'ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే' - ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
ఆర్టికల్ 370 అన్నది కశ్మీర్‌లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేననే వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ అధికరణంలోని అంశాలు కూడా అది తాత్కాలిక నిబంధన అనే సూచిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

ఫొటో సోర్స్, BRS
తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు.
సోమవారం హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను ఆయన పలకరించారు. వైద్యులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఫొటో సోర్స్, BRS
‘‘కేసీఆర్‌తో మాట్లాడాలని అనిపించి వచ్చాను. ఆయన కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజాసేవకు రావాలి. త్వరలోనే ఆయన మామూలుగా నడుస్తారు’’ అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, BRS
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్

ఫొటో సోర్స్, మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్ పేరు ఖరారైందని వార్తాసంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐ తెలిపాయి.
శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌లో మోహన్ యాదవ్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 163 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న వెలువడగా, వారానికి పైగా సాగిన చర్చల అనంతరం సీఎం పదవికి మోహన్ యాదవ్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమ్ నారాయణ్ యాదవ్‌పై ఆయన 12,914 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మోహన్ యాదవ్ ఎమ్మెల్యే కావడం ఇది మూడోసారి. ఆయన తొలిసారిగా 2013లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, X
ఫొటో క్యాప్షన్, మోహన్ యాదవ్‌కు అభినందనలు తెలిపిన శివరాజ్ సింగ్ చౌహాన్ పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోహన్ యాదవ్‌కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)తోనూ ఆయనకు అనుబంధం ఉంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోహన్ యాదవ్‌కు శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలిపారు.
సిమ్లా, మనాలి.. ఉత్తర భారతదేశంలో చలికాలంలో తప్పక చూడాల్సినవి ఏవేవి?
పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
జమ్మూకశ్మీర్: ‘ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే’ - సుప్రీం కోర్టు తీర్పు
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా

ఫొటో సోర్స్, AllaRamakrishnaReddy/Facebook
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపారు.
గత ఎన్నికలలో నారా లోకేష్ మీద గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.
మంగళగిరిలో ఆదివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డితో సంబంధం లేకుండానే పార్టీ కార్యాలయం ప్రారంభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అది జరిగిన కొన్ని గంటల్లోనే ఆర్కే రాజీనామా సమర్పించడం కీలక పరిణామంగా మారింది. గడిచిన కొంతకాలంగా ఆర్కే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
అధిష్టానం ఆదేశించినప్పటికీ గడపగడపకు వంటి కార్యక్రమాలను ఆయన నిర్వహించలేదు.
అదే సమయంలో గతంలో ఆయన మీద పోటీ చేసి ఓటమిపాలైన గంజి చిరంజీవికి అధికార పార్టీలో ప్రాధాన్యత పెరుగుతోంది. వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం కూడా చిరంజీవి నేతృత్వంలోనే ప్రారంభించారు.
బ్రేకింగ్ న్యూస్, 'ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే' - ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

ఫొటో సోర్స్, SUPREME COURT LIVE STREAM SCREEN GRAB
అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కూడా ఈ తీర్పు సమర్థించింది.
ఆర్టికల్ 370 అన్నది కశ్మీర్‌లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేననే వాదనను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ అధికరణంలోని అంశాలు కూడా అది తాత్కాలిక నిబంధన అనే సూచిస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
"జమ్మ-కశ్మీర్ అసెంబ్లీకి 2024 సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తున్నాం" అని సుప్రీం కోర్టు ప్రకటించింది.
కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం సవాలు చేయదగినది కాదని, అలా చేయడం వల్ల అస్థిరత, ఆందోళనలు పెరుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై వచ్చిన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పును ప్రకటిస్తూ, ఆర్టికల్ 1, ఆర్టికల్ 370ల ప్రకారం జమ్ముకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది.
అంతేకాదు, భారతదేశంలో విలీనమైన తరువాత జమ్మూకశ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలేవీ లేవని కూడా సుప్రీం కోర్టు ప్రకటించింది.
చీఫ్ జస్టిస్ డీఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈరోజు తీర్పును ప్రకటించింది.
కాంగ్రెస్ ఎంపీకి చెందిన కంపెనీలో ఐటీ దాడులు, రూ.351 కోట్ల నగదు సీజ్

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన ఒక డిస్టలరీ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో రూ.351 కోట్ల నగదును స్వాధీనం చేసిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
దర్యాప్తు సంస్థలు నిర్వహించిన ఒక సింగిల్ ఆపరేషన్‌లో స్వాధీనం చేసిన మొత్తంలో ఇదే అత్యధికం.
జార్ఖాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న ధీరజ్ సాహు కుటుంబానికి చెందినది ఈ డిస్టలరీ. దీనిపై సాహు ఇంకా స్పందించలేదు.
బౌధ్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర ప్రమోటర్లపై ఆదాయపు పన్ను శాఖ ఐదో రోజూ ఆదివారం కూడా దాడులు జరిపింది.
పన్ను ఎగవేత, పుస్తకాల్లో అధికారికంగా వెల్లడించని ఆరోపణలపై ఆదాయపు పన్న అధికారులు డిసెంబర్ 6 నుంచి ఈ దాడులు నిర్వహించింది.
నోట్ల లెక్కింపు పూర్తయిందని, మొత్తంగా రూ.351 కోట్ల నగదు స్వాధీనం చేసినట్లు పీటీఐకి సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను విభాగానికి చెందిన తొమ్మిది బృందాల్లో 80 మంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. పలు బ్యాంకులు 24 గంటల పాటు రొటేషన్ షిఫ్ట్‌లో పనిచేశాయి.
నగదును తరలించేందుకు సుమారు 200 బ్యాగులను, ట్రక్కులను ఉపయోగించినట్లు ఈ వార్తా సంస్థకి సంబంధిత వర్గాలు చెప్పాయి.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
