లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో గెలిస్తే ట్రోఫీతో పాటు పెద్ద మొత్తంలో నగదు బహుమతి కూడా లభిస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది.
ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలబడటం ఇది రెండోసారి.
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్‌లో ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఫైనల్‌లో గెలిస్తే ప్రపంచకప్ ట్రోఫీతో పాటు పెద్ద మొత్తంలో నగదు బహుమతి కూడా లభిస్తుంది.
ఈ టోర్నీ విజేతకు 40 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు 33 కోట్లు.
రన్నర్‌గా నిలిచే జట్టుకు 20 లక్షల అమెరికా డాలర్లు అంటే రూ.16.5 కోట్లు బహుమతిగా ఇస్తారు.
ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన అంటే సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు (న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా) రూ.6.66 కోట్లు ఇచ్చారు.
లీగ్ స్టేజ్ నుంచి వైదొలిగిన ఆరు జట్లకు రూ.83 లక్షల చొప్పున అందాయి.

ఫొటో సోర్స్, Getty Images
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17, శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
మధ్యప్రదేశ్ శాసన సభలోని మొత్తం 230 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ శాసనసభలో మొత్తం 90 స్థానాలు ఉండగా, 70 స్థానాలకు ఈ రోజు రెండో విడత కింద పోలింగ్ జరుగుతోంది. మొదటి విడత కింద 20 స్థానాల్లో నవంబరు 7న పోలింగ్ జరిగింది.
మధ్యప్రదేశ్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 7 గంటలకే ఓటింగ్ మొదలైంది. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ బుద్ని నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఛింద్వారా నుంచి బరిలో ఉన్నారు.
దిమనీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, దతియా నుంచి మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ నర్సింగ్‌పూర్ నుంచి, బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ ఇందోర్ - 1 అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ దుర్గ్ జిల్లాలోని పాటన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.