ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శించిన ప్రతిభ, సంకల్పం మరువలేనివని కొనియాడారు.
లైవ్ కవరేజీ
బందీలను గాజా అల్-షిఫా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారంటున్న ఇజ్రాయెల్, సీసీటీవీ ఫుటేజీ విడుదల
ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా ఆస్పత్రిలోకి బందీలను తీసుకెళ్తున్నట్లు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీని ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
వారిలో ఒక సోల్జర్‌ను చంపేశారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.
అల్-షిఫా ఆస్పత్రికి తీసుకెళ్లేప్పటికి 19 ఏళ్ల సీపీఎల్. నోవా మర్సియానో స్వల్పగాయాలతో ఉన్నారని, ఆ తర్వాత హత్యకు గురయ్యారని చెప్పారు.
హమాస్ కమాండ్ సెంటర్‌గా ఇజ్రాయెల్ చెబుతున్న ఆ ప్రదేశంలో ఒక సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అయితే, హమాస్ ఆ వాదనలను ఖండించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆదివారం మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియో ఫుటేజీని బీబీసీ ధ్రువీకరించుకోలేకపోయింది.
బందీలను గాజా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారంటున్న ఇజ్రాయెల్, సీసీటీవీ ఫుటేజీ విడుదల
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి కారణాలు ఇవే
ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, క్రికెట్ మ్యాచ్ చూసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శించిన ప్రతిభ, సంకల్పం మరువలేనివని కొనియాడారు.
"మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వపడేలా చేశారు. ఈ రోజు మీ వెంట నిలబడతాం. భవిష్యత్తులోనూ మీకు అండగా ఉంటాం" అని ప్రధాని అన్నారు.
ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారంటూ ప్రధాని అభినందించారు.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2
ప్రపంచ కప్ ఫైనల్: పాట్ కమిన్స్ అన్నంత పని చేశాడు
ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఫైనల్లో భారత్ ఓటమి
స్టేడియానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న
ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
వరల్డ్ కప్: పిచ్‌పైకి దూసుకెళ్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఫొటో సోర్స్, ANI/Getty Images
ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్: పిచ్‌పైకి దూసుకెళ్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పిచ్‌పైకి దూసుకెళ్లిన పాలస్తీనా జెండా ప్రదర్శించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరికి ఆ యువకుడు దూసుకెళ్లాడు. పాలస్తీనాకు మద్దతుగా జెండాను ప్రదర్శించాడు.
‘‘నా పేరు జాన్. ఆస్ట్రేలియా వాసిని. పాలస్తీనాకు మద్దతుదారుడిని. విరాట్ కోహ్లీని కలిసేందుకు పిచ్‌పైకి వెళ్లాను’’ అని అతడు చెప్పాడని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో హార్దిక్ పాండ్యా
వాయు కాలుష్యం నియంత్రణలో బీజింగ్ కన్నా దిల్లీ ఎందుకు వెనుకబడింది?
రాణీ కి వావ్: ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ఈ బావి దగ్గర ఫోటో ఎందుకు దిగారు? దీని కథేంటి?
వరల్డ్ కప్ ఫైనల్: పాలస్తీనా జెండాతో మైదానంలో కోహ్లీ వద్దకు దూసుకెళ్లిన ప్రేక్షకుడు
ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుండగా ఒక ప్రేక్షకుడు ‘ఫ్రీ పాలస్తీనా’
అని రాసి ఉన్న టీషర్టును ధరించి, పాలస్తీనా జెండాతో మైదానంలోకి చొచ్చుకుపోయారు.
క్రీజులో ఉన్న కోహ్లీ దగ్గరకు నేరుగా వెళ్లి కోహ్లీని పట్టుకున్నారు.
తర్వాత మైదానం సిబ్బంది వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు.
మ్యాచ్ మధ్యలో ఇలా ప్రేక్షకులు మైదానంలోకి వెళ్లడం తీవ్ర
భద్రతా లోపంగా పరిగణిస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో 2 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత్... ఆదుకున్న కోహ్లీ, రాహుల్ జోడీ
ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 81 పరుగుల వద్ద మూడో వికెట్
కోల్పోయింది.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ కష్టాల్లో పడినప్పుడు కోహ్లీ, రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు.
ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి
కష్టాల్లో పడినప్పుడు కోహ్లీ, రాహుల్ జోడీ ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను తీసుకుంది.
కోహ్లీ 85 పరుగులు, రాహుల్ అజేయంగా 97 పరుగులు చేశారు. వీరిద్దరూ
నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వరల్డ్ కప్ ఫైనల్‌కు బాలీవుడ్, క్రికెట్ సెలెబ్రిటీలు
ఫొటో సోర్స్, ANI
అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కఫ్ ఫైనల్ చూసేందుకు సెలెబ్రిటీలు నరేంద్ర మోదీ స్టేడియానికి వరుస కట్టారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియానికి వచ్చారు.
బాలీవుడ్ సెలెబ్రిటీ దంపతులు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ టీమిండియా జెర్సీలు ధరించి కనిపించారు.
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ చూడటానికి బీసీసీఐ కార్యదర్శి జైషా స్టేడియానికి చేరుకున్నారు.
కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
వరల్డ్ కప్ ఫైనల్ 2023: టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు.
మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఉత్తర్‌కాశి సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికుల్లో బయటికి తీసుకొస్తారనే నమ్మకం పోతోందా?
గంగూలీకి వేసిన ఆ బౌన్సర్లే షమీ కెరీర్‌ను మలుపు తిప్పాయి
ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ వ్యూహం అదేనా?
వరల్డ్ కప్ 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ ఏమన్నాడు?
ఫొటో సోర్స్, Getty Images
అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. శనివారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
వరల్డ్‌కప్ కోసం చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నామని, జట్టులోని ఆటగాళ్లందరికీ ఈ టోర్నీలో వారి రోల్ ఏంటనేది తెలుసని అన్నాడు.
“రెండేళ్ల ముందు నుంచే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాం. మొదట టీ20, ఆ తరువాత ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్.. ఈ మూడు ఫార్మాట్లకు ఎవరెవరు సరిపోతారో ముందే గుర్తించాం. ఆటగాళ్లకు వారు పోషించబోయే పాత్ర గురించి వివరించాం” అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఫైనల్ వరకు సాగిన తమ ప్రయాణం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, “ఫైనల్ వరకు చేరడమే తొలి ప్రాధాన్యం. ఇందుకోసం ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించాలో పూర్తి స్పష్టతతో పనిచేశాం. అంతా మేం అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. రేపు కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పాడు.
ఇరు జట్లు ఫైనల్ ఆడేందుకు అర్హత ఉన్న జట్లేనని రోహిత్ శర్మ అన్నాడు.
“ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు. అయితే ప్రత్యర్థి జట్టు ఏం చేస్తుందనేదానిపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా దృష్టంతా మా ప్రదర్శనపైనే ఉంది. మా ప్రణాళికలను అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం” అని టీమిండియా సారథి తెలిపాడు.