లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
బయటికి వచ్చిన కార్మికులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కలిశారు.

ఫొటో సోర్స్, ANI
నవంబర్ 12న ఉత్తర కాశీ సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో పనులు జరుగుతున్నప్పుడు, ఆ సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.
ఈ సొరంగ ప్రమాదం జరిగిన నాటి నుంచి 17 రోజులుగా కార్మికులను రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులలో ఇప్పటి వరకు 13 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చారు.
సొరంగం నుంచి బయటికి తీసుకొచ్చిన కార్మికులకు తక్షణమే వైద్య సేవలు అందించేందుకు వారిని అంబులెన్స్‌లలో చిన్యాలిసౌర్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్నారు.
ప్రస్తుతం కార్మికులను బయటికి తీసుకొస్తున్న ఆపరేషన్‌ను జాతీయ నిర్వహణ విపత్తు ప్రాధికార సంస్థ(ఎన్‌డీఆర్ఎఫ్), ఎస్‌డీఆర్ఎఫ్‌లు చేపడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
సైలెంట్ పిరియడ్ మొదలైందని మీడియా సమావేశంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
సినిమాలు, సోషల్ మీడియాలో ప్రచారం నిలిపివేయాలని తెలిపారు. స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచివెళ్లాలని ఆదేశించారు.
బ్యాలెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో చిత్రీకరించకూడదని హెచ్చరించారు.
ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందన్నారు.
కేంద్ర బలగాలతో రాష్ట్రవ్యాప్తంగా అదనపు భద్రత కల్పించారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చాయి. చివరి రోజు పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రచారం నిర్వహించారు.
చివరి రోజు ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ వీడియో ద్వారా తన సందేశాన్ని ఓటర్లకు తెలియజేశారు.
అనారోగ్య కారణాల చేత తాను ప్రచారానికి రాలేకపోయానని, కానీ మార్పు కోసం తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు.
‘‘మీరందరూ నాకు ఎంతో గౌరవమిచ్చారు. సోనియా అమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు. నన్ను అమ్మలా భావించారు. అమ్మ అని గౌరవిస్తున్నందుకు మీకందరికీ నేను రుణపడి ఉంటాను’’ అని తన వీడియోలో సందేశంలో చెప్పారు.
ప్రచారాల చివరి రోజున సోనియాగాంధీ వీడియో సందేశాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FACEBOOK/KCR
గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత తనదని ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
గజ్వేల్‌లో తనను రెండుసార్లు గెలిపించారని, ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.
రైతుబంధు పదం పుట్టించిందే తానని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని తెలిపారు.
24 గంటల కరెంట్ ఉంటుందని, దాని వల్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
పదేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రంలో కర్ఫ్యూ రాలేదని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.
పట్టణాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
పదేళ్ల వయసున్న తమ చిన్న రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AsifAli
17 రోజులుగా ఉత్తర కాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41మంది కూలీలను రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు మట్టిని తవ్వే పనిలో నిమగ్నమై ఉన్నారు.
‘‘52 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పని పూర్తయింది, మరో ఐదు మీటర్లు తవ్వితే, 57వ మీటర్ దగ్గర ఈ పని పూర్తి కావచ్చు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ఉదయం అన్నారు.
నిన్నటి నుంచి మ్యాన్యువల్ డ్రిల్లింగ్ కొనసాగుతోందని సిల్క్యారా టన్నెల్ వద్ద పనులను సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇదే విషయాన్ని మైక్రో టన్నెల్ నిపుణుడు క్రిస్ కూపర్ కూడా ధృవీకరించారు. గత రాత్రి నుంచి తవ్వకాలలో ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదని, మరో ఐదారు మీటర్లు తవ్వితే కూలీలను చేరుకునే అవకాశం ఉందని కూపర్ అన్నారు.
ఇటు అధికార యంత్రంగాం సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లను తరలిస్తోంది. ఏ క్షణమైనా కూలీలను బయటకు తీయవచ్చన్న అంచనాతో ఈ ఏర్పాట్లను చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో పిడుగుపాట్లు, భారీ వడగళ్ల వానల వల్ల 24 మంది మరణించారు. 24 మంది మృతుల్లో 18 మంది పిడుగుపాటు వల్లే మరణించారని అధికారులు వెల్లడించారు.
ఆదివారం మొదలైన ఈ వడగళ్ల వానలు, పిడుగుపాట్లు సోమవారం వరకు కొనసాగాయి.
వడగళ్ల వానకు పలు ఇళ్లు దెబ్బతినడంతోపాటు పెద్ద సంఖ్యలో పశువులు కూడా చనిపోయాయి.
హఠాత్తుగా కురిసిన ఈ వడగళ్ల వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాధారణంగా శీతాకాలంలో వడగళ్ల వానలు గుజరాత్‌లో అరుదుగా వస్తుంటాయి. అయితే, మూడు రకాల వాతావరణ పరిస్థితులు గుజరాత్‌పై ఆవరించడం ఈ పరిణామానికి కారణమైందని గుజరాత్‌కు చెందిన వాతావరణ శాఖ అధికారి మనోరమా మొహంతీ వెల్లడించారు.
‘‘అరేబియా సముద్రం మీద నుంచి వీచే తూర్పు పవనాలు, పశ్చిమ హిమాలయాల మీద ఏర్పడిన వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్, దక్షిణ గుజరాత్ మీద నెలకొన్న సైక్లోనిక్ సర్క్యులేషన్ అనే మూడు వాతావరణ పరిస్థితులు ఒకేసారి గుజరాత్ మీద ఆవరించడం వల్ల ఈ పరిణామం ఏర్పడింది’’ అని మనోరమ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Handout
హమాస్ మరో 11 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది.
తాజాగా విడుదలైన వారిలో షరోన్ అలోనీ అనే మహిళ, ఆమె మూడేళ్ల కవలలు ఎమ్మా, యూలీలు కూడా ఉన్నారు.
షరోన్ భర్త డేవిడ్, ఆయన సోదరుడు ఏరియల్ ఇంకా హమాస్ వద్దే బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలైన వారంతా 52 రోజులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు.
ఈ 11మంది విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ 33 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, HandoutCopyright
అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో హమాస్ నుంచి తప్పించుకోవడానికి షరోన్ కుటుంబం ఒక సేఫ్ రూమ్‌లో దాక్కుంది.
ఈ గదికి హమాస్ మిలిటెంట్లు నిప్పంటించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి ఈ కుటుంబం పారిపోతున్న సమయంలో హమాస్ వీరిని కిడ్నాప్ చేసి బందీలుగా పట్టుకుపోయింది.
వీరితోపాటు బందీలుగా మారిన మరికొందరు కుటుంబ సభ్యులను హమాస్ శుక్రవారం విడుదల చేసింది.
కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించడంతో ఈ ఖైదీలు, బందీల మార్పిడి కొనసాగవచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.