లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4న చేపట్టనున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది.
తెలంగాణలోని మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
మిజోరాంలో రేపు కౌంటింగ్ జరగనుంది.

ఫొటో సోర్స్, ANI
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం దిశగా సాగుతోంది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు లాంఛనమే కానుంది. ఈ లెక్కన బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 12కు పెరగనుండగా, కాంగ్రెస్ మాత్రం మూడు రాష్ట్రాలకే పరిమితం కానుంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
ప్రస్తుతం వెలువడిన ఫలితాలను అనుసరించి, బీజేపీ మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి రావడం దాదాపు లాంఛనమే కానుంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది.

ఫొటో సోర్స్, ANI
తగ్గనున్న కాంగ్రెస్ బలం
ఈ 12 రాష్ట్రాలే కాక, మహారాష్ట్ర, మేఘాలయ, నాగలాండ్, సిక్కింలలో సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా ఉంది.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతుండగా, తెలంగాణలో విజయం దిశగా సాగుతోంది.
ఇవికాక, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.
ప్రస్తుతం దేశంలో ఉన్న ఆరు జాతీయ పార్టీలు- బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, సీపీఎం, ఎన్‌పీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ.

ఫొటో సోర్స్, ANI
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు వచ్చే 14 రోజుల్లో ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని నియమ, నిబంధనలను ఉదహరిస్తూ రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి చెప్పారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది ఎంపీలకు భారతీయ జనతా పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.
వీరిలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా ఉన్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు ఎంపీల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌లో నలుగురిని, తెలంగాణలో ముగ్గురిని బరిలోకి దింపింది బీజేపీ.

ఫొటో సోర్స్, ANI
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఈ ఎంపీలు వచ్చే 14 రోజుల్లో ఈ సీట్లలో ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ నిర్దేశించిన సమయం లోపల నిర్ణయం తీసుకోలేకపోతే, వారు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కోల్పోతారని రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి చెప్పారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది, వారు పొందిన శాసనసభ సభ్యత్వంపై ఈ నిబంధన ఎలాంటి ప్రభావం చూపదు. 14 రోజుల తర్వాత ఎంపీ అభ్యర్థిత్వాన్ని కోల్పోయి, ఎమ్మెల్యేగా ఉంటారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఫలితాలు ఈ రోజు వెల్లడి అవుతుండగా.. మిజోరాం ఓట్ల లెక్కింపు రేపు చేపడతారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 199 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 115 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్‌లో ఉండగా, భారత్ ఆదివాసీ పార్టీ 3 స్థానాలు, బీఎస్పీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాలు, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు చేరుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
1:16 గంటల సమయానికి ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 9 స్థానాలు, ఎంఐఎం 4 స్థానాలు, సీపీఐ ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
12:50 గంటల సమయానికి ఎన్నికల్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 90 అసెంబ్లీ స్థానాల్లో 53 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, జీజీపీ, బీఎస్పీలు ఒక్కో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
230 అసెంబ్లీ స్థానాలకు గాను 116 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది.
12:00 గంటల సమయానికి ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 158 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, 69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, రెండు స్థానాల్లో బీఎస్పీ, ఒక స్థానంలో భారత్ ఆదివాసీ పార్టీ లీడింగ్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్‌లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, ECI
ఉదయం 11:00 గంటల వరకు ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం..
చత్తీస్‌గఢ్:90 స్థానాలకు గాను 83 స్థానాల్లో కౌంటింగ్‌పై వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో 46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సీపీఐ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌లో ఉంది.
మధ్యప్రదేశ్:బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో, బీఎస్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, ప్రహర్ జనశక్తి పార్టీలు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
రాజస్థాన్:199 స్థానాలకు గాను 198 స్థానాల్లో కౌంటింగ్ వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వీటిలో 110 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల్లో, బీఎస్పీ 3 స్థానాలు, భారత్ ఆదివాసీ పార్టీ 3 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
తెలంగాణ:అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఆధిక్యంలో వెనుకబడింది. కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ 33 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 8 స్థానాలు, సీపీఐ ఒకస్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, RevanthReddy/Twitter
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో వెనుకబడింది.
ఉదయం 10:44 గంటల సమయానికి, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. 53 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ పార్టీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
బీజేపీ ఆరు స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ
కామారెడ్డి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కత్తిపల్లి వెంకట రమణారెడ్డిలు బరిలో ఉన్నారు.
అయితే, నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి అనుముల రేవంత్ రెడ్డి ఆధిక్యం(1720 ఓట్ల మెజారిటీ)లో ఉండగా, కేసీఆర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, ECI
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
10.22 గంటల సమయానికి, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..145 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జీజీపీ రెండు స్థానాలు, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.