శ్రీనగర్:క్రికెట్ ఆడుతున్న పోలీసు అధికారిపై మిలిటెంట్ల కాల్పులు

'ఈద్గా మైదానంలో స్థానిక యువకులతో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ క్రికెట్ ఆడుతుండగా మిలిటెంట్లు దాడి చేశారు'' అని కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. శ్రీనగర్:క్రికెట్ ఆడుతున్న పోలీసు అధికారిపై మిలిటెంట్ల కాల్పులు

    ఘటనా స్థలంలో పోలీసులు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో పోలీసులు

    క్రికెట్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ పోలీసు అధికారిపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

    ''శ్రీనగర్‌లోని ఈద్గా సమీపంలో స్థానిక యువకులతో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ క్రికెట్ ఆడుతుండగా తీవ్రవాదులు దాడి చేశారు'' అని కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    గాయపడిన ఇన్‌స్పెక్టర్‌ను ఆసుపత్రికి తరలించారు.

    దాడికి పిస్టల్‌ను ఉపయోగించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. వరల్డ్ కప్: ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, పాయింట్ల పట్టికలో టాప్

  4. విశాఖ: పలాస పాసింజర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన రాయగడ పాసింజర్

    రైలు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, రైలు ప్రమాదం

    విశాఖ సమీపంలో కొత్త వలస దగ్గర ఆగి ఉన్న పలాస ప్యాసింజర్‌ను విశాఖపట్నం నుంచి వస్తున్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ వెనక నుంచి ఢీ కొట్టింది.

    ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు దెబ్బతిన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అధికారులు అక్కడ సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు వెల్లడించింది.

    ప్రమాద ప్రాంతం నుంచి వచ్చిన వీడియోలను పరిశీలించినప్పుడు పలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. .

    అంబులెన్సులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

    ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    (ఈ వార్త అప్ డేట్ అవుతోంది. )

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    రైలు ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    సీఎం దిగ్భ్రాంతి

    విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైతుల ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వై.ఎ‌స్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

    విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  5. హమాస్‌ను తుడిచిపెట్టడం ఇజ్రాయెల్‌కు అంత ఈజీ కాదా?

  6. భారత్ vs ఇంగ్లండ్: 81 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు తడబడుతోంది. టీమిండియా బౌలర్లు ఆదిలోనే నాలుగు కీలక వికెట్లు తీసి, ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టారు.

    ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగుతోంది. 81 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 6వ వికెట్ కోల్పోయింది.

  7. మెక్సికోలో భారీ దోపిడీ, రంగంలోకి 17 వేల మంది భద్రతా సిబ్బంది

    తుపాను ధాటికి రిసార్టులు, హోటళ్లు దెబ్బతిన్నాయి.

    ఫొటో సోర్స్, EPA

    మెక్సికోలోని అకాపుల్కో సిటీలో ప్రజలు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడ్డారు. ఓటిస్ తుపాను సృష్టించిన విధ్వంసం తర్వాత ఈ ఘటనలు జరిగాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

    దోపిళ్లను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా 17,000 మంది సైనికులు, పోలీసులను మోహరించింది.

    కొన్ని వీడియోలలో ప్రజలు దుకాణాల నుంచి ఆహారం, నీరు ఎత్తుకెళుతుండగా, మరికొందరు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు దోచుకోవడం కనిపిస్తోంది.

    తుపాను కారణంగా ఇప్పటివరకు 39 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని స్థానిక ప్రభుత్వం తెలిపింది.

    రిసార్ట్ సిటీ అకాపుల్కో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇక్కడ 80 శాతం హోటళ్లు, రిసార్ట్‌లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  8. కేరళ: కొచ్చిలోని క్రైస్తవ కమ్యూనిటీ సెంటర్‌లో బాంబు పెట్టిన వ్యక్తి గురించి పోలీసులు ఏం చెప్పారు?

  9. భారత్ vs ఇంగ్లండ్: తడబడ్డ భారత బ్యాటింగ్, ఇంగ్లండ్ లక్ష్యం 230 పరుగులు

    భారత్ ఇంగ్లండ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    వరల్డ్ కప్ 2023లో భాగంగా లఖ్‌నవూలో జరుగుతున్న వన్డేలో భారత జట్టు ఇంగ్లండ్‌కు 230 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

    టాస్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

    భారత జట్టు ఆది నుంచి తడబడుతూనే ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు సాధించేందుకు శ్రమిస్తుండగా, ఇటుపక్క ఒక్కో వికెట్ కూలుతూ వచ్చింది.

    రోహిత్‌తో కలిసి ఓపెనర్ గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 0, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులకు అవుట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడినట్లు కనిపించింది.

    అయితే, కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను ఎత్తుకున్న కె.ఎల్.రాహుల్ 39 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు.

    సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.

    101 బంతుల్లో 87 పరుగులు చేసి రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి ఒక పరుగు తేడాలో సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యారు.

    రవీంద్ర జడేటా 8 పరుగులు, షమీ 1 పరుగు మాత్రమే చేశారు. బుమ్రా 16 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కులదీప్ యాదవ్‌ 9 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

    ఇంగ్లండ్ జట్టులో డేవిడ్ విల్లే 3 వికెట్లు, వోక్స్, రషీద్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

  10. గాజాపై దాడులు: ‘పరిస్థితి ఘోరంగా ఉంది, గాజా ఈ భూమితో సంబంధాలు కోల్పోయింది’

  11. గాజాలో బాంబు పేలుళ్ళ నడుమ బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కథ

  12. క్రికెట్ వరల్డ్ కప్ 2023: భారత్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ఏంటి... ఇంగ్లండ్‌తో జరిగే పోరులో విజయం సాధిస్తుందా?

  13. కేరళ: కోచ్చిలోని కన్వెన్షన్ సెంటర్‌లో రెండు బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి

    కొచ్చిలో పేలుళ్లు

    ఫొటో సోర్స్, Social media

    ఫొటో క్యాప్షన్, పేలుడు సంభవించిన ప్రాంతం

    కేరళ రాష్ట్రం, కోచ్చిలోని జెహోవా విట్‌నెస్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు పేలుళ్లు సంభవించాయి.

    జెహోవా విట్‌నెస్ కన్వెన్షన్ సెంటర్‌లో కొనసాగుతున్న మూడురోజుల కార్యక్రమంలో చివరి రోజైన ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    ఆ సమయంలో భారీ శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.

    కేరళ అడిషనల్ డీజీపీ అజిత్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, హాల్లో రెండు పేలుళ్లు సంభవించినట్లు తెలిపారు. ఆ సమయంలో అందులో రెండువేల మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

    పేలుళ్లలో ఒకరు మరణించారని, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. , ఇజ్రాయెల్ అందర్నీ యుద్ధంలోకి దించేలా కనిపిస్తోందన్న ఇరాన్ అధ్యక్షుడు

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

    ఫొటో సోర్స్, Reuters

    ఇజ్రాయెల్ ఎర్ర గీత దాటిందని, అది మిగతా దేశాలను యుద్ధంలోకి దిగేలా చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు.

    "మమ్మల్ని ఏమీ చేయొద్దని అమెరికా కోరుతోంది. కానీ, అ దేశం ఇజ్రాయెల్‌కు విస్తృతంగా మద్దతు ఇస్తోంది" అని రైసీ ఆదివారం ట్వీట్ చేశారు.

    ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలకు దూరంగా ఉండాలని, ఘర్షణలు మరింత పెరిగే విధంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని అమెరికా అధికారులు ఇరాన్‌ను హెచ్చరిస్తున్నారు.

    హమాస్‌తో పాటు లెబనాన్ స్థావరంగా పని చేస్తున్న హిజ్బొల్లా గ్రూప్‌కు ఇరాన్ మద్దతు ఇస్తోంది. ఇటీవలి వారాల్లో హిజ్బొల్లా, ఇజ్రాయెల్ సాయుధుల మధ్య కాల్పులు జరిగాయి.

  15. గాజాలో క్షేత్రస్థాయి దాడులు కొనసాగుతాయి-నెతన్యాహు

    బెంజమిన్ నెతన్యాహు

    ఫొటో సోర్స్, AFP

    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    హమాస్‌ లక్ష్యంగా తాము మొదలుపెట్టిన యుద్ధంలో రెండో దశకు చేరామని, ఇది దీర్ఘకాలం కొనసాగవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

    టీవీ ఛానల్‌లో ప్రసారమైన ప్రసంగంలో ఆయన, “ఇజ్రాయెల్ కమాండర్లు గాజా అంతటా ఉన్నారు. శత్రువుపై పట్టుసాధించేందుకు మరిన్ని దళాలను పంపుతున్నాం” అని తెలిపారు.

    గాజాలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హమాస్ అదుపులో ఉన్న వారి భద్రతపై ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులతో ప్రధాని సమావేశమయ్యారు.

    హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించడం ఇజ్రాయెల్ సైన్యపు లక్ష్యాల్లో భాగమని తెలిపారు.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి