రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.. గుడ్ నైట్
బీబీసీ ఇండియా ఆపరేషన్లలో మార్పులు.. ప్రకటించిన సంస్థ
ఆంధ్రప్రదేశ్: ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ అంగన్‌వాడీల సమ్మె.. ప్రభుత్వం ఏమంటోంది?
పాకిస్తాన్‌లో ప్రత్యేక ఆపరేషన్లు: 23 మంది సైనికులు, 27 మంది ఉగ్రవాదులు మృతి

ఫొటో సోర్స్, RESCUE 1122
పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో డిసెంబర్ 11, 12వ తేదీల్లో నిర్వహించిన రెండు ప్రత్యేక ఆపరేషన్లలో 27 మంది ఉగ్రవాదులు మృతిచెందారని పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ఐఎస్‌పీఆర్) ప్రకటించింది.
ఉగ్రవాదుల దాడిలో 23 మంది సైనికులు కూడా మృతిచెందారని ఐఎస్‌పీఆర్ తెలిపింది.
టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డిసెంబర్ 11వ తేదీ రాత్రి దరజిందాలో సైన్యం ఆపరేషన్ చేపట్టింది. అనంతరం అక్కడి 17 మంది ఉగ్రవాదులను చంపేసింది.
కులాచిలో మరో ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ నలుగురు ఉగ్రవాదులను చంపేశారు. అయితే, ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారు.
తెల్లవారుజామున ఉగ్రవాదుల దాడి
2023 డిసెంబర్ 12 తెల్లవారుజామున దరాబంద్‌లోని భద్రతా దళాల పోస్ట్‌పై ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేశారు.
పోస్ట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా, సైన్యం అడ్డుకుంది, దీంతో పేలుడు పదార్థంగల వాహనంతో ఉగ్రవాదులు పోస్ట్‌లోకి దూసుకెళ్లారు, అనంతరం ఆత్మాహుతి దాడి జరిపారు.
ఈ పేలుడు కారణంగా పోస్టులోని భవనం కూలిపోయింది. ఈ దాడిలో 23 మంది సైనికులు మృతిచెందారు. ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం చంపేసింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ

ఫొటో సోర్స్, FB/BHAJANLAL SHARMA
ఫొటో క్యాప్షన్, భజన్‌లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆయన ఎమ్మెల్యే కావడం ఇదే తొలిసారి.
బీజేపీ రాజస్థాన్ శాఖలో ఆయన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భరత్‌పూర్‌కు చెందిన భజన్‌లాల్ శర్మ, కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాకు సన్నిహితుడని చెబుతారు.
దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వా రాజస్థాన్ ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలు ఉన్నాయి. 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ 115 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 69 స్థానాలకు పరిమితమైంది.
డిసెంబరు 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో గెలవగా, మూడు చోట్లా కొత్త వారిని ముఖ్యమంత్రులను చేసింది.
మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణు దేవ్ సాయ్ సీఎంలు అయ్యారు.
రాజస్థాన్ సీఎం ఎవరు? ఇవాళే తేల్చనున్న బీజేపీ అధిష్టానం

ఫొటో సోర్స్, ANI
రాజస్థాన్‌కు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై కొనసాగుతోన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడనుంది. రాజస్థాన్ బీజేపీ లెజిస్టేటివ్ పార్టీ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశం అనంతరం కొత్త సీఎం ఎవరన్నది ప్రకటిస్తారని భావిస్తున్నారు.
పార్టీ సెంట్రల్ అబ్జర్వర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో ఇద్దరు అబ్జర్వర్లు సరోజ్ పాండే, వినోద్ తవడే నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుందని వార్తా సంస్థ పీటీఐకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ తెలిపారు.
కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా కచ్చితంగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత మోహన్ యాదవ్ పేరును ప్రకటించి ఆశ్చర్యపరిచింది బీజేపీ.
మధ్యప్రదేశ్ పదవి రేసులో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తలకిందులు చేస్తూ.. మోహన్ యాదవ్ పేరును ప్రకటించారు. ఇదే విధంగా రాజస్థాన్‌లో కూడా బీజేపీ ఆశ్చర్యకరమైన ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.
కశ్మీర్ ఆపిల్‌కు వచ్చిన కష్టాలేంటి?
అంజనీ కుమార్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేత

ఫొటో సోర్స్, @Anjanikumar_IPS
ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని, మరోసారి ఇలాంటిది జరగకుండా చూసుకుంటానని అంజనీ కుమార్ ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న సమయంలోనే టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అంజనీ కుమార్‌పై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
గుడ్ మార్నింగ్