కత్తిపోటుకు గురైన దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించిన కేసీఆర్

ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. కత్తిపోటుకు గురైన దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించిన కేసీఆర్

    కొత్త ప్రభాకర్ రెడ్డి

    దుబ్బాక నియోజకవర్గంలో కత్తిపోటుకు గురైన దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

    ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు సీఎం సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు .

    ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో దెబ్బతిన్న పేగు భాగాన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఐసీయూలోసర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, క్రిటికల్ కేర్ తదితర నిపుణులతో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు యశోదా హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.

  3. పసిఫిక్ మహాసముద్రంలో 38 రోజులు ఒక చిన్న తెప్ప మీద ఆ కుటుంబం ప్రాణాలు ఎలా కాపాడుకుంది?

  4. ఖరీదైన స్కూల్‌లో యువతి హత్య... బాత్రూమ్‌లో శవమైన కనిపించిన పోలో కోచ్

  5. గాజా: ‘ఆకలితో ఉన్నాం... మాకు మరో దారి లేదు’

  6. గాజా ఆస్పత్రులలో వందల మంది పేషెంట్లు చిక్కుకున్నారన్న యూఎన్

    ఆస్పత్రి గాజా

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఉత్తర గాజాలోని అల్-ఖడ్స్ ఆస్పత్రి

    ఉత్తర గాజాలోని ఆస్పత్రులలో వందల మంది రోగులు చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వారికి చికిత్స అందే పరిస్థితి లేదు, ఎక్కడికీ తరలించే వెసలుబాటు అసలే లేదని యూఎన్ వెల్లడించింది. పాలస్తీనా శరణార్ధుల యూఎన్ ఏజెన్సీ హెడ్ టామ్ వైట్ ఈ వివరాలు తెలిపారు.

    ఉత్తర గాజాలోని అల్-ఖడ్స్ వంటి ఆస్పత్రుల నుంచి పేషెంట్లను తరలించడం సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికే డాక్టర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రకటించాయి. అదే విషయాన్ని టామ్ వైట్ ధ్రువీకరించారు.

    ఆస్పత్రిని ఖాళీ చేయాలని ఆదివారం నాడు ఇజ్రాయెల్ తమకు సూచించిందని, ఆ సమీపంలో దాడులు కొనసాగుతున్నాయని తెలిపిందని పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్ తెలిపింది.

    కానీ, రోగులను తరలించే పరిస్థితి లేదని ఈ సంస్థలు చెబుతున్నాయి. "చాలా మంది ప్రజలు యూన్ఆర్‌డబ్ల్యుఏ పాఠశాలల్లో ఆశ్రయం కోరుతున్నారు. ఆలాగే, ఆస్పత్రులలో షెల్టర్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈ వారం నేను ఒక ఆస్పత్రిలోకి వెళ్ళి చూశాను. అందులో వందలాది రోగులు ఉన్నారు. వారిని తరలించడం సాధ్యమయ్యే పని కాదు" అని వైట్ అన్నారు.

    "ప్రజలు ఆకలితో, దాహంతో అల్లాడుతున్నారు. భయంతో వణికిపోతున్నారు చాలా మంది బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు. వారికి ఆహారం ఎప్పటికివ్వగలం" కూడా వైట్ ప్రశ్నించారు.

  7. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    కొత్తపేట ప్రభాకర్ రెడ్డి

    ఫొటో సోర్స్, X/Kotha Prabhakar Reddy

    మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ప్రభాకర రెడ్డిపై దాడి జరిగింది.

    గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించి బయటకు రాగానే, రాజు అనే వ్యక్తి హ్యాండ్ షేక్ ఇస్తున్నట్టుగా దగ్గరకు వచ్చి ఎంపీని కత్తితో పొట్టలో పొడిచారు.

    వెంటనే ఎంపీ అనుచరులు, సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.

    మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కారులో ఆస్పత్రికి తరలించారు

    ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచిన రాజుపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    దాడి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు ఫోన్‌ చేసి ప్రభాకర్‌ రెడ్డిని పరామర్శించారు.

    ప్రభాకర్ బీఆర్ఎస్ తరపున మెదక్ ఎంపీగా రెండుసార్లు ఎన్నికయ్యారు.ఇప్పుడు దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు.

  8. నేను ఏ క్రికెటర్‌కూ రివార్డు ఇస్తాననలేదు: రతన్ టాటా

    రతన్ టాటా

    ఫొటో సోర్స్, ANI

    అఫ్గానిస్తాన్ క్రికెటర్‌ రషీద్ ఖాన్‌కు టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా రూ.10 కోట్ల రివార్డు ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.

    ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    ఏ క్రికెటర్‌కీ రివార్డు లేదా జరిమానా గురించి ఐసీసీ లేదా మరే క్రికెట్ సంస్థకు తానేమీ చెప్పలేదని రతన్ టాటా చెప్పారు. క్రికెట్‌తో తనకెలాంటి సంబంధమూ లేదన్నారు.

    తన అధికారిక ఖాతాల నుంచి వస్తే మినహా వాట్సాప్‌లో వస్తున్న వీడియోలు, సమాచారాన్ని విశ్వసించొద్దని ఆయన కోరారు.

    వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన అఫ్గానిస్తాన్ జట్టు సభ్యుడైన రషీద్ ఖాన్‌కు పది కోట్ల రూపాయలు ఇస్తానని రతన్ టాటా హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఎలక్టోరల్ బాండ్స్: పార్టీల విరాళాల సమాచారం అడిగే హక్కు పౌరులకు లేదన్న కేంద్రం

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పేర్కొన్నారని లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.

    రాజకీయ పార్టీల విరాళాల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) అదే చెబుతోందని ఆయన తెలిపారు.

    ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో రాజకీయ పార్టీల విరాళాల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలను ఆయన ఖండించారు.

    ''ఎలాంటి పరిమితులు లేకుండా ఏదైనా తెలుసుకోవచ్చు అనుకోవడం సాధారణ హక్కు కాబోదు. అలాగే, అవసరమైన సమాచారం గురించి తెలుసుకోవడానికి నిర్దిష్ట లక్ష్యాలు లేదా ప్రయోజనాలు ఉంటాయి. అవి లేకపోతే అది హక్కు కాబోదు'' అని ఏజీ పేర్కొన్నారు.

    అభ్యర్థుల నేరచరిత్ర పూర్వాపరాలను పౌరులు తెలుసుకోవడాన్ని సమర్థిస్తూ వచ్చిన తీర్పులు పార్టీల విరాళాల సమాచారాన్ని తెలుసుకునే హక్కునేమీ కల్పించడం లేదని ఏజీ అందులో చెప్పారు. ఈ తీర్పులను బట్టి చట్టప్రకారం పౌరులకు ఏ సమాచారమైనా తెలుసుకునే హక్కు ఉందని చెప్పలేమని ఆయన అందులో పేర్కొన్నారు.

    ఎలక్టోరల్ బాండ్ల పథకానికి మార్గం సుగమం చేస్తూ ఫైనాన్స్ యాక్ట్ 2017 ద్వారా ప్రవేశపెట్టిన సవరణలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 31న ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.

  10. జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?

  11. కోచి: ‘జెహోవా విట్‌నెస్‌’ అంటే ఎవరు... జంట పేలుళ్లకు తానే బాధ్యుడినన్న మార్టిన్ వీడియోలో ఏముంది?

  12. తెలంగాణ ఎన్నికలు: పాతబస్తీలో హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్క హిందూ నాయకుడు

  13. విజయనగరం రైలు ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య, అసలు ఇదెలా జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  14. ఐరాస - గాజా తీర్మానం: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరికి కారణం ఇదే - మంత్రి జైశంకర్

    విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్ ఉగ్రవాద బాధిత దేశమని, అందుకే ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.

    గాజాలో కాల్పులు విరమించి చర్చలు జరపాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ(జనరల్ అసెంబ్లీ)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.

    ''ఈ రోజు మనం కఠిన వైఖరి తీసుకున్నాం. ఎందుకంటే, మనం కూడా ఉగ్రవాదం బాధితులమే. ఇతరులపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో మనపై దాడి జరిగినప్పుడు టెర్రరిజంపై కఠినంగా వ్యవహరించాలని మనం చెప్పలేం. మనం కఠిన వైఖరి అవలంబించాల్సిందే'' అని ఆయన అన్నారు.

    ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    గాజాలో శాంతి పునరుద్ధరణకు మానవతా దృక్పథంతో చర్చలు జరగాలని పిలుపునిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చాలా దేశాల నుంచి మద్దతు లభించింది. తీర్మానానికి మద్దతుగా 120 దేశాలు ఓటు వేశాయి. అమెరికా సహా 14 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఇండియా సహా 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

    యూఎన్

    ఫొటో సోర్స్, UN Photo/Evan Schneider

    ఫొటో క్యాప్షన్, గాజా తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరైన 45 దేశాల్లో భారత్ ఒకటి.

    ఆయా దేశాల ఓటింగ్ తీరు ఏం సూచిస్తోంది?

    గాజా తీర్మానానికి చాలా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి. తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించగా, యూకే, కెనడా ఓటింగ్‌‌కు దూరంగా ఉన్నాయి.

    యూరోపియన్ యూనియన్ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపినప్పటికీ యూనియన్‌లోని దేశాలు ఓటింగ్ విషయంలో విడిపోయాయి. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌‌కు ఉందని సమర్థించిన జర్మనీ, ఇటలీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ మారణహోమంలో మమ్మల్ని భాగస్వాములను చేయొద్దంటూ స్పెయిన్ వంటి ఇతర దేశాలు యూరోపియన్ యూనియన్‌ను కోరాయి.

    అటు హమాస్‌, ఇటు ఇజ్రాయెల్‌‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది.

    మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాలు తీర్మానానికి మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యను చాలా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇరాక్, ట్యునీషియా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

    దక్షిణ అమెరికాలోని చాలా దేశాలు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకునేందుకు కూడా సిద్ధమని కొలంబియా హెచ్చరించింది. గాజాపై బాంబులు కురిపించడాన్ని బ్రెజిల్ తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేసింది. పరాగ్వే మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించింది.

    చైనా సహా ఆసియాలోని పలు దేశాలు తీర్మానానికి మద్దతు తెలిపాయి. భారత్ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భారత్ గైర్హాజరైంది.

    ఓటింగ్ తీరు

    ఫొటో సోర్స్, UN

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.