బ్యాడ్మింటన్: చైనా మాస్టర్స్ ఫైనల్‌లో సాత్విక్‌, చిరాగ్ జోడీ ఓటమి

సాత్విక్, చిరాగ్ జోడీ ఫైనల్ వరకు ఏ సెట్‌ను కోల్పోకుండా గొప్ప ఆట ఆడిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. బ్యాడ్మింటన్: చైనా మాస్టర్స్ ఫైనల్‌లో సాత్విక్‌, చిరాగ్ జోడీ ఓటమి

    సాత్విక్, చిరాగ్ జోడీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సాత్విక్, చిరాగ్ జోడీ

    చైనా మాస్టర్స్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ ఓడిపోయింది.

    ఆదివారం షెన్‌జెన్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ చేతిలో 19-21, 21-18, 19-21 తేడాతో ఓడింది.

    సాత్విక్, చిరాగ్ జోడీ ఫైనల్ వరకు ఏ సెట్‌ను కోల్పోకుండా గొప్ప ఆట ఆడిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఎక్స్(ట్విటర్)లో ప్రశంసించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఉత్తరాఖండ్: సొరంగంలో కార్మికులను రక్షించడం ఎప్పటికి సాధ్యమవుతుంది?

  4. పేపర్ స్ట్రాలతో డ్రింక్స్ తాగుతారా? అది ఎంత ప్రమాదమో తెలుసుకోండి...

  5. తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు

  6. డీబీ కూపర్: విమానం హైజాక్ చేసి, డబ్బు సంచులతో ఆకాశం నుంచి దూకేశాడు...

  7. జంతువు నుంచి మనిషిగా మార్చిన జన్యువులే వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయా?

  8. ఇజ్రాయెల్ కార్గో షిప్‌పై హిందూ మహాసముద్రంలో దాడి, ఇరాన్‌పై అమెరికా అనుమానం

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, Houthi Movement via Getty Images)

    ఫొటో క్యాప్షన్, కొద్దిరోజుల కిందట ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకను హౌథీ రెబల్స్ హైజాక్ చేశారు

    ఇజ్రాయెల్‌ కార్గో షిప్‌పై హిందూ మహాసముద్రంలో దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    హిందూ మహాసముద్రంలో ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. ఈ దాడి వెనుక ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ హస్తం ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

    హిందూ మహాసముద్రంలో జనంతో వెళ్తున్న నౌకపై షాహీద్ - 136 డ్రోన్‌తో ఐఆర్‌జీసీ( ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) కాల్పులు జరిపినట్లు సమాచారం ఉందని అమెరికా అధికారి ఒకరు ఏఎఫ్‌పీకి తెలిపారు.

    ఈ దాడితో నౌక స్వల్పంగా దెబ్బతిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల కిందట ఇజ్రాయెల్‌కి చెందిన ఒక కార్గో షిప్‌ను ఇరాన్‌ మద్దతు కలిగిన హౌథీ రెబల్స్ ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు.

    అలాగే, లెబనాన్‌కు చెందిన హిజ్బొల్లా సంస్థ అనుబంధ మీడియా సంస్థ అల్ మయాదిన్ కూడా హిందూ మహాసముద్రంలో ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ దాడి వార్తను ప్రచురించింది.

  9. జ్యులియా సికెట్టిన్: ఈ అమ్మాయి దారుణ హత్య ఇటలీని కుదిపేస్తోంది, ఎందుకు?

  10. వెస్ట్‌బ్యాంక్‌: ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఆరుగురు పాలస్తీనియన్ల మృతి

    ఇజ్రాయెల్ ఆర్మీ

    ఫొటో సోర్స్, Getty Images

    వెస్ట్‌బ్యాంక్‌లోని నాబ్లస్, జనీన్ పట్టణాల్లో ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇద్దరు పాలస్తీనియన్లను చంపేశాయని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

    దీంతో శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో చనిపోయిన పాలస్తీనియన్ల సంఖ్య ఆరుకి చేరింది.

    అయితే, ఈ మరణాల గురించి వస్తున్న వార్తలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

    హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా 230 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.

    ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగం వెస్ట్‌బ్యాంక్. అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఇక్కడ కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా అదుపులోకి తీసుకుంది.

    హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం గాజాలో నాలుగు రోజుల కాల్పలు విరమణ కొనసాగుతోంది.

    ఆదివారం హమాస్ మూడో విడత బందీలను విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. బదులుగా జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది.

  11. తలకు తుపాకీ గురి పెట్టే డ్రగ్స్‌ మాఫియాను లెక్కచేయని మహిళా ట్రక్కు డ్రైవర్ కథ

  12. తెలంగాణలో అగ్రనేతల ప్రచార హోరు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Reuters, ANI

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల అధినేతలూ, దిగ్గజాలూ తెలంగాణలోనే మకాం వేశారు.

    ప్రచారానికి ఇంకా రెండే రోజులు మిగిలి ఉండడంతో వీరంతా క్షణం తీరిక లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

    రోజుకు మూడేసి నాలుగేసి నియోజకవర్గాలు తిరుగుతూ, మధ్యలో ప్రెస్ మీట్లు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

    ఇవాళ తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

    కేంద్ర నాయకత్వంతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నాయకులూ పర్యటిస్తున్నారు.

    ఇక బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు కేటీ రామారావు, టి.హరీశ్ రావు, ఎమ్మెల్సీ కె.కవిత కూడా ప్రచారంలో ఉన్నారు.

    మంగళవారం సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. రువారం పోలింగ్ జరుగుతుంది.

    ఎన్నికల హామీలు, తెలంగాణలో నిరుద్యోగ సమస్య, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కేసీఆర్‌ది కుటుంబ పాలన అనే విమర్శలు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.

    కాంగ్రెస్‌ను నమ్మొద్దని, ఆ పార్టీ పాలన అస్తవ్యస్తంగా ఉంటుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం సాగిస్తున్నాయి.

    స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షాలతో రోడ్ షోలు ప్లాన్ చేసింది బీజేపీ.

    సభలు, రోడ్ షోలు, మీడియాలో చర్చలు, ప్రకటనలతో పాటూ వివిధ వర్గాలతో సమావేశాలూ, సమ్మేళనాలూ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి పార్టీలు.

    నిన్న రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశం కాగా, ఇవాళ కేటీఆర్ కొత్త తరం ఓటర్లతో సమావేశం అయ్యారు. ఇక కులాల వారీ, ప్రాంతాల వారీ, వృత్తుల వారీ సమావేశాలు వీటికి అదనం.

  13. హలో!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  14. బ్యాడ్మింటన్: చైనా మాస్టర్స్ ఫైనల్‌లో సాత్విక్‌, చిరాగ్ జోడీ ఓటమి