వరల్డ్ కప్ 2023: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజీలాండ్‌పై పాక్ విజయం

మ్యాచ్‌ను కుదించి 41 ఓవర్లుగా నిర్వహించారు. వర్షం ఆగిన తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌కు 25.3 ఓవర్ వద్ద మరోసారి వర్షంతో ఆటంకం ఏర్పడింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. వరల్డ్ కప్ 2023: రెండుసార్లు అడ్డొచ్చిన వర్షం..డీఎల్‌ఎస్‌తో న్యూజీలాండ్‌పై పాక్ విజయం

    పాకిస్తాన్ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, డీఎల్ఎస్ ప్రకారం విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టు

    శనివారం బెంగళూరులో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. న్యూజీలాండ్‌పై పాకిస్తాన్ విజేతగా నిలిచింది.

    న్యూజీలాండ్ జట్టు 401 పరుగులు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.

    టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

    బ్యాటింగ్ చేపట్టిన న్యూజీలాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 108 పరుగులు, కేన్ విలియంసన్ 95 పరుగులతో జట్టు భారీ స్కోర్ చేయడంలో తోడ్పడ్డారు.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. 21 ఓవర్ వద్ద ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది.

    మ్యాచ్‌ను కుదించి 41 ఓవర్లుగా నిర్వహించారు. వర్షం ఆగిన తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌కు 25.3 ఓవర్ వద్ద మరోసారి వర్షంతో ఆటంకం ఏర్పడింది.

    అప్పటికే ఫకార్ జమాన్ 126 పరుగులు సాధించాడు. జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 200 పరుగుల వద్ద ఉంది.

    డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ జట్టు 21 పరుగులు ముందు ఉండటంతో పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు.

  3. గాజా: అంబులెన్స్‌ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి, 15మంది చనిపోయారన్న పాలస్తీనా రెడ్ క్రెసెంట్

  4. ఫేక్‌ న్యూస్: కరణ్ థాపర్‌‌‌ ఇంటర్వ్యూ కథనం నిజం కాదు...ప్రకటించిన బీబీసీ

  5. మేడిగడ్డ బరాజ్: డ్యామ్ సేఫ్టీ నివేదిక‌లో ఏముంది, ప్రభుత్వ వాదనేంటి?

  6. ఆంధ్రప్రదేశ్: మద్యం అమ్మకాల పేరుతో ప్రభుత్వం కొందరికి మేలు చేస్తోందా, రూ. వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయా?

  7. పాకిస్తాన్ వైమానిక శిక్షణ స్థావరంపై ఉగ్రవాదుల దాడి

    పాకిస్తాన్

    ఫొటో సోర్స్, ANI

    పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 'మియాన్వాలీ శిక్షణా ఎయిర్‌బేస్‌'పై టెర్రరిస్ట్ దాడి జరిగిందని పాక్ సైన్యానికి చెందిన పబ్లిక్ రిలేషన్స్ విభాగం (ఐఎస్పీఆర్) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

    "నవంబర్ 4 ఉదయం మియాన్వాలీ శిక్షణా ఎయిర్‌బేస్‌పై టెర్రరిస్ట్ దాడి జరిగింది, ఆ దాడిని సైన్యం తిప్పికొట్టింది" అని ఐఎస్పీఆర్ ప్రకటించింది.

    ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వీరిలో ముగ్గురిని వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపే మట్టుబెట్టామని, మిగిలిన ముగ్గురిని సైన్యం సకాలంలో చుట్టుముట్టిందని తెలిపింది.

    ఈ దాడిలో ఎయిర్‌బేస్‌లో పార్క్ చేసిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. మీ ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేస్తే గుర్తించడమెలా?

  9. విషపూరిత పుట్టగొడుగులతో ఆహారం వండి పెట్టి అత్తామామలను చంపేశారంటూ మహిళపై కేసు.. భర్త హత్యకూ యత్నించారని అభియోగం

  10. వరల్డ్‌కప్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్, జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ

    హార్దిక్ పాండ్యా

    ఫొటో సోర్స్, ANI

    ప్రపంచ కప్ 2023 నుంచి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైదొలిగాడు.

    గత నెల్లో పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు హార్దిక్ ఎడమ చీలమండకు గాయమైంది. ఆ గాయం నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేదు.

    దీంతో హార్దిక్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడానికి అనుమతి కోరుతూ ఐసీసీకి టీమిండియా ప్రతిపాదన పంపింది.

    టెక్నికల్ కమిటీ ఆమోదం అనంతరం ఇందుకు ఆమోదం తెలుపుతున్నట్లు ఐసీసీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

    ప్రపంచ కప్‌లో మిగతా మ్యాచులకు తాను దూరమవుతున్నాననే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగానే ఉందని హార్దిక్ పాండ్యా ఎక్స్(ట్విటర్)లో చెప్పారు.

    కుడిచేతి వాటం పేసర్ అయిన ప్రసిద్ధ్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 33 వికెట్లు తీశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. గాజా ఆరోగ్యశాఖ: అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

    అంబులెన్సులు

    ఫొటో సోర్స్, Getty Images

    గాజాలోని అంబులెన్స్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ శుక్రవారం వైమానిక దాడులు చేసిందని, ఇందులో 13 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    దీంతో ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. హమాస్ అంబులెన్స్‌ను సెల్‌గా ఉపయోగిస్తోందని, దానిలో కూర్చుని తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆరోపించింది.

    ఇది 'యుద్ధ ప్రాంతం' అని చెబుతూనే ఉన్నామని, పౌరులు తమ భద్రత కోసం దక్షిణం వైపునకు వెళ్లాలని పదేపదే సూచించామని తెలిపింది.

    ప్రస్తుతం గాజాలో ఏ ప్రదేశమూ సురక్షితంగా లేదని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ (UNRWA)లో పాలస్తీనా శరణార్థుల వ్యవహారాల డైరెక్టర్ థామస్ వైట్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి