ఎగ్జిట్ పోల్స్‌పై రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ పోల్స్‌పై రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్‌ రెడ్డి స్పందించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కూతురు 'ద్వారక' పేరుతో వీడియో... ఆమె ముఖకవళికలపై అనుమానాలు

  3. ఎగ్జిట్ పోల్స్‌పై రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్‌ రెడ్డి ఏం అన్నారు?

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, @REVANTH_ANUMULA

    చంద్రునికి మబ్బులు పట్టాయి, గెలిస్తే రాజు, ఓడితే బానిస అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బాధ్యతాయుతంగా ఈ రాత్రి నుంచే సంబరాలు చేసుకోవచ్చని తెలిపారు.

    పారదర్శక పాలనకు బాధ్యత తీసుకుంటామని, అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుందని మాటిస్తున్నానని చెప్పారు.

    తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. తాము పాలకులం కాదు సేవకులమని చెప్పారు.

    విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్

    ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానితో సంబంధం లేకుండా తమ విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు మంత్రి కే తారక రామారావు.

    2018లో కూడా కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగిలినవన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను ఎగ్జిట్ పోల్స్‌తో అయోమయానికి గురి చేయాలని చేసే ప్రయత్నాలు ఫలించవన్నారు.

    ఎగ్జిట్ పోల్స్‌ని తప్పని నిరూపించడం తమ పార్టీకి కొత్త కాదని కేటీఆర్ చెప్పారు. అసలైన ఫలితం మూడవ తేదీన వస్తుందన్నారు.

    70కి పైగా స్థానాలతో తమ పార్టీ విజయం సాధిస్తుందని, కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

    ఈ ఎగ్జిట్ పోల్స్‌ని చూసి కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు.

    ప్రజలు ఎన్నికల క్యూలైన్‌లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎన్నికల సంఘం ఆలోచించాలని సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఎగ్జిట్ పోల్స్ ఇంకా చూడలేదు... కిషన్ రెడ్డి

    అన్ని ఎగ్జిట్ పోల్స్, లోకల్ ఫీడ్‌బ్యాక్ చూసిన తర్వాతనే తాను కామెంట్ చేస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

    తాను ఇంకా ఎగ్జిట్ పోల్స్ చూడలేదని, పార్టీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు.

    పోలీసుల ముందే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాళ్లు నగదు, మద్యం పంచారని ఆరోపించారు.

    100 నుంచి 200 మందితో పోలింగ్ బూత్‌లలోకి వచ్చారని, చాలా ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని అన్నారు.

    దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాశానని, ఒకసారి వివరాలన్ని సేకరించిన తర్వాత, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

    ఎగ్జిట్ పోల్స్

    తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి.

    ఇండియా టుడే- మై యాక్సిస్ ఇండియా, ఆరా, జన్‌ కీ బాత్, రిపబ్లిక్ టీవీ, టీవీ9 భారత్‌వర్షా పోల్‌స్ట్రాట్‌ సంస్థలు తాము అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి.

    ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ అంచనా ప్రకారం బీఆర్ఎస్‌కు 31 నుంచి 47 మధ్యలో, కాంగ్రెస్‌కు 63 నుంచి 79 మధ్యలో, బీజేపీకి 2 నుంచి 4 సీట్లు, ఏఐఎంఐఎంకు 5 నుంచి 7 సీట్లు వస్తాయని తెలుస్తుంది.

    పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో బీఆర్ఎస్‌కు 36 నుంచి 46 సీట్లు, కాంగ్రెస్‌కు 62 నుంచి 72 సీట్లు, బీజేపీకి 3 నుంచి 8 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది.

    ఆరా(ప్రీపోల్) ఎగ్జిట్ పోల్స్‌ బీఆర్ఎస్‌కు 41 నుంచి 49 సీట్లు, కాంగ్రెస్‌కు 58 నుంచి 67 సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు వస్తాయని చెబుతుంది.

    ఎగ్జిట్ పోల్స్

    ఇండియా టుడే- మై యాక్సిస్ ఇండియా ప్రస్తుతం విడుదల చేసిన డేటా ప్రకారం చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు లభిస్తాయని తెలుస్తుంది.

    90 సీట్లున్న చత్తీస్‌గఢ్‌లో 40 నుంచి 50 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. బీజేపీకి 36-46 మధ్యలో వస్తాయని చెబుతోంది.

  5. తెలంగాణలో గెలిచేదెవరు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

  6. ఐదు రాష్ట్రాల ఎన్నికలు: కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల

    ఎన్నికలు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మరికాసేపట్లో విడుదల కానున్నాయి.

    నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ నిబంధన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలకు వర్తిస్తుందని పేర్కొంది.

    ఎన్నికలు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    చివరిగా నేడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

    తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగాయి.

    ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలలోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది.

  7. యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?

  8. హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత

  9. వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించిన ఎన్‌ఐఏ కోర్టు

    వరవరరావు

    ఫొటో సోర్స్, Getty Images

    సామాజిక కార్యకర్త, రచయిత వరవరరావు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు అనుతించింది.

    ఎడమ కంటి శస్త్రచికిత్స కోసం డిసెంబర్ 5 నుంచి 11 మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి రాజేశ్ కటారియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో వరవరరావు అరెస్టయ్యారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

    హైదరాబాద్‌లో బస వివరాలు, సంప్రదించేందుకు ఫోన్ నంబర్, ప్రయాణ వివరాలను డిసెంబర్ 4లోపు ఎన్‌ఐఏకు అందజేయాలని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పేర్కొంది.

    వైద్య కారణాల ప్రాతిపదికన గతంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఎన్ఐఏ కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబయి దాటి వరవరరావు వెళ్లరాదని షరతులు విధించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది.

  10. తెలంగాణ ఎన్నికల్లో 70.35 శాతం పోలింగ్: అత్యధికంగా ఏ జిల్లాల్లో ఓటింగ్ నమోదైందంటే?

  11. నవయుగ: హిమాచల్‌లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?

  12. అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ మృతి

    హెన్రీ కిసింజర్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ మరణించారు. ఆయన వయసు 100 సంవత్సరాలు. ఆయన సన్నిహితులు విడుదల చేసిన ప్రకటనలో మరణానికి కారణాలను తెలుపలేదు.

    అమెరికా మాజీ అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ హయాంలో కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. సోవియట్ యూనియన్, చైనాతో సంబంధాల విషయంలో నూతన విధానాలను కిసింజర్ ప్రభావవంతంగా అమలు చేశారు.

    చిలీలో రక్తపాతంతో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేసిన తిరుగుబాటుకు మౌనంగా ఉండడం ద్వారా ఆయన మద్దతు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.

    కిసింజర్‌ నోబెల్ శాంతి బహుమతి విజేత. అయితే, ఆయన్ను యుద్ధ నేరస్తుడిగా కూడా కొందరు అభివర్ణిస్తారు.

    కిసింజర్ మరణ వార్తను అమెరికా పత్రికలు ఆయన జీవితాన్ని ప్రతిబింబించేలా ప్రధాన శీర్షికలతో ప్రచురించాయి.

    అమెరికా పాలకులకు అత్యంత ఇష్టుడైన యుద్ధ నేరస్తుడు హెన్రీ కిసింజర్ మరణించినట్లు రోలింగ్ స్టోన్ ప్రచురించింది.

    అమెరికా విదేశాంగ విధానంలో ఆధిపత్యం కొనసాగించిన శక్తివంతమైన హెన్రీ కిసింజర్ వందేళ్ల వయసులో చనిపోయారని సీఎన్ఎన్ పేర్కొంది.

    ఇద్దరు అధ్యక్షుల హయాంలో ప్రపంచ దేశాలతో వ్యవహారాలపై విధానాలను రూపకల్పన చేసిన కిసింజర్ వందేళ్ల వయసులో మరణించారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.

  13. సాగర్ నుంచి కుడికాల్వకు నీటి విడుదల, ఇదంతా కేసీఆర్ పన్నాగమన్న రేవంత్ రెడ్డి

    నాగార్జున సాగర్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, సాగర్ కుడికాల్వకు నీటి విడుదల

    నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడికాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసినట్లు ప్రకటించారు.

    ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఏపీ అధికారులు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి కుడికాల్వకు నీటిని విడుదల చేశారు.

    నాగార్జున సాగర్‌ డ్యామ్ వద్ద గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అధికారులు కుడికాల్వకు నీటిని విడుదల చేసేందుకు పోలీసుల సాయంతో డ్యామ్‌పైకి వచ్చి కంచె వేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

    ఆ తర్వాత తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనంతరం, కొద్దిగంటల్లోనే సాగర్ డ్యామ్ నుంచి కుడికాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు.

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    అయితే, ఇది ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ పన్నాగమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యూహాత్మకంగానే పోలింగ్ రోజున ఇలాంటి ఘటనలకు తెరలేపారని, తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు రేవంత్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని, వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమేనని రేవంత్ అన్నారు.

    రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవని, కేసీఆర్‌వి దింపుడు కల్లం ఆశలేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవన్నారు.

  14. దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’

  15. జనగామలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ

    జనగామలో ఘర్షణ

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల వాగ్వాదం

    జనగామ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామలోని జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

    ఇరువర్గాల ఒకరినొకరు తోసుకున్నాయి. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. తాగునీటి అవసరాలకు సాగర్ కుడికాల్వకు నీటి విడుదల - ఏపీ మంత్రి అంబటి

    నాగార్జున సాగర్ డ్యామ్

    ఫొటో సోర్స్, UGC

    తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

    కుడికాల్వకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

    నాగార్జున సాగర్ డ్యామ్‌ అంశాన్ని పోలీసులు చూసుకుంటారని, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలెవరూ నిబంధనలు అతిక్రమించ వద్దని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. నాగార్జున సాగర్‌ డ్యామ్‌పై కంచె వేసిన ఏపీ పోలీసులు, ఉద్రిక్తత..

    నాగార్జున సాగర్ డ్యామ్

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్దకు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. నాగార్జున సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసేందుకు పోలీసులు ఇరిగేషన్ అధికారులతో కలిసి వచ్చినట్లు చెప్తున్నారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    సాగర్ డ్యామ్ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహణలో ఉంది. ఎస్పీఎఫ్ బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే, ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్‌పైకి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిని ఎస్పీఎఫ్ బలగాలు వ్యతిరేకించాయి.

    డ్యామ్‌కి చెందిన 26 గేట్లలో 13 ఏపీకి, మరో 13 తెలంగాణ పరిధిలోకి వస్తాయి. పదమూడో నంబర్ గేటు వద్దకు ఏపీ పోలీసులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఏపీ పోలీసులు కంచె వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, దీనిపై ఏపీ పోలీసులు కానీ, అధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    కుడికాల్వకు నీటి విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

    తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

    నాగార్జున సాగర్ డ్యామ్

    ఫొటో సోర్స్, UGC

    ఎన్నికల వేళ ఇదొక రాజకీయ చర్య అని.. టీఆర్ఎస్, వైసీపీ కలిసి పన్నిన కుట్ర అని నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    దీనిపై ఏపీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, నీటిని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ ఈఎన్‌సీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు.

    ఈ వ్యవహారంపై కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్‌కు కూడా సమాచారం అందించారు. కేఆర్‌ఎంబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

  18. ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్, మంత్రి మల్లా రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్,

    తెలంగాణ ఎన్నికలు

    ఫొటో సోర్స్, UGC

    సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య ప్రణతితో కలసి వచ్చి ఓటు వేశారు.

    తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అంబర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్ కాంప్లెక్స్, 105వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    మంత్రి మల్లారెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    తెలంగాణ ఎన్నికలు

    ఫొటో సోర్స్, UGC

    తెలంగాణ ఎన్నికలు

    ఫొటో సోర్స్, UGC

  19. ఆంధ్రప్రదేశ్: ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది, కూల్చేసిన చోట ఏం చేశారు?

  20. ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి, అల్లు అర్జున్, ఎమ్మెల్సీ కవిత

    కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు వేశారు.

    సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లతో కలిసి క్యూలో నిల్చుని తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు.

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు ఉన్న వేలుని చూపిస్తూ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నగర ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

    తెలంగాణ ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఓటు వేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి