క్రికెట్ వరల్డ్ కప్: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా... సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి

క్రికెట్ ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసింది. తరువాత చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచింది. వచ్చే ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. వరల్డ్ కప్: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా... సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి

    ఆస్ట్రేలియా జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియా జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.

    సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

    ఇప్పటివరకు అందరికంటే ఎక్కువగా అయిదుసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

    కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    213 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది.

    ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి లక్ష్యఛేదనలో జట్టుకు శుభారంభాన్ని అందించారు.

    మిచెల్ మార్ష్ డకౌట్ కాగా, స్టీవెన్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు) వికెట్‌కు ప్రాధాన్యమిస్తూ నెమ్మదిగా ఆడాడు.

    మార్నస్ లబుషేన్ 18 పరుగులు చేసి అవుటయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు.

    చివర్లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (38 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు), ప్యాట్ కమిన్స్ ( 29 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) విలువైన పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

    అంతకుముందు టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసింది. 24 పరుగులకే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    హెన్రిచ్ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు.

    ముఖ్యంగా మిల్లర్ పరుగులు సాధించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. దీంతో జట్టు స్కోరు 200 దాటింది.

  3. సువర్ణదుర్గ్: అరేబియా సముద్రంలోని ఈ శివాజీ కోటపై బ్రిటిషర్లు ఎందుకు కన్నేశారు?

  4. గాజా: అల్-షిఫా హాస్పిటల్‌లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?

  5. క్రికెట్ ప్రపంచకప్: 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌‌కు దిగిన ఆస్ట్రేలియా

    దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ప్రపంచకప్ రెండో సెమీస్‌ను ఆడుతున్నాయి.

    టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో ఆలౌట్ అయి 212 పరుగుల స్కోరును నమోదు చేసింది.

    దీంతో, 213 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగింది.

    ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు డేవిడ్ మిల్లర్ సెంచరీ చేశాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేశాడు డేవిడ్ మిల్లర్.

    అయితే, దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ను చాలా పేలవంగా ప్రారంభించింది. కేవలం 24 పరుగుల్లోనే 4 వికెట్లను కోల్పోయింది.

    ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా డకౌట్ అయిన పెవిలియన్‌కు చేరాడు.

    పవర్‌ప్లే సమయానికి దక్షిణాఫ్రికా కేవలం 18 పరుగులే చేసింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది.

    కోల్‌కతాలో వర్షం పడటంతో మ్యాచ్‌ను కొద్దిసేపు ఆపారు.

    హెన్రీ క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌లు కలిసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. హెన్రీ క్లాసెన్ ఈ మ్యాచ్‌లో 48 బంతులకు 47 పరుగులు చేశాడు.

    మిల్లర్, క్లాసెన్ కాకుండా.. మరే దక్షిణాఫ్రికా బ్యాటర్ కూడా 20కి మించి పరుగులు చేయలేదు.

    48.5 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా జట్టు ఆల్ అవుట్ అయిపోయింది.

  6. జో బైడెన్, షీ జిన్‌పింగ్ సమావేశం గురించి మీరు తెలుసుకోవాల్సిన నాలుగు ముఖ్యాంశాలు...

  7. తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవ కోసం ఉపయోగించే టన్నుల కొద్దీ పూలను వాడిపోయాక ఏం చేస్తారు?

  8. ఉత్తరాఖండ్: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొత్త డ్రిల్లింగ్ మెషిన్

    ఉత్తరకాశీ
    ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న సహాయక చర్యలు

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి జాతీయ రవహదారిపై నిర్మిస్తున్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఆదివారం జరిగిన ఈ ఘటనలో 40 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.

    అంతకుముందు వినియోగించిన డ్రిల్లింగ్ మెషిన్ పనిచేయకపోవడంతో, కొత్త యంత్రాన్ని దిల్లీ నుంచి తెప్పిస్తున్నారు. మిలిటరీ విమానంలో మెషిన్‌ను మూడు విడి భాగాలుగా ప్రమాద స్థలానికి తరలిస్తున్నారు. అక్కడే మెషిన్‌ను అసెంబుల్ చేసి, పనులు మొదలుపెడతారు.

    ఆ మెషిన్ గంటలకు ఐదు మీటర్ల చొప్పున డ్రిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నదని నిపుణులు అంటున్నారు.

    యుమునోత్రి
    ఫొటో క్యాప్షన్, కొత్త డ్రిల్లింగ్ మెషిన్‌తో సహాయక చర్యలు వేగవంతమవుతాయని ఆశిస్తున్న అధికారులు

    కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

    పైప్‌‌లైన్ ద్వారా వారికి ఆక్సిజన్, ఆహారం పంపిస్తున్నామని, వాకీ-టాకీలతో మాట్లాడుతున్నామని తెలిపారు.

    అయితే, లోపల చిక్కుకున్న తమ వారి ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో కొంతమంది తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

    దీనిపై బీబీసీ అధికారులను సంప్రదించగా, వాటిని తోసిపుచ్చారు. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ‘షమీ ఫెరారీ లాంటి వాడు... స్పీడ్ తగ్గేదేలేదు’ అన్నది నిజమైందా?

  10. 30 వేల అడుగుల ఎత్తులో గుర్రం గందరగోళం, వెనుదిరిగిన బోయింగ్ విమానం

  11. ‘విరాట్ GOAT’.. ‘షమీ ఫైనల్’ ఈ రెండు పదాలూ సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి?

  12. జో బైడెన్, జిన్‌పింగ్ ఏం చర్చించారంటే..

    జిన్‌పింగ్, జో బైడెన్ సమావేశం

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైనిక సంబంధాలు కొనసాగించేందుకు ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.

    ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (ఏపీఈసీ) సదస్సులో భాగంగా ఇరుదేశాల అధినేతల సమావేశం జరిగింది. కొంత కాలంగా అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.

    భేటీ అనంతరం బైడెన్ 20 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడారు.

    అమెరికా, చైనా మధ్య సైనిక సంబంధాలు తిరిగి కొనసాగుతాయని బైడెన్ తెలిపారు. జిన్‌పింగ్‌తో నేరుగా సంబంధాలు కొనసాగించనున్నట్లు చెప్పారు. అమెరికాలోకి ఫెంటానిల్ ఉత్పత్తుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఇరుదేశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తాయని చెప్పారు.

    ఈ భేటీలో యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులపై చర్చించారు. అమెరికా, చైనా మధ్య ఉన్న పోటీతత్వం వివాదంగా మారకూడదని జో బైడెన్ అన్నారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.