ఫిలిప్పీన్స్‌లో 7.6 తీవ్రతతో భూకంపం, సునామీ అలర్ట్ జారీ

శనివారం 7.6 తీవ్రతతో ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపానికి సమీపంలో భూకంపం సంభవించింది. దీంతో ఒక మీటరు ఎత్తు వరకు సునామీ కెరటాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సూచించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. కొడుకుపై కాల్పులు జరిపిన దుండగులను చీపురుతో తరిమికొట్టిన మహిళ

    వీడియో క్యాప్షన్, కొడుకుపై కాల్పులు జరుపుతున్న దుండగులను చీపురుతో తరిమేసిన తల్లి

    హరియాణాలోని భివానీలో నలుగురు సాయుధులను ఓ మహిళ చీపురుతో తరిమి కొట్టిన వీడియో వైరల్ అయింది. వారు శకుంతలా దేవి కొడుకు హరికిషన్‌ను షూట్ చేయడానికి వచ్చారు. నవంబరు 27న ఆ ఘటన జరిగింది.

    మొదట ఆ కాల్పుల శబ్దం విని.. యువకులు బాణసంచా కాలుస్తున్నారేమో, దాని వల్ల పశువులు బెదిరిపోతాయేమోనని ఆమె అనుకున్నారు. కానీ, కాస్త ముందుకు వచ్చి చూస్తే నలుగురు యువకులు తమ కుమారుడిపై కాల్పులు జరుపుతూ కనిపించారని ఆమె చెప్పారు.

    ఆ సమయంలో తనకు ఎలాంటి భయమూ అనిపించలేదని శకుంతల చెప్పారు. కాల్పులు జరిపిన వారిని తాను గుర్తుపట్టలేనని అన్నారు.

    ఆమె దుండగులను ఎలా ఎదుర్కొన్నారో ఈ వీడియో స్టోరీలో మీరూ చూడండి.

  3. ఫిలిప్పీన్స్‌లో 7.6 తీవ్రతతో భూకంపం, సునామీ అలర్ట్ జారీ

    సునామీ

    ఫొటో సోర్స్, Getty Images

    శనివారం 7.6 తీవ్రతతో ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపానికి సమీపంలో భూకంపం సంభవించింది.

    దీంతో ఒక మీటరు ఎత్తు వరకు సునామీ కెరటాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సూచించింది.

    మరోవైపు పసిఫిక్ తీర ప్రాంతాలకు జపాన్ వాతావరణ శాఖ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌కే వరల్డ్ న్యూస్ సర్వీస్ వెల్లడించింది.

    జపాన్, ఇండోనేషియా, పలావు, మలేషియా ప్రాంతాలలో కూడా ఈ భూకంప ప్రభావం కనిపించిందని డీడబ్ల్యూ న్యూస్ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. పెరూ: అమెజాన్ అడవి కోసం పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త ఇనుమా హత్య

    ఇనుమా

    ఫొటో సోర్స్, FONDO SOCIOAMBIENTAL DEL PERÚ

    ఫొటో క్యాప్షన్, క్వింటో ఇనుమా

    అమెజాన్ అడవిలో చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నపెరూవియన్ పర్యావరణ కార్యకర్త క్వింటో ఇనుమా హత్యకు గురయ్యారు.

    శాన్ మార్టిన్ ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో నవంబర్ 29న ఆయనను చంపేశారు. హత్యపై జాతీయ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    అడవిలో అక్రమంగా చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న కిచ్వా కమ్యూనిటీకి చెందిన క్వింటో ఇనుమాకు ఇదివరకే బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులను పట్టించుకోకుండా ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే మహిళా పర్యావరణ ప్రచారకుల సమావేశంలో పాల్గొని, పడవలో తిరిగి వస్తుండగా ఇనుమాపై దాడి చేశారని ఆయన కుమారుడు తెలిపారు.

    ఇనుమా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పెరూ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. క్వింటో ఇనుమాపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది.

    ఇనుమా హత్యను మిషన్ ఇన్ పెరూ ఆఫీస్ ఆఫ్ యూఎన్ హైకమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఓహెచ్‌సీహెచ్ఆర్) ఖండించింది. సత్వర విచారణ చేపట్టాలని అధికారులను కోరింది.

    2020 నుంచి ఇక్కడ దాదాపు 30 మంది పర్యావరణ కార్యకర్తలు, కమ్యూనిటీ నాయకులు హత్యకు గురయ్యారని పెరూ జాతీయ మానవ హక్కుల కేంద్రం తెలిపింది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని స్థానిక పర్యావరణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

  5. మార్లిన్ సావంత్: గేమ్ షోల గుట్టు విప్పిన ‘అత్యంత తెలివైన’ మహిళ ఈమె...

  6. వెస్ట్‌‌ బ్యాంక్: ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి వెళ్లి వచ్చిన 12 ఏళ్ల బాలుడి కథ ఇది...

  7. అమెరికాలో తీవ్ర నేరాల కింద అరెస్టైన సత్తారు వెంకటేశ్‌రెడ్డికి, వైసీపీకి సంబంధం ఏంటి, టీడీపీ ఏమంటోంది?

  8. వరల్డ్ కప్ ఫైనల్: ‘భారత్ ఓడిపోయిందని’ సంబరాలు చేసుకున్న కశ్మీరీ విద్యార్థులపై యూఏపీఏ ఎందుకు ప్రయోగించారు?

  9. కెనడాలో నిజ్జర్ హత్య గురించి అమెరికాకు ముందే అంతా తెలుసా? ఇది ప్రధాని మోదీ వద్ద బైడెన్ ప్రస్తావించారా?

  10. దక్షిణాఫ్రికా టూర్‌కు అవకాశం దక్కని అక్షర్ పటేల్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు పంపిన సందేశం ఏమిటి?

  11. నేవీ నౌక కమాండింగ్ ఆఫీసర్‌గా తొలిసారిగా మహిళ.. వెల్లడించిన నౌకాదళం చీఫ్

    నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్

    తొలిసారిగా ఒక మహిళను నౌకాదళంలోని ఒక నౌక కమాండింగ్ ఆఫీసర్‌‌గా నియమించినట్లు భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు.

    అన్ని స్థానాలు, అన్ని ర్యాంకుల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలనేది భారత నౌకాదళ అభిమతమన్నారు.

    డిసెంబర్ 4న నేవీ డే వేడుకల నేపథ్యంలో ఆయన శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    నౌకాదళంలో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా మహిళా ఫైర్ ఫైటర్లు ఉన్నారని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. మిచౌంగ్ తుపాను: రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    మిచౌంగ్ తుపాను

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

    ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 630 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 740 కి.మీ, బాపట్లకు ఆగ్నేయ దిశగా 810 కి.మీ, మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆదివారానికి తుపానుగా బలపడి, వాయవ్య దిశగా పయనించి నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో తీరం దాటేందుకు అవకాశముందని చెప్పారు.

    మిచౌంగ్ తుపాన్

    ఫొటో సోర్స్, IMD

    ఫొటో క్యాప్షన్, వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మార్పు

    రానున్న 48 గంటల్లో..

    తుపాను ప్రభావంతో రానున్న 48 గంటల్లో(ఆది, సోమవారాలు) ఆంధ్రప్రదేశ్‌లో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు.

    ‘మిచౌంగ్’ అని పేరు పెట్టిన ఈ తుపాను ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.

    దక్షిణ కోస్తాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, డిసెంబరు 3, 4 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

    డిసెంబరు 5న ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

    రాయలసీమలో డిసెంబరు 3,4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. డిసెంబరు 2 సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  14. ఫిలిప్పీన్స్‌లో 7.6 తీవ్రతతో భూకంపం, సునామీ అలర్ట్ జారీ