వరల్డ్ కప్ INDvsNZ: చెలరేగిన భారత్ బ్యాటర్లు, సెంచరీలు చేసిన కోహ్లీ, అయ్యర్... న్యూజీలాండ్ టార్గెట్ 398
వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 50 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.
లైవ్ కవరేజీ
విరాట్ కోహ్లీ: వన్డే క్రికెట్‌లో 50 సెంచరీల వరల్డ్ రికార్డ్.. ఇప్పట్లో ఎవరైనా బ్రేక్ చేయగలరా?
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత్... న్యూజీలాండ్‌పై ఘన విజయం, 7 వికెట్లు పడగొట్టిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

ఫొటో సోర్స్, gettyimages
వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఫైనల్‌కు చేరింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజీలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యం 398 పరుగులను చేధించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన న్యూజీలాండ్ జట్టు 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్ మహ్మద్ షమీ చెలరేగడంతో కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు వెనుతిరగాల్సి వచ్చింది.
119 బంతుల్లో 134 పరుగులు చేసి చివరి వరకు పోరాడుతూ వచ్చిన డారిల్ మిచెల్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా మహ్మద్ షమీ ఏడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మహ్మద్ షమీని ప్రకటించారు.
కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు బ్యాటర్లు చెలరేగి ఆడారు. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105)లు సెంచరీలు చేసి న్యూజీలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 50 సెంచరీలు చేసి వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ తిరగరాశాడు.
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్ జట్టు దూకుడుగానే ఆడుతూ వచ్చింది.
ఈ గెలుపుతో 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
దీంతో భారత్ ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో తన విజయ పర్వాన్ని కొనసాగించింది. వరుసగా పదో మ్యాచ్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచకప్ సెమీ ఫైనల్: మిచెల్ సెంచరీ.. నాలుగు వికెట్లు తీసిన షమీ

ఫొటో సోర్స్, gettyimages
ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
డారిల్ మిచెల్ 85 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ చేశాడు.
కేన్ విలియమ్సన్ 69 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ లాథమ్ ఎల్‌బీడబ్ల్యూతో వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లను వరుసగా భారత బౌలర్ మహ్మద్ షమీ తీశాడు.
దీంతో ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ నాలుగో వికెట్లు తీసినట్టయింది.
ప్రస్తుత న్యూజీలాండ్ స్కోరు 32.4 ఓవర్లలో 220 పరుగులను చేరుకుంది.
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే న్యూజీలాండ్ జట్టు 17.2 ఓవర్లలో 178 పరుగులు చేయాల్సి ఉంది.
'క్రికెట్ అంటే ఆనందం, ఆరోగ్యం...' ఇలాంటి మహిళల క్రికెట్ క్లబ్‌ను మీరెక్కడైనా చూశారా?
‘ఆ ఇద్దరి ముందు ఈ ఘనత సాధించడం నాకు చాలా స్పెషల్’ – విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images
తాను అత్యంత ఎక్కువగా ప్రేమించే అనుష్క శర్మ ముందు, తన హీరో సచిన్ టెండూల్కర్ ఎదుట 50వ సెంచరీ రికార్డును సాధించడం చాలా ప్రత్యేకమని విరాట్ కోహ్లీ అన్నారు.
‘‘ఇది నా కల, ఇప్పుడు నిజమైంది’’ అని కోహ్లీ చెప్పారు.
‘‘అత్యున్నతమైన వ్యక్తి(సచిన్ టెండూల్కర్) నన్ను అభినందించారు. ఇది నాకు కలలాంటిది. మనకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. జట్టు విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యమైన విషయం. ఈ టోర్నమెంట్‌లో నా పాత్రను పోషించాను. ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాను’’ అని కోహ్లీ చెప్పారు.
వరల్డ్ కప్ INDvsNZ: చెలరేగిన భారత బ్యాటర్లు, సెంచరీలు చేసిన కోహ్లీ, అయ్యర్... న్యూజీలాండ్ టార్గెట్ 398

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. 50 ఓవర్లలో భారత క్రికెట్ జట్టు 397 పరుగులు చేసి, న్యూజీలాండ్‌కు 398 పరుగులను టార్గెట్ ఇచ్చింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేసింది.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 50వ సెంచరీ చేయడంతో ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనతను సాధించాడు.
శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి 70 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటయ్యాడు.
శుభమన్ గిల్ కూడా మూడు సిక్సర్లు, 8 ఫోర్లతో 66 బంతుల్లో 80 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తన పేరుపై ప్రత్యేక రికార్డును సంపాదించుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. ప్రపంచకప్‌లలో 35 మ్యాచ్‌లలో క్రిస్ గేల్ 49 సిక్సులు కొట్టాడు.
IND vs NZ: శ్రేయస్ అయ్యర్ సెంచరీ, 67 బంతుల్లో వంద పరుగులు

ఫొటో సోర్స్, gettyimages
న్యూజీలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నాడు.
8 సిక్సులు, 3 ఫోర్లతో 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు అయ్యర్.
వన్డేల్లో 50వ పూర్తి చేసిన కొద్ది సేపట్లోనే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మైదానం నుంచి వెనుతిరిగినప్పుడు వాంఖడే స్టేడియం అంతా నిల్చుని కోహ్లీకి అభివాదం చేసింది.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. దీనిలో 9 ఫోర్లు, రెండు సిక్సులున్నాయి.
విరాట్ కోహ్లీ: వన్డే క్రికెట్ చరిత్రలో 50వ సెంచరీ చరిత్ర సృష్టించిన కోహ్లీ... సచిన్ రికార్డ్ బ్రేక్

ఫొటో సోర్స్, Getty Images
వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లి అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. న్యూజీలాండ్‌తో వరల్డ్ కప్ సెమీస్‌లో సెంచరీ చేసిన కోహ్లీ 50 సెంచరీలతో సచిన్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.
వన్డే చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు సాధించాడు.
సెంచరీ తర్వాత స్టాండ్స్‌లో కూర్చున్న సచిన్‌కు అభివాదం చేసి సంబరాలు చేసుకున్నాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 43.5 ఓవర్లలో 327 పరుగుల వద్ద ఉంది.
తెలంగాణ ఎన్నికలు: గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరాయా... వలసలు తగ్గాయా?
ప్రపంచకప్: సచిన్ మరో రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, gettyimages
ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజీలాండ్‌తో తలపడుతున్న భారత జట్టు 35 ఓవర్లు పూర్తయ్యేప్పటికి 248 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి 80 పరుగులతో క్రీజ్ వద్ద ఉన్నాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సు కొట్టిన కోహ్లీ ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును తిరగరాశాడు.
సచిన్ 2003 ప్రపంచ కప్‌లో 673 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతేకాకుండా, ఒక వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో సచిన్, బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్ పేర్ల మీద ఉంది. వీరిద్దరూ ఒక వరల్డ్ కప్ టోర్నీలో 7 హాఫ్ సెంచరీలు చేశారు.
ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ 8 హాఫ్ సెంచరీలు పూర్తి చేసినట్లయింది. కోహ్లీతో పాటు క్రీజ్ వద్ద ఉన్న 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
సెంచరీకి చేరువగా ఉన్న సమయంలో కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
అప్పటికి గిల్ 65 బంతులలో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగుల చేశాడు.
ప్రపంచకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 47 పరుగుల వద్ద రోహిత్ ఔట్

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజీలాండ్‌ల మధ్య జరుగుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ జట్టు 25 ఓవర్లకు 178 పరుగులను పూర్తి చేసింది.
అర్థ శతకం పూర్తి చేసిన శుభ్‌మన్ గిల్, రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో మైదానం నుంచి బయటికి వచ్చాడు.
విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగులకు అవుట్ అయ్యాడు.
ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తన పేరుపై ప్రత్యేక రికార్డును సంపాదించుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. ప్రపంచకప్‌లలో 35 మ్యాచ్‌లలో క్రిస్ గేల్ 49 సిక్సులు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ, క్రిస్ గేల్ రికార్డును దాటేశాడు.
ఆస్పత్రి దగ్గర 'బండకింద హమాస్ సొరంగం'.. మరో ఆసుపత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం
వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్- న్యూజీలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో మొదలుకానుంది.
టాస్ గెల్చుకున్న భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సుబ్రతా రాయ్: ఖరీదైన జీవనశైలి, 127 ట్రక్కుల్లో పత్రాలను సెబీకి పంపిన వ్యాపారవేత్త
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల స్నేహితుల ఆందోళన

ఫొటో సోర్స్, Asif Ali
ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగంలో కార్మికులు చిక్కుకుని 70 గంటలు దాటింది.
దీంతో ఇప్పటి దాకా వారిని అధికారులు కాపాడలేదంటూ.. ఆ కార్మికుల స్నేహితులు, వారితోపాటు పనిచేసిన మిగతా కార్మికులు సొరంగం బయట నిరసనకు దిగారు.
పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని అధికారులు అంటున్నారు.
నా బాయ్‌ఫ్రెండ్ కోసం నా పిరుదులు పెద్దవి చేయించుకున్నాను.. కానీ ఏళ్ళ తరబడి నరకం అనుభవించాను
దిల్లీ: కాలుష్యంతో విషపూరితమైన గాలిని కృత్రిమ వర్షంతో శుభ్రం చేయవచ్చా?
ఆంధ్రప్రదేశ్ - వరికపూడిశెల ప్రాజెక్ట్: ముగ్గురు సీఎంలు.. నాలుగు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్టు కథేంటి?
