లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక రోజుకు వాయిదా వేసింది ఎన్నికల సంఘం.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక రోజుకు వాయిదా వేసింది ఎన్నికల సంఘం.
ఈ రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌ను డిసెంబర్ 4న చేపడతామని తెలిపింది.
తొలుత ఈ రాష్ట్ర ఓట్ల లెక్కింపు కూడా ఇతర నాలుగు రాష్ట్రాల లెక్కింపుతో పాటే చేపడతామని ప్రకటించింది. కానీ, ఇవాళ మిజోరం ఓట్ల లెక్కింపు తేదీని సవరిస్తూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
మిగిలిన నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపులో ఎలాంటి మార్పు లేదు.

ఫొటో సోర్స్, Election Commission
కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు ఘటనలు మినహా ఎన్నికలు సజావుగా జరిగాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
71.6 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పోలింగ్ స్టేషన్ నుంచి మొత్తం లెక్కలు వచ్చిన తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మునుగోడలో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ జరిగితే, యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదైందన్నారు.
డిసెంబర్ 3న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో 3 అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు తెలియజేసేందుకు సీసీటీవీ కవరేజ్ ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ 131 ఉంటాయని చెప్పారు.
మొత్తం 49 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ చేపడతామని, ఆ తర్వాత గంటకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం పటిష్టమైన భద్రతలో ఈవీఎంలను ఉంచారు. ఈ రోజు, రేపు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
ఈసారి పెద్ద ఎత్తున ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని వాడామని వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా కౌంటింగ్ వివరాలను వెనువెంటనే తెలుసుకోవచ్చని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇవాళ్టితో ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులతో విరుచుకుపడుతోంది. గాజా వ్యాప్తంగా బాంబుల శబ్దాలు, కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి.
వైమానిక దాడులతో పాటు, చిన్న ఆయుధాలతో కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఆకాశంలో మొత్తం బాంబుల పొగతో కమ్ముకుపోయింది.
గాజాలో కాల్పులు మళ్లీ ప్రారంభమైన తర్వాత 32 మంది వ్యక్తులు మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
హమాస్‌ను కూకటివేళ్లతో సహా రూపుమాపేందుకు కాల్పులను పునరుద్ధరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) తెలిపాయి.
బందీలు అందర్ని బయటికి తీసుకొచ్చి, హమాస్‌ను నాశనం చేయడమే తమ లక్ష్యమని ఐడీఎఫ్ లెఫ్టినెంట్ కల్నల్ పీటర్ లెర్నర్ చెప్పారు.
మహిళలను, పిల్లలను అందర్ని విడుదల చేస్తామని ఒప్పందంలో చెప్పిన మాటకు హమాస్ కట్టుబడి లేదని తెలిపారు. గురువారం వరకు హమాస్ కేవలం 110 మంది ఇజ్రాయెల్ బందీలనే విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇమ్రాన్ ఖురేషి
బీబీసీ కోసం,
బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపి, తనిఖీలు చేశారు పోలీసులు.
శుక్రవారం ఉదయం 28 పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
ఉదయం ఏడు గంటల సమయంలో పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఈ-మెయిల్ రావడంతో పాఠశాల యాజమాన్యాలు స్కూల్‌కు వచ్చిన విద్యార్థులను తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి.
బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, “ఆ బాంబు బెదిరింపులు నిజం కాదు. అన్ని స్కూళ్లకు మా బృందాలను పంపాం” అని చెప్పారు.
మొదట 15 స్కూళ్లకు బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఆ తరువాత సంఖ్య 28కి చేరింది.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ “ప్రజలు ఆందోళ చెందాల్సిన పనిలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. మనం అప్రమత్తంగా ఉండాలి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి రిజర్వ్ బ్యాంక్ అంచనాలను అధిగమించింది.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంగా జీడీపీ 7.6% నమోదు చేయగా, ఇదే త్రైమాసికంలో చైనాలో 4.9% నమోదైంది.
చైనాను దాటేసిన భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మరోసారి నిలిచింది.
రిజర్వ్ బ్యాంకు అంచనా ప్రకారం ఈ రేటు 6.5% ఉండగా, ఆ అంచనాను మించి నమోదైంది.
మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8% నమోదైంది.
గతే ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో జీడీపీ 6.2 % ఉండగా, ఈసారి మాత్రం 7.6% ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డేటా విడుదలయ్యాక, ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా, “రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ సగటు అంచనాలనే కాకుండా, నిపుణులు, ఆర్థికవేత్తల అంచనాలను కూడా అధిగమించింది” అని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా జీడీపీ పెరుగుదలపై స్పందించారు.
జీడీపీలో పెరుగులతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఓ ఉదాహరణగా చెప్పారు.
ఇలాంటి క్లిషమైన పరీక్ష సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ నిదర్శనం. ఈజ్ ఆఫ్ లివింగ్‌ను మెరుగుపర్చడానికి, మరిన్ని అవకాశాలు కల్పించి, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.