లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.
హైదరాబాద్‌లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశం జరిపి, కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎవరనేదానిపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేత ప్రకటన వాయిదా పడింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, BBC/DILIPKUMAR SHARMA
మణిపుర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణలో 13 మంది మరణించారు.
సాయిబోల్ సమీపంలోని లీతు గ్రామంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని తెంగ్నౌపాల్ జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారి బీబీసీతో తెలిపారు.
ఘటన అనంతరం పోలీసులు 13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులు లీతు ప్రాంతానికి చెందిన వారు కాదని, మరేదైనా ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు.
"కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, కాబట్టి ప్రస్తుతానికి మరింత సమాచారం ఇవ్వలేం" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, BRS
గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ధ్రువీకరణ పత్రాన్ని బీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి అందజేశారు.
బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు, ఇతర నాయకులతో సోమవారం తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, BRS

ఫొటో సోర్స్, BRS

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొలిక్కిరాలేదు.
సోమవారం హైదరాబాద్‌లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశం జరిపి, కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎవరనేదానిపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేత ప్రకటన వాయిదా పడింది.
అనంతరం మంచి వ్యూహకర్తగా పేరున్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మిగిలిన ఏఐసీసీ పరిశీలకులు అధిష్ఠానం వద్దకు వెళ్లారు. దిల్లీలో వారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు.
సమావేశం అనంతరం సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నుంచి ప్రకటన వెలువడే అవకాశముంది.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇవాళే ఉంటుందని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు.

ఫొటో సోర్స్, Antara Foto/Iggoy el Fitra/via Reuters
పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రాలో అగ్నిపర్వతం బద్దలవడంతో 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ మృతదేహాలను రెస్క్యూ బృందాలు కనుగొన్నాయి.
ఆదివారం అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినపుడు ఆ ప్రాంతంలో 75 మంది పర్వతారోహకులు ఉన్నారు. ప్రమాద సమయంలో కొందరి శరీరాలు స్వల్పంగా కాలాయి.
ఘటనలో సోమవారం ముగ్గురిని రక్షించగా, మరో 12 మంది గల్లంతయ్యారు. విస్పోటనంతో మరపీ ప్రాంతంలోని ఆకాశంలో బూడిద మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది.

ఫొటో సోర్స్, Antara Foto/Septiyadi/via Reuters

ఫొటో సోర్స్, Ysathisreddy/FB
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
వీరు సోమవారం రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.
''తెలంగాణ పునర్నిర్మాణంలో అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాం'' అని చైర్మన్లు ప్రకటించారు.
రాజీనామా చేసిన వారి వివరాలు:
1. సోమా భరత్ కుమార్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
2. జూలూరి గౌరీ శంకర్ , తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
3. పల్లె రవికుమార్ గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
5. మేడె రాజీవ్ సాగర్, టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్
7. గూడూరు ప్రవీణ్, టైక్స్‌టైల్స్ కార్పొరేషన్ చైర్మన్
8. గజ్జెల నగేష్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్
9. అనిల్ కూర్మాచలం, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
10. రామచంద్ర నాయక్, ట్రైకార్ చైర్మన్
11. వలియా నాయక్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్
12. వై.సతీష్ రెడ్డి, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్
14. రవీందర్ సింగ్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్
15. జగన్మోహన్ రావు, టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్

ఫొటో సోర్స్, Twitter/Zoramthanga
మిజోరాం ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్పీఎం) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 40 స్థానాలలో జెడ్పీఎం కూటమి 27 గెలిచింది.
అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. మరో సీటులో ముందంజలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ముఖ్యమంత్రి జోరంతంగా ఐజ్వాల్ ఈస్ట్ 1 నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అక్కడ జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం)కి చెందిన లాల్తాన్‌సంగా 2 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఫొటో సోర్స్, UGC
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో మిగ్‌జాం తుపాన్ ప్రభావం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్‌పట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నీరు నిలిచి పలు విమాన సర్వీసులను నిలిపివేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చెన్నైలోని పళ్లికరణై, వెలచ్చెరి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పలు వీధుల్లో నీరు భారీగా చేరింది. కార్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలను వార్తా సంస్థ ఏఎన్ఎఐ ట్విటర్ (ఎక్స్) వేదికగా షేర్ చేసింది.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Telanganacongress
సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సీఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీ, అజయ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేలు సీఎల్పీ నేత ఎన్నికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సీఎల్పీనేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ, సమావేశం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నిర్ణయం తర్వాత సీఎం పేరుపై ప్రకటన రానుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సమావేశం అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్ధి ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, telangana congress

ఫొటో సోర్స్, ANI
శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందినట్లు ఐఏఎఫ్ తెలిపింది.
తెలంగాణలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీకి చెందిన శిక్షణ విమానం సోమవారం ఉదయం 8:55 గంటల సమయంలో మెదక్ జిల్లా, తూప్రాన్ పరిధిలోని శివారు గ్రామంలో కూలిపోయినట్లు వెల్లడింది.
ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎంక్వైరీకి ఆదేశించినట్లుగా వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం-నెల్లూరు జిల్లాల మధ్య తీవ్ర తుపానుగా మారి, తీరం దాటనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు విస్తారంగా పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకు 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
నెల్లూరు, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
మిగ్‌జాం తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఫొటో సోర్స్, UGC
పాఠశాలలకు సెలవులు..
మిగ్‌జాం తుపాను తీవ్రత దృష్ట్యా విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
మిగ్‌జాం తుపాను ప్రబావం ఏపీపై ముఖ్యంగా నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్ తిరుపతి జిల్లాల్లో తీవ్రంగా ఉండనుంది.
మరోవైపు విశాఖ, ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఆదివారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే సమయంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది.
ఇప్పటికే తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ, ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని మొహరించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..