ఇంధన కొరతతో గాజాలో నిలిచిన ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ సేవలు

ఇంధనం కొరత కారణంగా గాజా స్ట్రిప్‌లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్ టవర్లు పనిచేయడానికి అవసరమైన జనరేటర్లు ఇంధనం లేక పనిచేయడం ఆగిపోయాయి.

లైవ్ కవరేజీ

  1. రోహిత్ శర్మ జర్నీ: 275 రూపాయల స్కాలర్‌షిప్‌ నుంచి ప్రపంచ కప్‌ దాకా..

  2. వరల్డ్ కప్ 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ ఏమన్నాడు?

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. శనివారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

    వరల్డ్‌కప్ కోసం చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నామని, జట్టులోని ఆటగాళ్లందరికీ ఈ టోర్నీలో వారి రోల్ ఏంటనేది తెలుసని అన్నాడు.

    “రెండేళ్ల ముందు నుంచే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాం. మొదట టీ20, ఆ తరువాత ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్.. ఈ మూడు ఫార్మాట్లకు ఎవరెవరు సరిపోతారో ముందే గుర్తించాం. ఆటగాళ్లకు వారు పోషించబోయే పాత్ర గురించి వివరించాం” అన్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఫైనల్ వరకు సాగిన తమ ప్రయాణం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, “ఫైనల్ వరకు చేరడమే తొలి ప్రాధాన్యం. ఇందుకోసం ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించాలో పూర్తి స్పష్టతతో పనిచేశాం. అంతా మేం అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. రేపు కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పాడు.

    ఇరు జట్లు ఫైనల్‌ ఆడేందుకు అర్హత ఉన్న జట్లేనని రోహిత్ శర్మ అన్నాడు.

    “ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు. అయితే ప్రత్యర్థి జట్టు ఏం చేస్తుందనేదానిపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా దృష్టంతా మా ప్రదర్శనపైనే ఉంది. మా ప్రణాళికలను అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం” అని టీమిండియా సారథి తెలిపాడు.

  3. వరల్డ్ కప్ 2023 ఫైనల్: అంపైర్లుగా రిచర్డ్ ఇలింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో

    క్రికెట్ వరల్డ్ కప్ 2023

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రిచర్డ్ ఇలింగ్ వర్త్

    యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగనుంది.

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ ఇలింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

    థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా క్రిస్ గాఫ్ఫానె, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌లను ఐసీసీ ఎంపిక చేసింది.

    చివరిసారిగా 2011లో వరల్డ్ కప్ సాధించిన భారత్, 2023 వరల్డ్ కప్‌ను గెల్చుకుని మూడో సారి ట్రోఫీని అందుకోవాలనే ఉత్సాహంతో ఉంది.

    అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రిచర్డ్ కెటిల్‌బరో
  4. ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

  5. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు నివేదించే బీబీసీ లైవ్ పేజీని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం కొత్త అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  6. వరల్డ్ కప్ ఫైనల్స్: అహ్మదాబాద్ పిచ్‌‌ చూసి ఆస్ట్రేలియా కెప్టెన్ ఏమన్నాడంటే?

    పాట్ కమిన్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్

    రేపు (ఆదివారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్స్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే పిచ్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈరోజు (శనివారం) చాలా సేపు పిచ్‌ని పరిశీలించాడు. మొబైల్ ఫోన్‌తో పిచ్‌కి చేరుకున్నాడు కమిన్స్. పిచ్ దగ్గర మొబైల్ వాడుతూ కనిపించాడు.

    పిచ్ గురించి ఆసీస్ కెప్టెన్ స్పందిస్తూ.. "నేను పిచ్‌ను మరీ అంతబాగా అంచనా వేయలేను, పిచ్‌పై ఇప్పుడే నీళ్లు చల్లారు. కాబట్టి 24 గంటల తర్వాత మళ్లీ వచ్చి చూస్తాం. ఇది మంచి పిచ్‌లాగే కనిపిస్తోంది'' అని తెలిపాడు .

    పిచ్ గురించి ఇంత చర్చ ఎందుకు?

    ముంబయిలో సెమీఫైనల్‌కు ముందు జరిగిన వివాదం కారణంగా ఫైనల్స్ పిచ్‌పై చర్చ జరుగుతోంది.

    చివరి క్షణంలో భారత్-న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ కోసం పిచ్ మారిందని ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్‌ తెలిపారు.

    ఇపుడు, ఫైనల్ మ్యాచ్ పిచ్‌పై ఆస్ట్రేలియా మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.

    పిచ్‌పై పాట్ కమిన్స్ ఆందోళన వ్యక్తం చేశాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాసంస్థ పేర్కొంది.

    పిచ్‌ పరిశీలించిన తర్వాత ఆసీస్ ఫైనల్స్‌లో ఆడబోయే జట్టును నిర్ణయిస్తుందని వార్తాపత్రిక పేర్కొంది.

  7. మహమ్మద్ షమీ: అమ్రోహాలో టెన్నిస్ బాల్‌తో ఆడిన 'సిమ్మీ' వరల్డ్ క్రికెట్ సెన్సేషన్‌గా ఎలా ఎదిగాడు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  8. మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణలు, మియన్మార్ నుంచి భారీ సంఖ్యలో వస్తున్న శరణార్థులు... అసలేం జరుగుతోంది?

  9. చాట్ జీపీటీ: సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారు... ఓపెన్ ఏఐలో ఏం జరుగుతోంది?

  10. మేకలు అడవుల్లో మంటలు చెలరేగకుండా చూసుకుంటాయా... ఎలా?

  11. చాట్ జీపీటీ: ఓపెన్ ఏఐ సీఈవో పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపు

    సామ్ ఆల్ట్‌మన్

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, సామ్ ఆల్ట్‌మన్

    చాట్ జీపీటీ సహ-వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో పదవి నుంచి తొలగిస్తూ ఓపెన్ ఏఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. చాట్ జీపీటీని తయారు చేయించిన కంపెనీ ఓపెన్ ఏఐ.

    కంపెనీ తాత్కాలిక సీఈఓగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటికి బాధ్యతలు అప్పగించింది బోర్డు.

    ఆల్ట్‌మన్ నాయకత్వ సామర్థ్యాలపై తమకు నమ్మకం లేదని బోర్డు పేర్కొంది. కంపెనీతో ఆల్ట్‌మన్ కమ్యూనికేషన్‌ స్పష్టంగా లేదని కూడా ఆరోపించింది.

    ఆల్ట్‌మన్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ కంపెనీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

    దీనిపై స్పందించిన ఆల్ట్‌మన్.. కంపెనీలో పనిచేయడాన్ని చాలా ఇష్టపడ్డానని తెలిపారు.

    "ఇది నా వ్యక్తిత్వాన్ని మార్చింది, ఇది ప్రపంచాన్ని కూడా కొద్దిగా మార్చిందనుకుంటున్నా. ఇక్కడ ప్రతిభావంతులైన వారితో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది'' అని ఎక్స్(ట్విటర్‌)లో స్పందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అంతేకాదు ఆల్ట్‌మన్‌‌ను తొలగించిన కొద్దిసేపటికే, ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడైన గ్రెగ్ బ్రోక్ మాన్‌ను కూడా బోర్డు నుంచి తొలగించారు. ఇది తెలిసి తాను ఆశ్చర్యపోయానని గ్రెగ్ ట్వీట్ చేశారు.

  12. భారత జైత్రయాత్ర వెనక రాహుల్ ద్రవిడ్ పాత్ర ఇదీ

  13. గాజా: ఇంధనం లేక నిలిచిన ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ సేవలు

    గాజాలో కొనసాగుతున్న ఘర్షణలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గాజాలో నిలిచిన మొబైల్ నెటవర్క్, ఇంటర్నెట్ సేవలు

    గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది.

    గాజాలోనే అతిపెద్ద అల్-షిఫా ఆసుపత్రిని ముట్టడించింది ఇజ్రాయెల్ సైన్యం.

    ఇదిలా ఉంటే, ఇంధన కొరతతో గాజా స్ట్రిప్‌లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్ సిగ్నల్ టవర్లకు విద్యుత్ సరఫరా అందించే జనరేటర్లు ఇంధనం లేక పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.

    తమ నెట్‌వర్క్‌లు పనిచేసేందుకు అవసరమైన ఇంధనం లేక, సేవలు నిలిచిపోయినట్లు టెలికాం సంస్థలైన పాల్టెల్, జవాల్‌ వెల్లడించాయి.

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే ఇంధన సరఫరా జరిగింది.

    ఈ సేవలు నిలిచిపోయిన కారణంగా మానవతా సాయానికి అడ్డంకి ఏర్పడుతోందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

    అయితే, రోజూ రెండు ఇంధన రవాణా వాహనాలను గాజాలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది.

    అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది.

  14. హలో,

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.