ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.
నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. టీడీపీ సీనియర్ నేతలు, బాలకృ,ష్ణ, బ్రాహ్మణి తదితరులు ఆయనను రిసీవ్ చేసుకున్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, TDP/FB
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 52 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ హైకోర్టు చంద్రబాబుకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత సాయంత్రం 4:15 గంటల సమయంలో చంద్రబాబు బయటికి వచ్చారు.

ఫొటో సోర్స్, TDP/FB
ఆయనను రిసీవ్ చేసుకోవడానికి జైలు వద్దకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి తదితరులు వచ్చారు.
కాగా, విడుదలైన వెంటనే జైలు బయట చంద్రబాబు మాట్లాడారు.
''నా కోసం రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం ప్రకటించడం, అభిమానం చూపించడం మర్చిపోలేను. నా జీవితం ధన్యమైంది. 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ఏ తప్పూ చెయ్యలేదు. చెయ్యనివ్వను. తెలుగువారందరికీ ధన్యవాదాలు. సంఘీభావాన్ని తెలియజేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా జనసేన, పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇది షరతులతో కూడిన బెయిల్.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్టయిన ఆయన 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు అక్టోబరు 30న విచారణ ముగించి, తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది.
మధ్యంతర బెయిలుతో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట దక్కింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ కేసులు, తాజాగా నమోదైన మద్యం కేసు కూడా ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది.
(గమనిక: ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.)

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించడమంటే హమాస్‌కు లొంగిపోవడంతో సమానమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌తో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
బైబిల్ సూక్తిని ఉటంకిస్తూ శాంతికి, యుద్ధానికి ఒక సమయం ఉంటుందని, ఇది యుద్ధానికి సమయమని ఆయన వ్యాఖ్యానించారు. "పెరల్ హార్బర్‌పై బాంబు దాడి, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఎలాగైతే అమెరికా కాల్పుల విరమణకు సిద్ధంగా లేదో అలాగే అక్టోబర్ 7 దాడి తర్వాత హమాస్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు" అని ఆయన అన్నారు.
కాల్పుల విమరణకు రావాల్సిందిగా ఇరుపక్షాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అభ్యర్ధించింది. కాల్పుల విరమణ లేకపోతే గాజాలో ప్రజలకు సహాయం అందించడం కష్టంగా మారుతుందని భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థలు కోరాయి.
‘‘గాజాలో సురక్షితమైన ప్రదేశమే లేదు’’ అని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అధినేత ఫిలిప్పే లజ్జారిని అన్నారు. వరస బాంబు దాడుల కారణంగా అనేక మంది బలవంతంగా తమ ప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు.
గాజాలో యుద్ధం ప్రారంభమైన మూడు వారాల్లో 3,200 మంది చిన్నారులు మరణించారని ఫిలిప్పే వెల్లడించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.