ ఈద్గా మసీదు హిందువులకు చెందినదే అంటూ దాఖలు చేసిన వేర్వేరు కేసులు అలహాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మ భూమిలోనే షాహీ ఈద్గా మసీదును నిర్మించారంటూ ఆ కేసులలో పిటిషనర్లు క్లెయిమ్ చేశారు.
మసీదులో హిందూ మత చిహ్నాలు అనేకం స్పష్టంగా కనిపిస్తాయని, హిందూ మతానికి సంబంధించిన స్థలంలో మసీదు నిర్మించారనడానికి అదే నిదర్శనమని పిటిషనర్లు పేర్కొన్నారు.
దీంతో కోర్టు నియమించిన కమిషన్ వాస్తవాధారాలను సేకరించాల్సి ఉంది, ఆ వాస్తవాల ఆధారంగా కోర్టు ఈ వివాదంపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది.
సర్వేకు కోర్టు ఇచ్చిన అనుమతికి సంబంధించి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.
కాగా, గత ఏడాది వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కేసులోనూ కోర్టు సర్వేకు అనుమతిస్తూ ఇలాంటి ఆదేశాలనే ఇచ్చింది.
అక్కడ సర్వే అనంతరం ఇచ్చిన నివేదికలో.. జ్ఞాన్‌వాపి మసీదు వాజూఖానాలో శివలింగాన్ని పోలిన స్తూపాకారం ఒకటి ఉన్నట్లు తేల్చారు. దాంతో ఆ నివేదిక ఆధారంగా కోర్టు అక్కడి వివాదాస్పద ప్రాంతాన్ని సీల్ చేసింది.

ఫొటో సోర్స్, AP CMO
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు, కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు పలాసలో 85 కోట్లతో కిడ్నీ రీసర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ యూనిట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు.
ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయ సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
ఈ ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులందిస్తారు, అలాగే విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు వైద్య సేవలు అందుతాయి.
ఇప్పటివరకు కిడ్నీ వ్యాధిగ్రస్థులు వివిధ ఆసుపత్రుల్లో చేయించుకునే వైద్య పరీక్షలు అన్నీ ఇకపై ఈ ఆసుపత్రిలోనే చేయించుకోవచ్చు. ఏ పరీక్ష ఫలితాలైనా నిముషాల వ్యవధిలోనే అందించే అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు.
మరోవైపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉద్దానంలో నిర్మించిన వైఎస్సార్ సుజలధార రక్షిత మంచి నీటి పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 మండలాల్లోని 807 గ్రామాలు, 6.78 లక్షల మందికి రక్షిత మంచి నీరు అందనుంది.

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో సోర్స్, AP CMO

ఫొటో సోర్స్, విశాఖ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని రెండవ అంతస్తు ఆపరేషన్ థియేటర్లో మంటలు వచ్చాయి. దాంతో ఒకసారిగా కలకలం రేగింది.

రెండో అంతస్తులో చెలరేగిన మంటలతో మిగిలిన అంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదం జరిగిన రెండవ అంతస్తు నుంచి పేషంట్లను కిందకు తరలించేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఆసుపత్రి అద్దాలను పగులకొట్టి నిచ్చెనల సహాయంతో వారిని కిందకి దించారు.

ఆస్పత్రిలోని సుమారు 55 మంది రోగులను అంబులెన్సులలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. అగ్నిప్రమాదం కారణంగా ఇండస్ ఆస్పత్రి అంతాలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Telangana Assembly
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నేత కె.తారకరామారావు సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రసాద్ కుమార్‌ను అభినందించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్ ఆయనను స్వయంగా స్పీకర్ స్థానం దగ్గరకు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.
‘‘శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలి. వికారాబాద్ మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతం.. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గా ఎన్నికవడం సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారదోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అంతకు ముందు ప్రమాణ స్వీకారం చేయని కొందరు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్‌పై తమ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని, ప్రపంచమంతా ఒత్తిడి చేసినా తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో నెతన్యాహూ ఈ విషయాన్ని తెలిపారు.
“మేము ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తాం. అందులో ఎలాంటి సందేహాలు లేవు. మా సైనికులను కోల్పోయిన బాధతో పాటు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నేను ఇదే మాటను పునరుద్ఘాటిస్తున్నాను. మమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు. చివరి వరకు మేం పోరాడి గెలుస్తాం’’ అని అన్నారాయన.
అంతకుముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచం ఒత్తిడి ఉన్నా, లేకున్నా మా పోరాటం కొనసాగుతుంది’’ అన్నారు.
గాజాపై విచక్షణారహితంగా బాంబు దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్ ప్రపంచం మద్దతును కోల్పోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
బుధవారం లోక్‌సభ భద్రతలో భారీ భద్రతా లోపానికి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాళ్ సింగ్ అధ్యక్షతన హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.
హోంశాఖ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు కమిటీ పార్లమెంటు భద్రతలో లోపాలను, దాని కారణాలను గుర్తించి, దానిని మెరుగుపరచడానికి త్వరలో మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పిస్తుంది.
అంతకుముందు, లోక్‌సభ భద్రతా లోపంపై సభకు వచ్చి ప్రకటన ఇవ్వాలని హోంమంత్రి అమిత్ షాను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ లోపలే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర భద్రతా లోపమేనని ప్రతిపక్షం పేర్కొంది.
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా బుధవారం భోపాల్‌కు వచ్చారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ దాడికి ఆరుగురు వ్యక్తులు వ్యూహం రచించారని, వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు.
మరోవైపు పార్లమెంటు భద్రతా లోపం వ్యవహారంలో ఏడుగురు అధికారులను లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.