ఉత్తరకాశీ: సొరంగం దగ్గరకు చేరుకున్న విదేశీ నిపుణులు

నవంబర్ 12వ తేదీన సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే సహాయక చర్యలు చివరి దశకు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీని ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్‌డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. ఇజ్రాయెల్-హమాస్: శుక్రవారం 13 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుందన్న ఖతార్

    గాజా ఘర్షణలు

    ఫొటో సోర్స్, AFP

    గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదలకు సంబంధించిన వివరాలను ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

    శుక్రవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 7 గంటలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేస్తే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తుందని ఖతార్ తెలిపింది.

    ఇజ్రాయెల్-హమాస్‌కు మధ్య ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.

    వీడియో క్యాప్షన్, శుక్రవారం నుంచి బందీలు విడుదలయ్యే అవకాశం..

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 50 ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసేందుకు బదులుగా 150 మంది హమాస్ ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది.

    విడుదల చేసే ఇజ్రాయెల్ బందీలను రెడ్ క్రాస్‌కు అప్పగిస్తారు.

  3. ఉత్తర కాశీ: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు డ్రిల్లింగ్ దాదాపు పూర్తయింది... మరి ఆలస్యం దేనికి?

  4. డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటే...

  5. విశాఖపట్నం టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    IND vs Aus T20

    టీ20 : విశాఖపట్నం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ మొదలైంది.

    భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

    సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ క్రిష్ణలు భారత జట్టులో ఆడుతున్నారు.

  6. తెలంగాణ: మళ్లీ గెలిస్తే ముస్లిం యువత కోసం ప్రత్యేక ఐటీ పార్క్ - కేసీఆర్

    కేసీఆర్

    ఫొటో సోర్స్, FACEBOOK/KCR

    తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరంలో ఏర్పాటైన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ‘‘ ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తే, ముస్లిం యువత కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు దగ్గర్లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తాం’’ అని ప్రకటించారు.

    ఈ పార్క్‌ను పహాడీ షరీఫ్‌కు దగ్గర్లో కడతామన్నారు.

    హిందూ, ముస్లింలను తమ ప్రభుత్వం రెండు కళ్లగా భావిస్తుందని చెప్పారు. లౌకికవాదమే స్ఫూర్తిగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

    ‘‘ఇవాళ మేం పెన్షన్ ఇస్తున్నాం, ముస్లింలకు కూడా అందుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్లను తెరిచాం, వాటిల్లో ముస్లిం విద్యార్థులు కూడా చదువుతున్నారు’’ అని కేసీఆర్ చెప్పారు.

    తాము అధికారంలోకి వచ్చాక మైనార్టీల అభివృద్ధి కోసం రూ.12 వేలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.

    నవంబర్ 30న తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేశ్వరం అభ్యర్థిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.

  7. అమెరికాలో సిక్కు వేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న వైట్ హౌస్... భారత్ స్పందన ఏంటి?

  8. క్రికెట్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఐసీసీ టీ20, చాంపియన్స్ టోర్నీల్లో ఆడతారా?

  9. క్రికెట్: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం

    మార్లోన్ శామ్యూల్స్

    ఫొటో సోర్స్, Getty Images

    వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆరేళ్లు నిషేధం విధించింది.

    ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ఆయనను దోషిగా నిర్ధారించింది.

    దీంతో శామ్యూల్స్‌ను అన్ని రకాల క్రికెట్ వ్యవహారాల నుంచి ఆరేళ్ల పాటు నిషేధిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

    సెప్టెంబర్ 2021లో శామ్యూల్స్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఆయన బహుమతులు, నగదు, ఇతర సేవలు అందుకున్నారని, ఆ వివరాలు అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం తదితర ఆరోపణలు ఉన్నాయి.

    దీంతో ఈ ఏడాది ఆగస్టులో నాలుగు అభియోగాల కింద ట్రిబ్యునల్ ఆయనను దోషిగా నిర్ధారించింది. శామ్యూల్స్‌పై నిషేధం 2023 నవంబర్ 11 నుంచి అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది.

    శామ్యూల్స్ ప్రస్తుతం రిటైర్ అయినా, అవినీతికి పాల్పడినపుడు ఆయన జట్టులో ఉన్నాడని, అందుకే నిషేధం విధించామని ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటెగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

    శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారని, పలుమార్లు అవినీతి వ్యతిరేక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారని, ఆయనకు అవినీతి నిరోధక నియమావళి గురించి అవగాహన ఉందని అలెక్స్ గుర్తుచేశారు.

    రెండు ప్రపంచ‌కప్‌లను అందించిన ఘనత

    18 ఏళ్ల కెరీర్‌లో శామ్యూల్స్ వెస్టిండీస్ తరుఫున 300లకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 17 సెంచరీలు నమోదుచేశాడు.

    వన్డేలలో వెస్టిండీస్‌ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.

    2012, 2016లలో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అప్పటి ఫైనల్ మ్యాచ్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచింది కూడా శామ్యూల్సే.

  10. బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్‌లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..

  11. ‘బర్రెలక్క’, యశస్విని రెడ్డి, కేసీఆర్, రేవంత్, ఈటల.. అందరిదీ ఒకటే లక్ష్యం

  12. ఉత్తరకాశీ: సొరంగం దగ్గరకు చేరుకున్న విదేశీ నిపుణులు

    సిల్క్యారా సొరంగం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, 41 మంది కార్మికులను రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు తుది దశకు వచ్చాయి.

    అంతర్జాతీయ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ ఇక్కడికి చేరుకున్నారు.

    "ప్రస్తుతం సహాయక చర్యలు తుది దశకు చేరాయి. చెప్పాలంటే, ఇప్పుడు మనం గుమ్మం దగ్గరకు చేరుకుని, తలుపు కొడుతున్నట్లే అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను" అని అర్నాల్డ్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అంతకు ముందు ప్రాజెక్ట్ ఇంఛార్జ్ హర్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, “హారిజెంటల్ డ్రిల్లింగ్ ద్వారా 44 మీటర్ల పైప్‌లైన్‌లో శిథిలాల గుండా పంపాం. డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో నాలుగు ఇనుప రాడ్లు డ్రిల్లింగ్ మిషిన్‌కు అడ్డుగా రావడంతో, పనులు ఆగిపోయాయి” అని చెప్పారు.

    “ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పైప్‌ ద్వారా లోపలికి వెళ్లి, ఈ అడ్డుగా ఉన్న ఈ ఇనుప రాడ్లను కట్ చేస్తారు. వీటిని తొలగించాకే, డ్రిల్లింగ్ పనులు తిరిగి మొదలుపెట్టడం సాధ్యమవుతుంది” అని చెప్పారు.

    “ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ పని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని నమ్మకంతో ఉంది. ఆ పని పూర్తికాగానే మళ్లీ మొదలుపెడతాం” అని చెప్పారు.

    ఇప్పటి వరకు 45 మీటర్ల వరకు డ్రిల్ చేసి పైప్‌లైన్‌ను వేసినట్లు ఉత్తరఖాండ్ ప్రభుత్వానికి చెందిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు.

  13. గుడ్ మార్నింగ్,

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.