బందీలను గాజా అల్-షిఫా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారంటున్న ఇజ్రాయెల్, సీసీటీవీ ఫుటేజీ విడుదల
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా ఆస్పత్రిలోకి బందీలను తీసుకెళ్తున్నట్లు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీని ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
వారిలో ఒక సోల్జర్‌ను చంపేశారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.
అల్-షిఫా ఆస్పత్రికి తీసుకెళ్లేప్పటికి 19 ఏళ్ల సీపీఎల్. నోవా మర్సియానో స్వల్పగాయాలతో ఉన్నారని, ఆ తర్వాత హత్యకు గురయ్యారని చెప్పారు.
హమాస్ కమాండ్ సెంటర్‌గా ఇజ్రాయెల్ చెబుతున్న ఆ ప్రదేశంలో ఒక సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అయితే, హమాస్ ఆ వాదనలను ఖండించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆదివారం మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియో ఫుటేజీని బీబీసీ ధ్రువీకరించుకోలేకపోయింది.