ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ జరిగింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, BJP/YT
హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ జరిగింది.

ఫొటో సోర్స్, BJP/YT
కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.
ఈ రోడ్ షోలో మోదీతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
రోడ్ షో నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లు ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, Congress/YT
తెలంగాణ ప్రజల హక్కులు, ప్రాణాలు, ఆందోళనలు గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో ప్రియాంకా సోమవారం పాల్గొని, ప్రసంగించారు.
మోసపూరిత వాగ్ధానాలతో కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు.
''కేసీఆర్ గురించి నాకు తెలియదు కానీ, ఆయన పనితీరు నాకు బాగా తెలుసు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. తెలంగాణ ప్రజలు పేదలుగా మారుతుంటే, కేసీఆర్ కుటుంబసభ్యులు రాజమహళ్లు కట్టుకుంటున్నారు'' అని అన్నారు ప్రియాంక.
ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా బీజేపీ పేరు తెచ్చుకుందని, బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.
''దొరల తెలంగాణ రోజురోజుకూ బలపడుతోంది. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం నెలకొల్పాలి'' అని అన్నారు ప్రియాంక.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిశీలించి, తమ పార్టీకి ఓటేయాలని సూచించారు.

ఫొటో సోర్స్, Facebook/KishanReddyGangapuram
బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యానాథ్, హిమంత బిస్వా శర్మలు ఇదివరకే ఈ విషయం చెప్పారని కిషన్ రెడ్డి సోమవారం ఏఎన్ఐ వార్తాసంస్థతో తెలిపారు.
ప్రాంతీయ పార్టీలే మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కతాగా, బాంబేను ముంబయిగా మార్చాయని గుర్తుచేశారు కిషన్ రెడ్డి.
''హైదరాబాద్ పేరు ఎందుకు మార్చకూడదు. ఎవరీ హైదర్? భాగ్యనగర్ పాత పేరు. నిజాం కాలంలో పేరు మార్చారు. మేం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తాం'' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, X / Revanth Reddy
రైతు బంధు పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదేశాలు ఇవ్వడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.
‘‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు (ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్‌రావులను ఉద్దేశించి)లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం’’ అని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.15 వేల రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, HUSAM ZOMLOT/X
అమెరికాలోని వర్మాంట్ యూనివర్సిటీ సమీపంలో ముగ్గురు పాలస్తీనా విద్యార్థులపై కాల్పులు జరిగాయి. శనివారం రాత్రి వర్మాంట్‌లోని బర్లింగ్‌టన్‌లో కుటుంబంతో కలిసి డిన్నర్ చేసేందుకు వెళ్తుండగా శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి.
హషీమ్ అవర్తాని, తహ్సీన్ అహ్మద్, కిన్నన్ అబ్దల్‌హమీద్‌లపై వర్మాంట్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్లు బర్లింగ్‌టన్ పోలీసులు తెలిపారు.
కాల్పుల ఘటన వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి సమయంలో వారు సంప్రదాయ కండువా 'కెఫియె' ధరించి ఉండడంతో పాటు, అరబిక్‌లో మాట్లాడుకుంటున్నారు.
కాల్పుల అనంతరం నిందితుడు నడుచుకుంటూ వెళ్లిపోయాడని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ దాడిని ద్వేషపూరిత నేరం కింద దర్యాప్తు జరపాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి.
బాధితుల్లో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని బర్లింగ్‌టన్ పోలీస్ చీఫ్ జాన్ మురా తెలిపారు.

ఫొటో సోర్స్, FB / Harish Rao Thanneeru
రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ విషయంలో తెలంగాణ మంత్రి టి.హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ -ఎంసీసీ)’కి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఈ పథకం కింద సాయం పంపిణీని నిలిపివేస్తున్నామని చెబుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
ఈ విషయంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బులు అందించాల్సిఉంది.
దీన్ని పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నవంబరు 18న ఈసీకి లేఖ రాసింది.
ఎన్నికల నియమావళి నిబంధనలకు లోబడి పంపిణీ చేసుకునేందుకు అభ్యంతరం లేదంటూ నవంబరు 24న ఈసీ అనుమతి ఇచ్చింది. ఈ నెల 28లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించింది.దీనికి తగ్గట్లుగా రూ.7,700 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేసేలా ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది.
25న పాలకుర్తిలో హరీష్ రావు ఏమన్నారు?
నవంబరు 25న పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి హరీష్ రావు రైతుబంధు పంపిణీపై మాట్లాడారు.
‘‘ఇవ్వాళ శనివారం.. రేపు ఆదివారం.. బ్యాంకులకు సెలవులు. సోమవారం పొద్దుగాల.. మీరు చాయ్ తాగి టిఫిన్ తినేసరికి మీ ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతాయ్. రెడీ గా ఉండాలే.. ఫోన్లు టింగ్ టింగ్ అంటూ మోగుతాయ్.. రైతుబంధు పైసలు పడతయ్. మీ ఫోన్లు మోగుతాయ్. దేవుడు మన పక్షానే ఉన్నాడు. ధర్మమే గెలిచింది. ’’ అంటూ కామెంట్స్ చేశారు.
మంత్రి వ్యాఖ్యలపైఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కోడ్‌లోని పేరా 6 ప్రకారం- ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పట్నుంచి మంత్రులు, ఇతర అధికారులు ఓటర్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే వాగ్దానాలు చేయకూడదు.
ఈ నేపథ్యంలో, హరీష్ రావు వ్యాఖ్యలు ఎంసీసీని ఉల్లంఘించినట్లుగా ఈసీ గుర్తించి, తాజా ఆదేశాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది.
ఇంకో మూడు మ్యాచులు జరగాల్సి ఉంది. వీటిలో ఒక్కటి గెలిచినా సిరీస్ విజయం భారత్ సొంతం అవుతుంది.
ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్, ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ‘వన్డౌన్’ బ్యాటర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేశారు.
యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 53 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 58 పరుగులు, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52 పరుగులు చేశారు.
భారత ఇన్నింగ్స్ చివరి దశలో 344.44 స్ట్రైక్ రేట్‌తో రింకూ సింగ్ చెలరేగి ఆడాడు. అతడు కేవలం తొమ్మిది బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.
భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 ఫోర్లు, తొమ్మిది సిక్స్‌లు ఉన్నాయి.
ఇండియా భారీ స్కోరుకు బలమైన పునాది వేసిన యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది.
ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
కెప్టెన్ మాథ్యూ వేడ్ (42 పరుగులు), టిమ్ డేవిడ్ (37 పరుగులు) చేశారు.
మిగతా బ్యాటర్లు ఎవరూ తలా 20 పరుగులు కూడా చేయలేకపోయారు.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి, ఆసీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అర్ష్‌దీప్ సింగ్, అక్సర్ పటేల్, ముకేశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.
కీలకమైన మూడో మ్యాచ్ మంగళవారం గువాహటిలో జరుగనుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.