You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బందీలను గాజా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారంటున్న ఇజ్రాయెల్, సీసీటీవీ ఫుటేజీ విడుదల
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలోకి బందీలను తీసుకెళ్తున్నట్లు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీని ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
లైవ్ కవరేజీ
గాజా ఘర్షణలు : ఇజ్రాయెల్‌తో ఒప్పందం గురించి హమాస్ నేత ఏం చెప్పారు?
ఉత్తరకాశి సొరంగ ప్రమాదం: బిహార్, ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు ఏ పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్నారు?
లైవ్ పేజీని ముగిస్తున్నాం
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓడినా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించిన ఇండియా
అల్‌జహ్రా: గాజాలోని ఈ అందమైన నగరం ఇప్పుడెలా ఉందో చూడండి...
వరల్డ్ కప్ ఫైనల్: భారత్ ఓటమికి అసలు కారణం ఏంటి?
సామ్ ఆల్ట్‌మాన్ మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అవుతారన్న సీఈఓ సత్య నాదెళ్ళ... ఓపెన్ ఏఐ కొత్త బాస్ ఎమ్మెట్ షియర్
లెబనాన్‌లోని ‘హెజ్బొల్లా టెర్రరిస్టులే’ లక్ష్యంగా దాడులు - ఐడీఎఫ్
లెబనాన్ భూభాగంలోని హెజ్బొల్లా టెర్రరిస్టులే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో దాడులకు సమాధానంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది.
ఉత్తర ఇజ్రాయెల్ వైపు యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, మోర్టార్ షెల్స్ ప్రయోగించడం నిప్పుతో చెలగాటమాడడమేనని ఐడీఎఫ్ తెలిపింది.
''టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న స్థావరం, దాని మిలటరీ పోస్టుపై దాడి చేయడమే మా లక్ష్యం'' అని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే, దీనిని బీబీసీ ధ్రువీకరించలేకపోయింది.
''యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ లక్ష్యంగా వెయ్యికి పైగా కాల్పుల ఘటనలకు పాల్పడ్డారు. ఆ గ్రూపుకు ఇంకా హాని జరుగుతుంది'' అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లెంట్ అన్నారు.
నెపోలియన్ టోపీ ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?
ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయని మీకు తెలుసా... ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్లో అసలు ‘టర్నింగ్ పాయింట్’ అదేనా?
ఈ విస్కీ బాటిల్ ధర రూ. 22 కోట్లు
ట్రావిస్ హెడ్: భారత్ ప్రపంచ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ ఆస్ట్రేలియన్ కథేంటి?
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన బోట్లు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
విశాఖ ఫిషింగ్ హార్బర్ జెట్టీ నంబర్ 1 వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జెట్టీలో నిలిపి ఉంచిన 30 బోట్ల వరకూ మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అగ్నిప్రమాదం గురించి స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో భారత నౌకాదళానికి చెందిన ఫైరింజన్లు కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఒక్కో బోటు కనీసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుందని బోటు యాజమనులు చెబుతున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో బోట్లు తగలబడిపోవడంతో బోటు యాజమానులు ఆవేదన చెందుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వేటకు వెళ్లేప్పుడు ఉపయోగించేందుకు వాటిలో వంట గ్యాస్ ఉండటం, బోట్లలో చెక్క, ఫైబర్‌తో తయారు చేసిన సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని, సిలిండర్లు ఉండటంతో మంటలు ఒక బోటు నుంచి మరో బోటుకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం హార్బర్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
బందీలను గాజా అల్-షిఫా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారంటున్న ఇజ్రాయెల్, సీసీటీవీ ఫుటేజీ విడుదల
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా ఆస్పత్రిలోకి బందీలను తీసుకెళ్తున్నట్లు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీని ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
వారిలో ఒక సోల్జర్‌ను చంపేశారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.
అల్-షిఫా ఆస్పత్రికి తీసుకెళ్లేప్పటికి 19 ఏళ్ల సీపీఎల్. నోవా మర్సియానో స్వల్పగాయాలతో ఉన్నారని, ఆ తర్వాత హత్యకు గురయ్యారని చెప్పారు.
హమాస్ కమాండ్ సెంటర్‌గా ఇజ్రాయెల్ చెబుతున్న ఆ ప్రదేశంలో ఒక సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అయితే, హమాస్ ఆ వాదనలను ఖండించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆదివారం మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియో ఫుటేజీని బీబీసీ ధ్రువీకరించుకోలేకపోయింది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఫైనల్లో భారత్ ఓటమి
రాణీ కి వావ్: ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ఈ బావి దగ్గర ఫోటో ఎందుకు దిగారు? దీని కథేంటి?