వరల్డ్ కప్ 2023: దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం, భారత్‌కు వరసగా ఎనిమిదో గెలుపు

దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్కో జాన్సెస్ ఒక్కడే అత్యధికంగా 14 పరుగులు చేశాడు.

లైవ్ కవరేజీ

  1. విరాట్ కోహ్లీ: తండ్రి మరణం, అదే సమయంలో రంజీ మ్యాచ్.. అప్పుడు విరాట్ ఏం చేశాడంటే..

  2. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి, దీనిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

  3. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  4. వరల్డ్ కప్ 2023: దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం, భారత్‌కు వరసగా ఎనిమిదో గెలుపు

    వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, Getty Images

    కోల్‌కతాలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ‌లో భారత జట్టు సౌతాఫ్రికాను 243 పరుగుల తేడాతో ఓడించింది.

    327 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు, భారత్ బౌలింగ్ ధాటికి పేకమేడలా కుప్పకూలింది

    83 పరుగులకే ఆలౌటై భారత్‌కు భారీ విజయాన్ని అందించింది.

    రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా లైనప్‌ను దెబ్బతీశాడు.

    మహమ్మద్ షమీ, కుల్దీప్‌ యాదవ్‌లో చెరో రెండు వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    భారత్, సౌతాఫ్రికా

    ఫొటో సోర్స్, Getty Images

    దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్కో జాన్సెస్ ఒక్కడే అత్యధికంగా 14 పరుగులు చేశాడు. వాన్ డెర్ డ్యూసెన్ 13, డేవిడ్ మిల్లర్, టెంబా బావుమా చెరో 11 పరుగులు చేశారు.

    భారత బౌలర్లు 27.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. తాయ్ చీ: పార్కిన్సన్ అనే భయంకరమైన మెదడు వ్యాధిని ఈ ఆర్ట్ నయం చేస్తుందా?

  6. వరల్డ్ కప్ 2023: సచిన్ ప్రపంచ రికార్డ్‌ను సమం చేసిన విరాట్ కోహ్లీ

    విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    కోల్‌కతా వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీల ప్రపంచ రికార్డ్‌ను సమం చేశాడు.

    వన్డే ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా సచిన్ నెలకొల్పిన రికార్డు‌ను ఆయన చేరుకున్నాడు.

    ఇప్పటివరకు 48 సెంచరీలు చేసిన విరాట్, ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 49వ సెంచరీ పూర్తి చేశాడు.

    మరొక్క సెంచరీ చేస్తే, వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డులకెక్కుతాడు.

    ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారతజట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. కేసీఆర్ 'ప్రగతిపథం' వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

    ప్రగతిపథం ప్రచార వాహనం

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో తనిఖీలు

    తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణించిన ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు వచ్చారు కేసీఆర్.

    ఈ నేపథ్యంలో వాహనాన్ని ఎన్నికల ఆధికారులు తనిఖీ చేశారు.

    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
    తెలంగాణ సీఎం కేసీఆర్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, కేసీఆర్ ప్రయాణించిన వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఎన్నికల కమిషన్ అధికారులు
  8. ఇత్సాక్ రాబిన్: ఈ ఇజ్రాయెల్ ప్రధాని హత్య జరగకపోతే పాలస్తీనా చరిత్ర మరోలా ఉండేదా?

  9. ప్రెషర్ కుక్కర్ పేలకూడదంటే పాటించాల్సిన 9 జాగ్రత్తలు

  10. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా: సమ ఉజ్జీల సమరంలో నెగ్గేదెవరు? ఏ జట్టు ‘టెన్షన్’ ఏమిటి?

  11. ‘ఈసీ’ కోళ్లఫారాలు ఎలా పెడతారు? ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుందా?

  12. జర్మనీ: హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగంతకుడి కాల్పులు, విమానాల రాకపోకలు నిలిపివేత

    జర్మనీ

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

    జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం రాత్రి ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. భద్రతా కారణాల దృష్టా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేశాడు.

    విమానాశ్రయం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగంతకుడు ఎయిర్‌పోర్టులోనే ఉండటంతో గేట్లు మూసివేశారు.

    ఆగంతకుడు కారులో అక్కడికి వచ్చాడని, భద్రతను దాటుకుని టెర్మినల్ 1 వైపు దూసుకొచ్చాడని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది. అనంతరం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఏరియాలోకి చేరుకున్నాడని జర్మనీ మీడియాను ఉటంకిస్తూ తెలిపింది.

    అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కారులో అతని కూతురు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

    తన కూతురు కనిపించడం లేదని ఇప్పటికే 'నిందితుడి భార్య' ఫిర్యాదు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.