You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఎంపీ దగ్గర దొరికిన డబ్బుతో పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్‌

కౌంటింగ్ మెషీన్ల కొరత కారణంగా లెక్కించే పని మందకొడిగా సాగిందని, ఇప్పుడు మెషీన్ల సంఖ్యను పెంచామని, ఒకటి రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని బ్యాంక్ అధికారి చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. ఎంపీ దగ్గర దొరికిన డబ్బుతో పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్‌

    కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.200 కోట్లకు పైగా నగదు లభించడంపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది.

    ఎంపీ ఇంట్లో డబ్బుల వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.

    “ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. అదాయపు పన్ను అధికారులు అతని ఇంటి నుంచి అంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా పట్టుకున్నారో ఆయన మాత్రమే వివరించగలరు." అని ట్విటర్ లో పేర్కొన్నారు.

    ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి ధీరజ్ సాహు కార్యాలయాల నుంచి రూ.200 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

    ‘‘ మొత్తం 176 బ్యాగ్‌లలో, 40 బ్యాగ్‌లలో నింపిన నోట్ల లెక్కింపు ఇప్పటి వరకు పూర్తయింది" అని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ ఒకరు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    కౌంటింగ్ మెషీన్ల కొరత కారణంగా లెక్కించే పని మందకొడిగా సాగిందని, ఇప్పుడు మెషీన్ల సంఖ్యను పెంచామని, ఒకటి రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

  3. మహువా మొయిత్రా బహిష్కరణ: ఈ కేసును రమేశ్ బిధూరీ వ్యవహారంతో ఎందుకు ముడిపెడుతున్నారు? దానిష్ అలీ ఆరోపణలేంటి

  4. మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  5. తెలంగాణ: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

    మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు పచ్చజెండా ఊపి మహిళలు ఉచితంగా ప్రయాణించే తొలి బస్సును ప్రారంభించారు. దీంతో, ఇవాళ్టి నుంచి తెలంగాణలోని మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలలో ఇదీ ఒకటి.

    పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.

    ఈ పథకంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచారు.

    రెండు హామీలను లాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు ప్రోత్సాహక చెక్‌ను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.

  6. తెలంగాణ: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత వాయిదా పడ్డ అసెంబ్లీ

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలు తొలి రోజులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.

    ఈ నెల 14కు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

  7. కాదల్ ది కోర్: సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో గే పాత్రలో ఎందుకు నటించారు?

  8. కర్నాటక, మహారాష్ట్రలలో 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు

    జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇవాళ ఉదయం నుంచి 44 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది.

    కర్నాటకలోని ఒక ప్రాంతంలో, పూణేలో 2 ప్రాంతాల్లో, థానేలో 31 ప్రాంతాల్లో, థానే సిటీలో 9 ప్రాంతాల్లో, భయందర్‌లో ఒక ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

    ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఈ తనిఖీలు జరుపుతోంది ఎన్ఐఏ.

  9. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా... పంజాబ్‌ హైకోర్టు ఏం చెప్పింది?

  10. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇవాళ్టి నుంచి జరపాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు.

    గవర్నర్ ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుపుతోంది.

    ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

    అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

    అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు.

  11. తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికీ ఏ శాఖ?

    తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదానికి పంపిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

    మంత్రుల శాఖలు..

    ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి: మున్సిపల్ - నగరాభివృద్ధి; సాధారణ పరిపాలన, లా & ఆర్డర్, ఇతరులకు కేటాయించని మిగిలిన శాఖలన్నీ

    డిప్యూటీ సీఎం: భట్టి విక్రమార్క మల్లు: ఆర్థిక, ఇంధన శాఖ

    ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి: నీటి పారుదల, పౌర సరఫరాలు

    దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ

    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: ఆర్ అండ్ బీ , సినిమాటోగ్రఫీ

    డి. శ్రీధర్ బాబు: ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాలు

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి: రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహనిర్మాణం

    పొన్నం ప్రభాకర్: రవాణా శాఖ, బీసీ సంక్షేమం

    కొండా సురేఖ: అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ

    డి. అనసూయ సీతక్క: పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం

    తుమ్మల నాగేశ్వర రావు: వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత, టెక్స్‌టైల్

    జూపల్లి కృష్ణారావు: ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ

  12. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్

    బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

    స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.

    శాసనాసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

  13. తెలంగాణలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇవాళే.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

    తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇవాళ జరగనుంది. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

    అంతకుముందు రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ చేత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు.

    ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.